బిగ్‌బాస్ 7వ సీజన్‌లో స్ట్రాంగ్ వికెట్ పడిపోయింది. బలమైన కంటెస్టెంట్, టాప్-5లో ఉంటాడని అందరూ అనుకున్న కొరియోగ్రాఫర్ సందీప్ ఎలిమినేట్ అయిపోయాడు. ఎనిమిదో వారం తక్కువ ఓట్లు పడటంతో హౌస్ నుంచి బయటకొచ్చేశాడు. వెళ్తూ వెళ్తూ ఎమోనషల్ అయ్యాడు. అలానే ఇన్నాళ్లు హౌసులో ఉండి గట్టిగా సంపాదించాడు. ఇంతకీ ఎన్ని లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నాడో తెలుసా?
సందీప్ ఎలిమినేట్
ఈ వారం మొత్తం ఎనిమిది నామినేట్ అయ్యారు. వీళ్లలో ప్రియాంక, గౌతమ్ సేవ్ అయినట్లు శనివారం ఎపిసోడ్‌లో నాగ్ ప్రకటించాడు. మిగతా వాళ్లలో శివాజీకి ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. భోలె, అమరదీప్, అశ్విని కూడా తమ తమ ఓటు బ్యాంకుతో బతికిపోయారు. చివరి రెండు స్థానాల్లో నిలిచిన శోభా, సందీప్.. ఎవరు వెళ్తారా అని కాస్త సస్పెన్స్ నడిచింది. ఫైనల్‌గా సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయాడు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: సందీప్ ఎలిమినేట్.. ఏడుస్తూ ఆ నిజం చెప్పేసిన శోభా!)
సీరియల్ బ్యాచ్ కష్టమే
ప్రస్తుతం బిగ్‌బాస్ హౌసులో రెండు గ్రూపులు తయారయ్యాయి. శివాజీ ఒక దాన్ని నడిపిస్తున్నాడు. మరోవైపు అమరదీప్, ప్రియాంక, శోభాశెట్టి, సందీప్, తేజ ఓ గ్రూపుగా ఆడుతున్నారు. మొన్నీ మధ్య ఈ గ్రూపుల బాగోతం బయటపడింది. ఇప్పుడు సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోవడంతో సీరియర్ బ్యాచ్ బలహీనమైపోయింది. వచ్చే వారం నుంచి శివాజీ గ్రూప్, వీళ్లపై మరింతగా రెచ్చిపోతారేమో!
రెమ్యునరేషన్ అన్ని లక్షలా?
వచ్చే తొలివారమే హౌస్‌మేట్ అయిన సందీప్ ఐదువారాల ఇమ్యూనిటీ దక్కించుకున్నాడు. అది అయిపోయిన తర్వాత కూడా నామినేషన్స్‌లోకి రాలేదు. ఈసారి తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చాడు. ఎలిమినేట్ అయిపోయాడు. అయితేనేం దాదాపు ఎనిమిది వారాలు ఇంట్లో ఉన్నాడు. వారానికి రూ.2.75 లక్షలు చొప్పున.. రూ.22 లక్షలు పైనే వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ రకంగా చూసుకుంటే ఇది మంచి అమౌంట్ అని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో సందీప్ ఎలిమినేషన్.. ఆ ఒక్కటే మైనస్ అయిందా?)
Comments
Please login to add a commentAdd a comment