
టేస్టీ తేజ.. మీలో ఈ పేరు ఎంతమందికి తెలుసు. దాదాపుగా చాలామందికి తెలియదనే చెబుతారు. ఎందుకంటే అతని అంతలా ఫేమ్ ఉన్న వ్యక్తి కాదు. అతన్ని గుర్తు పెట్టుకునేంత ఏం చేశాడని అంటారా?.. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టేంత వరకు కూడా ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. బిగ్ బాస్ షోకు రాకముందు అతను ఏం చేశాడు? తొమ్మిదో కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన టేస‍్టీ తేజను ఈ అవకాశం ఎలా వరించింది? ఆ వివరాల గురించి ఓసారి తెలుసుకుందాం.
(ఇది చదవండి: సుధీర్ బాబు వీడియో లీక్.. అలా మారిపోయాడేంటీ భయ్యా?)
జబర్దస్త్‌తో కెరియర్ స్టార్ చేసిన తేజ.. యూట్యూబర్‌గా ఫేమస్ అయ్యారు. తన సొంత యూట్యూబ్ ఛానల్‌తోనే పాపులరిటీ తెచ్చుకున్నారు. తేజా ఫుడ్ లవర్ కావడంతో అతని పేరు కాస్తా టేస్టీ తేజాగా మారింది. మొదట చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్‌తో తేజా ప్రయాణం మొదలై.. ఆ తర్వాత దూసుకెళ్లాడు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడలో కూడా సెలబ్రిటీలతో టేస్టీ తేజ ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఏకంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. తేజాకి డబ్బులిచ్చి మరీ ఫుడ్ వీడియోలు చేయించుకుంటున్నారంటే మనోడి క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన టేస్టీ తేజ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన గురించి మాట్లాడుతూ ఫుల్ ఎమోషలయ్యారు. ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం.
టేస్టీ తేజకు జబర్దస్త్ కమెడియన్‌గా రాణించేందుకు లైఫ్ ఇచ్చింది మాత్రం అదిరే అభి. ఇంటర్వ్యూలో అతని ఫోటో చూడగానే టేస్టీ తేజ కన్నీళ్లాగలేదు. ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు.
(ఇది చదవండి: 'నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు'.. ఆసక్తిగా ట్రైలర్!)
టేస్టీ తేజ మాట్లాడుతూ..'ఎవరు సార్ ఆయన.. ఆయనకు, నాకు ఏంటి సంబంధం సార్.. నాకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏముంది సార్? .. అంటూ అభిని చూస్తూ చిన్న పిల్లాడిలా బోరున విలపించాడు. తేజ వేరే వాళ్లతో వెళ్దామని చాలా మంది సలహాలిచ్చినా.. లేదు మనోడు చేస్తాడు.. అని నాతో చేయించాడు. ఎప్పుడు ఎక్కడికెళ్లినా ఈయనను మాత్రం మర్చిపోను సార్. జబర్దస్త్‌లో చేసిన పరిచయాల వల్లే నా సొంత యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఫేమస్ అయ్యాను. ఏ సినిమా ప్రమోషన్ అయినా టేస్టీ తేజ వీడియో కచ్చితంగా ఉంటుంది. ఇదంతా అన్న వల్లే సాధ్యమైంది. ఎక్కడున్న అన్న బాగుండాలి.. మాలాంటి వారికి ప్రోత్సహించాలి. అందుకే అన్నను చూడగానే ఏడుపు వచ్చేసింది.' అంటూ ఎమోషనల్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment