బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌.. టేస్టీ తేజకు రిటర్న్‌ గిఫ్ట్‌.. సందీప్‌ పోస్ట్‌ వైరల్‌ | Aata Sandeep Comments On Tasty Teja | Sakshi
Sakshi News home page

Aata Sandeep: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌.. టేస్టీ తేజకు రిటర్న్‌ గిఫ్ట్‌.. సందీప్‌ పోస్ట్‌ వైరల్‌

Nov 5 2023 10:55 AM | Updated on Nov 5 2023 12:02 PM

Aata Sandeep Comments On Tasty Teja - Sakshi

మూడో వారంలో దామిని.. నాలుగో వారంలో రతిక.. ఐదో వారంలో శుభ శ్రీ.. ఆరో వారంలో నయని.. ఏడో వారంలో పూజా.. ఎనిమిదో వారంలో సందీప్.. ఇలా మూడో వారం నుంచి ఎనిమిదవ వారం వరకు వరుసగా తేజా ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ అయిపోతూ వస్తున్నారు. అయితే వరుసగా అందర్ని బయటకు పంపిన తేజ.. ఇప్పుడు తనే బయటకు వచ్చేశాడు. అయితే ఇప్పటికీ అధికారికంగా తెలియదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం తేజ ఎలిమినేట్ అయినట్లు ప్రచారం నడుస్తోంది.

బిగ్‌బాస్ హౌస్‌ నుంచి ఈ వారం నామినేషన్‌లో  శివాజీ, గౌత‌మ్‌, ప్ర‌శాంత్‌, అశ్విని మిన‌హా మిగ‌తా అంద‌రూ ఉన్నారు. ప్రతి వారం మాదిరే ఈ వారంలో కూడా శోభా ఎలిమినేట్‌ అవతుందని అందరూ భావిస్తున్న సమయంలో ఆమె కెప్టెన్‌ కావడంతో సస్పెన్స్‌ మొదలైంది. కెప్టెన్‌ పేరుతో శోభ సేవ్‌ అయితే.. టేస్టీ తేజ ఎలిమినేట్‌ కావడం దాదాపు గ్యారెంటీ అని తెలుస్తోంది. దీంతో తేజ గురించి పలు మీమ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాటిని ఆట సందీప్‌ షేర్‌ చేశాడు. 

బిగ్‏బాస్ హౌస్‏లో మొదటి వారం నుంచి ఇప్పటివరకు తేజ ఎవరిని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ అయిపోయారనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు తేజ నామినేట్‌ చేసిన ఆరుగురు హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యారు.  ఈ లిస్ట్‌లో వరుసుగా దామిని భట్ల,రతికా రోజ్‌, శుభ శ్రీ, నయని పావని, పూజా,ఆట సందీప్‌ ఉన్నారు. ఇలా మూడో వారం నుంచి వరుసగా తేజా ఎవరిని నామినేట్ చేస్తే వాళ్లు ఎలిమినేట్ కావడంతో ఆయనది ఐరన్‌ లెగ్‌ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు చేశారు.

ఇలా అందరినీ హౌస్‌ నుంచి బయటకు పంపిన తేజా ఈ వారం ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంపై ఆట సందీప్‌, తేజ గురించి పలు మీమ్స్‌ ఇన్‌స్టాలో వైరల్‌ అవుతున్నాయి. వాటిలో కొన్నింటిని సందీప్‌ షేర్‌ చేశాడు. 'కర్మ ఇట్స్‌ బ్యాక్‌.. హౌస్‌లో మంచి ప్లేయర్‌ అయిన సందీప్‌ను చెత్త కారణాలతో పంపించేశావ్‌.. ఇప్పుడు నువ్వు కూడా అలాంటి చెత్త రీజన్‌తో బయటకు వస్తున్నావ్‌..' అంటూ సందీప్‌ ఫ్యాన్స్‌ వైరల్‌ చేస్తున్నారు. అవన్నీ కూడా నవ్వులు పూయించేలా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement