'బిగ్‌బాస్ 7'.. గత రెండు వారాలతో పోలిస్తే రోజురోజుకీ వెరైటీగా మారుతోంది. ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా కాస్త హడావుడి జరిగినా.. తర్వాతి రోజుకే అది చల్లారిపోయింది. మరోవైపు మూడో పవరస్త్ర కోసం ముగ్గుర్ని సెలెక్ట్ చేసిన బిగ్‌బాస్.. హౌస్ మొత్తాన్ని ఆగమాగం చేసేశాడు. ఇందులో భాగంగా బుధవారం కూడా శోభాశెట్టి, ప్రిన్స్ యవర్ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఇంతకీ హౌసులో 17వ రోజు ఏం జరిగిందనేది Day-17 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
ఒకే ప్లేటులో తిన్నారు
మంగళవారం జరిగిన పవరస్త్ర టాస్కులో యవర్.. అనర్హుడని రతిక నామినేట్ చేసింది. తనతోనే ఉంటూ తననే వెన్నుపోటు పొడవడంపై తొలుత కాస్త ఇబ్బందిపడ్డ ప్రిన్స్.. తనని తాను సంభాళించుకున్నాడు. రతికతోనే మాట్లాడుతూ.. తనకు ఏం ప్రాబ్లమ్ లేదని ఆమెకే చెప్పుకొచ్చాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. రాత్రి ఒకే ప్లేటులో కలిసి భోజనం కూడా చేశారు. ఇది చూసి శుభశ్రీ, దామిని, గౌతమ్.. గుసగుసలాడుకున్నారు.
(ఇదీ చదవండి: రతిక బండారం బయటపెట్టిన మాజీ బాయ్‌ఫ్రెండ్!)
శివాజీ పవరస్త్ర గొడవ
తన పవరస్త్ర దొంగిలించారని పిల్లాడిలా శివాజీ గిలగిలా కొట్టేసుకుంటూనే ఉన్నాడు. సందీప్‌తో మాట్లాడుతూ తేజపై అనుమానం వ్యక్తం చేశాడు. వాడిని నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తే, ఇలా చేస్తాడా? వాడికి అసలు అర్హతే లేదని అంటూ రెచ్చిపోయాడు. మరోవైపు పవరస్త్ర కొట్టేసిన అమరదీప్.. శివాజీ, రతిక బెడ్స్ దగ్గర టిష్యూ పేపర్‌పై ఏఏ, ఏ ఏడీ అని రాసి హింట్స్ ఇచ్చేలా పెట్టాడు. కానీ వాళ్లు కనిపెట్టలేకపోయారు.
యవర్‌ని ఆటాడేసుకున్నారు
అయితే పవరస్త్ర పోటీలో ఉన్న ప్రిన్స్ యవర్.. కంటెండర్‌గా నిలబడాలంటే ఓ పోటీ తట్టుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. ఇందులో భాగంగా ఓ బల్లపై గడ్డం పెట్టాలి. అతడిని నామినేట్ చేసిన తేజ, దామిని, రతిక డిస్ట్రబ్ చేస్తారు. కదలకుండా గంటసేపు నిలబడాలని రూల్ పెట్టాడు. దీన్ని పాటించిన యవర్.. కదలకుండా అలానే నిలబడ్డాడు. అయితే దామిని,రతిక, తేజ మాత్రం.. పేడ, గడ్డి, శాంపూ నీళ్లు, ఐస్ గడ్డలతో ఆటాడేసుకున్నారు. కానీ యవర్ ఇందులో గెలిచి నిలబడ్డాడు.
(ఇదీ చదవండి: హీరోయిన్ సాయిపల్లవి పెళ్లి రూమర్స్.. అసలేం జరిగింది?)
శోభాశెట్టి vs గౌతమ్
ఇక యవర్ టాస్క్ అయిపోయిన తర్వాత శోభాశెట్టిని నామినేట్ చేసిన వాళ్ల వీడియోలు చూపించారు. ప్రశాంత్, శుభశ్రీ వరకు పెద్దగా పట్టించుకుని ఈమె.. గౌతమ్ తో మాత్రం పెద్ద గొడవ పెట్టుకుంది. ఫిజికల్‌గా స్ట్రాంగ్ అని కారణం చెప్పడంపై శోభా మండిపడింది. తను శారీరకంగా బలంగా లేకపోతే.. పుల్ రాజా పుల్ టాస్కులో ఎలా గెలుస్తాను, కుస్తీ పోటీల్లో ఎలా గెలుస్తాను అంటూ గొడవ పెట్టుకుంది. దీంతో గౌతమ్.. తను అనుకున్న కారణాలు చెబుతూ షర్ట్ విప్పేశాడు.
అయితే అతడు షర్ట్ తీసి షో హాఫ్ చేస్తున్నాడని శోభాశెట్టి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో గౌతమ్ మరింత రెచ్చిపోయాడు. అవసరమైతే ప్యాంట్ కూడా తీసేస్తానని అన్నాడు. అలా మాటామాట పెరిగిన ఒకానొక టైంలో.. 'అసలు నీకు హౌసులో ఉండటానికి అర్హతే లేదు' అని గౌతమ్ నోరుజారాడు. దెబ్బకు శోభాశెట్టి కౌంటర్ ఇచ్చింది. 'హౌసులో నీకంటే ఎక్కువ రోజులు ఉండి చూపిస్తా' అని ఛాలెంజ్ చేసింది. అయితే ఈ గొడవంతా చూస్తుంటే.. కార్తీకదీపం మోనిత శోభాశెట్టిని పూనిందేమో అని ప్రేక్షకులకు డౌట్ వచ్చింది. మరోవైపు అమరదీప్‌ని ప్రియాంక నామినేట్ చేసిన వీడియోని కూడా ప్లే చేశారు. అలా బుధవారం ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ పడింది.
(ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చేస్తున్న మెగాహీరో సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే)
Comments
Please login to add a commentAdd a comment