![Bigg Boss Telugu 8 Tasty Teja Fall Down On Earth](/styles/webp/s3/article_images/2024/10/10/biig.jpg.webp?itok=MnNWL-jD)
బిగ్‌బాస్ షోలో రెండోరోజు కూడా 'హోటల్ టాస్క్' నడుస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ టాస్క్‌లో ఎక్కువగా ఫన్ ఉంటుంది కాబట్టి ఎవర్‌గ్రీన్ అని చెప్పవచ్చు. ఇప్పటికే వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారు రాయల్ టీమ్‌గా బిగ్‌బాస్ హోటల్‌కు అతిథులుగా వెళ్తారు. అయితే, ఓజీ(ఓల్డ్ కంటెస్టెంట్స్) హోటల్ స్టాఫ్‌గా ఉంటారు. తాజాగా విడుదలైన డే-39 ప్రోమో ఫన్‌తో మొదలయ్యి ఆసక్తికరమైన గేమ్‌తో ముగిసింది.
సేవ్ ది వాటర్ ఛాలెంజ్
ఈ టాస్క్‌లో ఇరు జట్లు పోటీపడుతాయి. గెలిచిన వారు రూ. 25వేలు ప్రైజ్ మనీ పొందవచ్చని బిగ్‌బాస్ చెబుతాడు. ఇరు జట్లకు కేటాయించిన ఆక్వేరియంలో ఏ టీమ్ సభ్యులు ఎక్కువ నీళ్లు నింపుతారనేది టాస్క్. అయితే, వాళ్లు నీళ్లు తీసుకునే వెళ్తున్న దారి చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. దానిని దాటుకుని వెళ్తున్న క్రమంలో టేస్టీ తేజ కిందపోడిపోతాడు. కొంత సమయం పాటు అతను అక్కడి నుంచి కదలలేని స్థితిలోనే కనిపించాడు. అతనికేమైనా గాయాలు తగిలి ఉండవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించిన సన్నివేశాలు ప్రోమోలో కనిపిస్తున్నాయి. ఈ టాస్క్‌లో నయని పావని కూడా కిందపడిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment