బిగ్‌బాస్ 7లో ఈ వారం నామినేషన్ హడావుడి ముగిసింది. 8 మంది లిస్టులో ఉన్నారు. తాజాగా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులు షురూ చేశాడు. ఓ రెండు గేమ్స్ జరిగాయి. మరోవైపు హౌసులో ఇప్పటికే మాటలతో మాయ చేస్తూ బండి లాక్కొచ్చేస్తున్న శివాజీ.. శోభా-తేజ మధ్య పుల్లపెట్టి మంట ఎక్కువ చేస్తే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 52 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
అతి చేస్తున్న శివాజీ
నామినేషన్స్ పూర్తవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం అందరూ నిద్రలేవడంతో బుధవారం ఎపిసోడ్ స్టార్టయింది. ఇక అయిపోయిన నామినేషన్ గురించి శివాజీ ఏదేదో మాట్లాడాడు. 'నామినేషన్ అనేది తెలివైన ప్రక్రియ. కానీ ఆ టైంలో కారణాలు లేకుండా, కొందరు హీరో అయిపోదామని ఎగిరెగిరి పడుతున్నారు. ఈ ప్రక్రియని అపహాస్యం చేస్తున్నారు' అని సీరియల్ బ్యాచ్‌ని ఉద్దేశిస్తూ అన్నాడు. అయితే ఆ ఎగిరెగిరి పడేవాళ్లలో ప్రశాంత్ కూడా ఉన్నాడు. అంటే శివాజీ లెక్క ప్రకారం.. ప్రశాంత్‌కి కూడా ఈ కామెంట్ వర్తిస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ కూడా నామినేషన్స్‌లో తప్ప మిగతా రోజులు గేమ్స్ ఆడినా సరే ఉన్నాడా లేడా అన్నట్లు పవర్తిస్తుంటాడు.
కన్నీళ్లు పెట్టుకున్న శోభా
స్ట్రాంగ్‌గా ఉండే శోభా కన్నీళ్లు పెట్టుకుంది. గత నామినేషన్స్‌లో భోలె మెంటల్ అనడాన్ని గుర్తుచేసుకుని మరీ తేజతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత కాసేపటికి తన ఫ్రెండ్స్ అయిన అమర్-ప్రియాంక-సందీప్ దగ్గర మాట్లాడుతూ.. భోలె ఓ వేస్ట్ కేండిడేట్ అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: నోరు జారిన యాంకర్ సుమ.. మళ్లీ దానిపై సెటైర్లు కూడా!)
కెప్టెన్సీ గేమ్స్ షురూ
ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు 'BB మారథాన్' పేరుతో పోటీ పెట్టనున్నారు. ఇందులో పెట్టే ఒక్కో గేమ్‌లో నలుగురు పోటీ పడతారు. ఇందులో గెలిచిన వాళ్లు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. చివరి స్థానంలో ఉన్నవాళ్లు ఎలిమినేట్ అవుతారు. అలా 'రిజల్ట్ ఏంటో గెస్ చేయాలంతే?' పేరుతో తొలి గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా కొన్ని వస్తువులు నీటిలో వేస్తారు. అవి తేలుతాయో, మునుగుతాయో చెప్పాలంతే.. ఈ పోటీలో ప్రియాంక విజేతగా నిలవగా, అమరదీప్ ఓడిపోయాడు. శోభా, తేజ మధ్య స్థానాలు సంపాదించారు. 'డబ్బాలు సెట్ చేయాలంతే' అనే రెండో గేమ్‌లో ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. రతిక ఎలిమినేట్ అయిపోయింది. గౌతమ్, యవర్ కూడా ఈ గేమ్ ఆడినప్పటికీ మధ్య స్థానాల్లో నిలబడ్డారు అంతే.
పుల్లలు పెడుతున్న శివాజీ
రెండో గేమ్‌లో రతిక ఓడిపోయిన తర్వాత తేజ ఆమెతో జోక్‌గా.. 'ఓడిపోయినందుకు నువ్వు కూడా అన్నం తిననని బిగ్‌బాస్‌తో చెప్పు' అన్నాడు. దీంతో శోభా రెచ్చిపోయింది. తేజతో గొడవ పెట్టుకుంది. ఎందుకలా అన్నావ్ అని గట్టిగా అరుస్తూ వాదన పెట్టుకుంది. మధ్యలో తేజతో మాట్లాడిన శివాజీ.. శోభా గురించి పుల్ల పెట్టే ప్రయత్నం చేశాడు. 'అతి సర్వత్రా వర్జయాత్' అని ఏవేవో సినిమా డైలాగ్స్ కొడుతూ తేజని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇలా చేస్తే తేజ.. శోభాకి దూరమై తన దగ్గరకు వచ్చేస్తాడని శివాజీ ఆశపడుతున్నట్లు ఉన్నాడు. ఒకటి రెండు రోజులు ముందు కూడా శోభా వెనక తిరుగుతున్నాడని తేజకి శివాజీ క్లాస్ పీకాడు. ఇవన్నీ చూస్తుంటే శివాజీ.. బిగ్‌బాస్‌లో ఆడకుండా రాజకీయాలు ఎక్కువ చేస్తున్నాడనిపిస్తోంది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?)
Comments
Please login to add a commentAdd a comment