అమర్‌దీప్‌ మీద కేకలేసిన శోభ, కేక్‌ కోసం ఫైటింగ్‌! | Bigg Boss 7 Telugu: Space Ship Challenge for Contestants, Tattoo Task for Teja | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: టాటూ ట్విస్ట్‌.. ఐ లవ్యూ చెప్పిన తేజ.. థూ అని ఊసిన శోభ.. చులకనవుతున్న అమర్‌!

Published Fri, Oct 20 2023 10:35 AM | Last Updated on Fri, Oct 20 2023 11:07 AM

Bigg Boss 7 Telugu: Space Ship Challenge for Contestants, Tattoo Task for Teja - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు గులాబీపురం, జిలేబిపురం అనే గ్రామస్థులుగా విడిపోయారు. వీరిలో ఏ గ్రూపు గ్రహాంతరవాసులను మెప్పిస్తుందో ఆ గ్రూపులోని వారు కెప్టెన్సీకి పోటీపడతారు. ఇప్పటికే ఓ టాస్కులో జిలేబిపురం గెలిచింది. మరి తాజా(అక్టోబర్‌ 19) ఎపిసోడ్‌లో ఎవరు గెలిచారు? అనేది చూసేద్దాం..

మళ్లీ బుసలు కొట్టిన మోనిత
గులాబీపురం, జిలేబిపురం గ్రామప్రజలుగా కంటెస్టెంట్లు జీవించేస్తున్నారు. ఇక తేజ అయితే పెళ్లి రోజు, తొలి రాత్రి అంటూ శోభా శెట్టితో సరసాలాడాడు. మిగతావారు కూడా ఏమీ తక్కువ తినలేదు. ఎవరికి వారు తమ టాలెంట్‌ చూపించారు. ఇంతలో అండర్‌ వాటర్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో అమర్‌-సందీప్‌ బాగానే కష్టపడ్డారు. కానీ చివరకు జిలేబిపురాన్ని గెలిపించాడు సందీప్‌. దీంతో శోభాలో ఉన్న మోనిత ఒక్కసారిగా నిద్రలేచింది. గెలుస్తానన్న నమ్మకం లేకపోతే వెళ్లకూడదు.. ప్రతీది ఓడిపోతున్నాం అంటూ అమర్‌దీప్‌ మీద అరిచేసింది.

బోణీ కొట్టిన గులాబీపురం..
తర్వాత స్పేస్‌ షిప్‌ ఛాలెంజ్‌లో ప్రశాంత్‌, గౌతమ్‌ పోటీపడ్డారు. ఈసారి టాస్కులో గౌతమ్‌.. గులాబీపురాన్ని గెలిపించాడు. దీంతో మొదటి బోణీ కొట్టడంతో గులాబీపురం గ్రామస్తుల ముఖాలు వికసించిపోయాయి. అయితే జిలేబీపురానికి చెందిన ప్రియాంక డల్‌గా కూర్చోవడంతో ఆమె దగ్గరకు వెళ్లిన అమర్‌.. మాకొచ్చింది ఒకటేలే.. సల్లబడు అన్నాడు. సల్లబడు ఏంటి? ఓవర్‌గా మాట్లాడకు అని ఫైర్‌ అయింది. నేను సరదాగా అన్నానంటూ అమర్‌ చెప్పినా తను పట్టించుకోలేదు. అలిగి వెళ్లిపోయింది. తర్వాత ప్రియాంక దగ్గరకు వెళ్లిన అమర్‌ సారీ చెప్పాడు. మొన్నటివరకు శివాజీ, ప్రశాంత్‌తో గొడవపడ్డ అమర్‌దీప్‌ ఈరోజు తన స్నేహితులిద్దరితోనూ మాటలు పడాల్సి వచ్చింది.

శోభా పేరు పచ్చబొట్టు వేయించుకోమన్న బిగ్‌బాస్‌
ఇదిలా ఉంటే కిచెన్‌లో టాటూ గురించి కబుర్లు చెప్పుకున్నారు తేజ, శోభ, పూజా మూర్తి. ఇది విన్న బిగ్‌బాస్‌ పచ్చబొట్టు వేయించుకోవచ్చుగా అని తేజకు సలహా ఇచ్చాడు. సరదాగా అన్నాడేమో అని లైట్‌ తీసుకునేలోపే పదేపదే పచ్చబొట్టు విషయాన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. శోభ పేరు టాటూ వేయించుకోవాలని, ఏ డిజైన్‌ కావాలో సెలక్ట్‌ చేసుకో అని ఓ పేపర్‌ కూడా పంపించాడు. అసలే పెళ్లి కావాల్సినవాడిని, ఈ పచ్చబొట్టు నా వల్ల కాదంటూ బిగ్‌బాస్‌కు మొర పెట్టుకున్నాడు తేజ. బయటకు వెళ్లాక (పెళ్లికి) అవకాశముందని చెప్తే వేయించుకుంటానని తేజ అనగా వేయించుకో అని ఆటపట్టించింది శోభ.

అమర్‌ మీద పడ్డ శోభ
రాత్రి తేజ కోసం బిగ్‌బాస్‌ ఓ కేక్‌ పంపించాడు. దానిపై శోభ అని రాసి ఉంది. ఇది ముగింపు కాదు, ముందుంది ముసళ్ల పండగ అంటూ ఓ లేఖ సైతం పంపాడు. తనకు ఎందుకు వార్నింగ్‌ ఇచ్చాడో అని జుట్టు పీక్కున్నాడు తేజ. ఇంతలో అమర్‌.. కేక్‌ను ఎంతసేపు చూస్తూ కూర్చోవాలని ఓ ముక్క లటుక్కున తినేశాడు. అప్పుడు తేజ, శోభ.. ఇద్దరూ అమర్‌ మీద అరిచారు. కేక్‌ మీద నా పేరుంది.. ఎలా తిన్నావని ఆగ్రహించింది శోభ.

శోభకు ఐ లవ్‌ యూ చెప్పిన తేజ
చాలా సేపు తల గోక్కున్న తర్వాత తేజ కేక్‌ కట్‌ చేసి అందరికీ తలా ఓ ముక్క ఇచ్చాడు. అంతా అయిపోయాక శోభను గార్డెన్‌కు పిలిచాడు. కేక్‌ ఎందుకు పంపించాడు? దానిపై నీ పేరు ఎందుకు రాశాడు? అంటూ ప్రశ్నల చిట్టా చదివాడు తేజ. ఏదో చెబుతావనుకుంటే సోది చెప్తున్నావంటూ శోభా కోపంగా లేచింది. దీంతో తేజ సడన్‌గా ఐ లవ్‌ యూ చెప్పడంతో థూ అని ఊసేసి ముందుకు వెళ్లిపోయింది శోభ. మొత్తానికి తేజ-శోభ లవ్‌ ట్రాక్‌ కోసం బిగ్‌బాస్‌ గట్టిగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.

చదవండి: ‘టైగర్‌ నాగేశ్వరరావు’ మూవీ ట్విటర్‌ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement