'బిగ్‌బాస్ 7' నుంచి అనుకోని విధంగా సందీప్ ఎలిమినేట్ అయిపోయాడు. చాలామంది శోభాశెట్టి అనుకున్నారు కానీ చివరవరకు వచ్చి ఆమె బతికిపోయింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాప్-5లో ఉంటాడనుకున్న సందీప్ మాస్టర్ ఇలా ఎలిమినేట్ కావడం అందరినీ షాకయ్యేలా చేసింది. అసలు దీనికి కారణం ఏంటి? అసలు ఈ ఎలిమినేషన్ కరెక్టేనా?
సందీప్ బ్యాడ్ లక్
సందీప్ పేరు చెబితే చాలామందికి తెలియకపోవచ్చు గానీ ఆట సందీప్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. రియాలిటీ షోల్లో డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న సందీప్.. ప్రస్తుతం కొరియోగ్రాఫర్‌గానూ చేస్తున్నాడు. బిగ్‌బాస్‌లోకి వచ్చిన వారంలోనే తొలి హౌస్‍మేట్ అయిపోయాడు. అలానే ఐదు వారాల ఇమ్యూనిటీ సంపాదించాడు. ఇకపోతే పోటీపడిన ప్రతి గేమ్‌లోనూ ఆకట్టుకున్న సందీప్.. ఎనిమిదో వారం తొలిసారి నామినేట్ అయ్యాడు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: సందీప్ ఎలిమినేట్.. ఏడుస్తూ ఆ నిజం చెప్పేసిన శోభా!)
సందీప్‌కి అదే మైనస్
అయితే ఈసారి నామినేషన్స్‌లో ఉన్నోళ్లందరూ ఇప్పటికే ఆల్రెడీలో ఈ ప్రొసెస్ దాటి వచ్చారు. దీంతో వాళ్లందరికీ ఓటు బ్యాంక్ ఏర్పడింది. సందీప్ మాస్టర్‌కి మాత్రం ఆ ఛాన్స్ లేకుండా పోయింది. అదే మైనస్ అయింది. దీంతో మిగతా వాళ్లకు ఓట్లు పడ్డాయి. సందీప్‌కి చాలా తక్కువ పడ్డాయి. ఒకానొక దశలో శోభాశెట్టి ఎలిమినేట్ అవుతుందనుకున్నారు. కానీ సందీప్ బలైపోయాడు. అలానే బిగ్‌బాస్ నిర్వహకులు శివాజీ బ్యాచ్‌పై చూపిస్తున్న పక్షపాతం కూడా సందీప్ ఎలిమినేషన్‌కి ఓ కారణమని చెప్పొచ్చు.
రెమ్యునరేషన్ అన్ని లక్షలు?
ఇకపోతే దాదాపు 8 వారాల పాటు బిగ్‌బాస్ హౌసులో ఉండటం అంటే మంచి విషయమే. తొలి కొన్ని వారాలు తప్పితే.. మిగతా రోజుల్లో పోటీల్లో బాగా ఆడాడు. కొన్నింట్లో గెలిచాడు కూడా. ఇకపోతే ముందుగానే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సందీప్.. ఒక్కో వారానికి రూ.2.75 లక్షల రెమ్యునరేషన్ మాట్లాడుకున్నాడట. మొత్తం ఎనిమిది వారాలకు గానూ రూ.22 లక్షలకు పైనే సంపాదించినట్లు టాక్. సో అదన్నమాట విషయం.
(ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్)
Comments
Please login to add a commentAdd a comment