Bigg Boss 7: అందరితోనూ శోభా గొడవలు.. అడ్డంగా దొరికిపోయిన తేజ! | Bigg Boss 7 Telugu Day 2 Episode Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 2 Highlights: హీటెక్కిన హౌస్‌.. ఆ ఎనిమిది మంది నామినేట్.. ఆమెను టార్గెట్‌ చేశారా?

Published Tue, Sep 5 2023 10:45 PM | Last Updated on Wed, Sep 6 2023 9:57 AM

Bigg Boss 7 Telugu Day 2 Episode Highlights - Sakshi

'బిగ్‌బాస్ 7' మొదలైన రెండో రోజుకే గొడవలు షురూ అయ్యాయి. సోమవారం ఎపిసోడ్‌లో శివాజీ, ప్రియాంక మాత్రమే నామినేషన్స్ పూర్తి చేశారు. మంగళవారం మిగిలిన వాళ్లందరూ తమ తమ నామినేషన్స్ కంప్లీట్ చేశారు. ఈ క్రమంలోనే హౌస్ అంతా గొడవ గొడవగా మారింది. శోభాశెట్టి.. పలువురు కంటెస్టెంట్స్‌తో మాటామాటా అనుకుంది. టేస్టీ తేజ ఓ విషయమై అడ్డంగా దొరికిపోయాడు. ఇంతకీ రెండో రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు Day 2 హైలైట్స్‌లో చూద్దాం.

గౌతమ్ vs శోభాశెట్టి
మంగళవారం ఎపిసోడ్‌లో భాగంగా తొలుత శోభాశెట్టిని బిగ్‌బాస్.. యాక్టివిటీ రూంలోకి పిలిచారు. గౌతమ్, కిరణ్ రాథోడ్‌ని ఆమె నామినేట్ చేసింది. తెలుగు సరిగా రాకపోవడం, మాట్లాడని కారణంగా కిరణ్‌ని నామినేట్ చేశానని చెప్పింది. కనెక్ట్ కాకపోవడం, బాండింగ్ ఏర్పడకపోవడం, పాజిటివ్ వైబ్స్ రాకపోవడంతో గౌతమ్‌ని నామినేట్ చేసినట్లు చెప్పింది. బయటకొచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడుతూ.. 'నువ్వు వినడానికే రెడీగా లేవు' అని గౌతమ్‌తో శోభాశెట్టి గొడవ పెట్టుకుంది.

శోభా ఏడుపు
ఆ తర్వాత దామిని.. రతికని నామినేట్ చేసింది. డల్‌గా ఉందని, కిచెన్‪‌లో హెల్ప్ చేయలేదని కారణం చెప్పింది. శోభాశెట్టిని నామినేట్ చేస్తూ.. డిన్నర్ తర్వాత ప్లేట్ కడగలేదని రీజన్ చెప్పింది. ఇకపోతే లాన్‌లో కూర్చుని టేస్టీ తేజ-శోభాశెట్టి మాట్లాడుకున్నారు. తాను సహాయం చేస్తున్న అందరూ తననే నామినేట్ చేస్తున్నారని శోభా వలవలా ఏడ్చేసింది.

దొరికిపోయిన తేజ
ఇక ప్రిన్స్.. షకీలా, గౌతమ్‌ని నామినేట్ చేశాడు. 'నువ్వు ప్రిన్సా, మీ ఫాదర్ కింగా' అని అన్నందకు షకీలాని నామినేట్ చేశానని అన్నాడు. 'షో హాఫ్' అని తనపై కామెంట్స్ చేసినందుకు గౌతమ్‌ని నామినేట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇది జరిగిన తర్వాత కంటెస్టెంట్స్ అందరిముందే తేజ ఏమన్నాడో గౌతమ్ కృష్ణ.. ప్రిన్స్‌తో చెప్పాడు. దీంతో తేజ అడ్డంగా దొరికిపోయినట్లు అయింది. దీనిపై మాట్లాడిన తేజ.. ఎవరేం చెప్పారో, ఎవరికేం చెప్పాలో అదే చెప్పానని తనని తాను సమర్థించుకున్నాడు. ఫైనల్‌గా తమ మధ్య మిస్ అండర్ స్టాండింగ్ వచ్చిందని ప్రిన్స్-గౌతమ్ హగ్ ఇచ్చుకున్నారు.

కరెక్ట్ కాదని రతిక
ఆట సందీప్.. రతికని నామినేట్ చేశాడు. కిచెన్‌లో కాస్త ఇర్‌రెస్పాన్సిబుల్‌గా ప్రవర్తించిందనే కారణం చెప్పాడు. పనిలో హెల్ప్ చేయట్లేదనే కారణంతో ప్రిన్స్‌ని నామినేట్ చేశాడు. అయితే ఇర్‌రెస్పాన్సిబుల్ అనే పదం తన గురించి ఉపయోగించడం కరెక్ట్ కాదని రతిక, సందీప్‌తో వాగ్వాదం పెట్టుకుంది. మరోవైపు దామిని తనని నామినేట్ చేయడంపై శోభాశెట్టి.. ప్రిన్స్‌తో చాలాసేపు మాట్లాడింది. ఆమె(దామిని) విధానం నచ్చలేదని అతడితో చెప్పుకొచ్చింది.

చెత్త రీజన్ అని ప్రశాంత్
మరోవైపు షకీలా -ప్రిన్స్‌ని నామినేట్ చేసింది. తను సరదాగా 'మీ డాడీ కింగా?' అన్నానని, దానికి అతడు సీరియస్ అయినందుకు నామినేట్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. పల్లవి ప్రశాంత్ తనకు ఎక్కడో కనెక్ట్ కాలేదని నామినేట్ చేసింది. ఏదైనా పని చెబుతుంటే సరిగా పలకట్లేదని కారణం చెప్పుకొచ్చింది. షకీలా తనని ఓ చెత్త రీజన్‌కి నామినేట్ చేశారని తనలో తానే ప్రశాంత్ అనుకున్నాడు. ఇక గౌతమ్.. అందరిలో తక్కువ పని చేశారనే కారణంతో శోభాశెట్టి, ప్రిన్స్‌ని నామినేట్ చేశాడు. బయటకొచ్చిన తర్వాత మరోసారి గౌతమ్-శోభాశెట్టి మాటలతో కొట్లాడుకున్నారు.

శోభాశెట్టి పశ్చాత్తాపం
శుభశ్రీ.. రతిక, శోభాశెట్టిని నామినేట్ చేసింది. వాళ్లిద్దరికీ కనెక్ట్ కాలేకపోయానని, అలానే హౌసులో వాళ్లు పెద్దగా పనిచేయట్లేదని కారణాలు చెప్పుకొచ్చింది. గౌతమ్ చెప్పడం వల్లే శుభశ్రీ తనని నామినేట్ చేసిందని, ఇలాంటి మనుషులతో ఉండలేను బాబోయ్ అని శోభా తెగ పశ్చాత్తాప పడిపోయింది. ఇకపోతే పల్లవి ప్రశాంత్.. వీక్‌గా ఉన్నారని చెప్పి షకీలా, కిరణ్ రాథోడ్‌ని నామినేట్ చేశాడు. అమర్‌దీప్.. ప్రిన్స్, తేజని నామినేట్ చేశాడు. కిరణ్ రాథోడ్.. ప్రశాంత్, శోభాశెట్టిని నామినేట్ చేసింది. టేస్టీ తేజ.. ప్రశాంత్, కిరణ్‌ని నామినేట్ చేశాడు. మరోవైపు రతిక.. ప్రియాంక, దామినిని నామినేట్ చేసింది. అయితే ప్రియాంకని నామినేట్ చేస్తానని ముందే ఆమెకు రతిక చెప్పి వెళ్లింది.  ఓవరాల్‌గా ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్‌లో నిలిచారు.  

నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే

  1. శోభా
  2. రతిక
  3. ప్రిన్స్
  4. ప్రశాంత్
  5. కిరణ్
  6. గౌతమ్
  7. షకీలా
  8. దామిని
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement