ర్యాంప్‌ ఆడించిన గౌతమ్‌, తేజ.. భయపడే రకం కాదు! | Bigg Boss Telugu 8: Yashmi, Teja and Gautham, Prithvi Argues in Nominations | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: నాదే కాదు యష్మిదీ తప్పేనన్న తేజ.. భయపడేదేలే!

Published Mon, Nov 11 2024 6:33 PM | Last Updated on Mon, Nov 11 2024 7:18 PM

Bigg Boss Telugu 8: Yashmi, Teja and Gautham, Prithvi Argues in Nominations

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌ పది మంది మాత్రమే మిగిలారు. మీలో మీరు కొట్టుకు చావండి అంటూ బిగ్‌బాస్‌ నామినేషన్స్‌ ప్రక్రియ ఇచ్చాడు. నామినేట్‌ చేయాలనుకునే వ్యక్తి ఫోటోకు పెయింట్‌ వేసి పాడు చేయాలన్నాడు. అలా గౌతమ్‌.. పృథ్వీని, తేజ.. యష్మిని నామినేట్‌ చేశాడు. ఈ క్రమంలో పెద్ద గొడవలే జరిగాయి.

భయపడేదేలె..
తనను నామినేట్‌ చేసిన పాయింట్ల గురించి పృథ్వీ చర్చ మొదలుపెట్టగా నీ మాటలకు వేరేవాళ్లు భయపడతారేమో.. నేను భయపడను అన్నాడు గౌతమ్‌. ఇక ఎవిక్షన్‌ షీల్డ్‌ టాస్క్‌లో జంటగా వెళ్లిన తేజ, యష్మి.. ఏకాభిప్రాయానికి రాకుండా ఎవరికి నచ్చిన వ్యక్తుల్ని వారు సైడ్‌ చేసేశారు. 

నాది తప్పే.. నీది కూడా తప్పే
అయితే మొదట తేజ ఆ పని చేయడంతో అందుకు తగ్గ పరిణామాల్ని ఎదుర్కొన్నాడు. కంటెండర్‌ రేసులో లేకుండా పోవడమే కాకుండా ఫ్యామిలీ వీక్‌ కూడా తనకు ఉండబోదని చెప్పాడు. ఏకాభిప్రాయానికి రాకముందే పాము నోట్లో తాను గుడ్డు వేయడం ఎంత తప్పో.. తను వేశాక కూడా యష్మి వచ్చి మరో గుడ్డు వేయడం అంతే తప్పు అని తేజ కుండబద్ధలు కొట్టి చెప్పాడు.

ర్యాంప్‌ ఆడించారు
అది తప్పనుకుంటావో, ఒప్పనుకుంటావో నీ ఇష్టం అని యష్మి చెప్తుంటే అనుకోవడమేముంది.. అది తప్పే.. అని తేజ కౌంటరిచ్చాడు. నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను.. నా తర్వాత నీది కూడా తప్పే అని సమాధానమిచ్చాడు. దీంతో యష్మి నువ్వు చేసింది తప్పే.. అని అరిచింది. ప్రోమోలో అయితే గౌతమ్‌, తేజ ర్యాంప్‌ ఆడించినట్లు కనిపిస్తోంది.

 

 మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement