బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ అనేది అమృతం కన్నా ఎంతో విలువైనది. కెప్టెన్సీ వస్తే ఒక వారం పాటు ఇమ్యూనిటీ లభించినట్లే! ఈ లెక్కన ఆ వారమంతా ఏ పనీ చేయనక్కర్లేదు, నామినేషన్స్ ఉండవు, ఎలిమినేషన్ భయమే లేదు. పైగా తన మాటే శాసనం అన్నట్లుగా కెప్టెన్ ఏది చెప్తే అదే నడుస్తుంది. అందుకే కెప్టెన్ అవ్వాలని కంటెస్టెంట్లు తహతహలాడిపోతుంటారు. కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెండర్లను ఎంపిక చేసేందుకు బిగ్‌బాస్ బీబీ మారథాన్ పోటీ పెట్టాడు. మరి ఈ మారథాన్‌లో ఏం జరిగింది? ఎవరు కంటెండర్లుగా నిలిచారు? అనేది తాజా(అక్టోబర్ 26) ఎపిసోడ్‌లో చూసేద్దాం..
నీటితో గేమ్
కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఈ ఎపిసోడ్‌లో ముందుగా స్టోర్ ఇట్.. పోర్ ఇట్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా షవర్ నుంచి వచ్చే నీళ్లను తలపై స్పాంజిలో నింపుకుని తమ కంటైననర్లో పిండుకోవాలి. ఈ గేమ్‌లో అర్జున్, అశ్విని, సందీప్, భోలె షావళి ఆడారు. ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో అర్జున్ తోసేయడంతో అశ్విని కిందపడిపోయింది. ఇక బజర్ మోగిన ప్రతిసారి కంటైనర్లో తక్కువ నీళ్లు ఉన్నవారు అవుట్ అవుతారు. మొదట భోలె అవుట్ కాగా అతడు తన కంటైనర్‌లోని నీటిని అశ్వినికి ఇచ్చేశాడు.
ఇద్దరి త్యాగాలు.. గెలిచిన సందీప్
తర్వాతి రౌండ్‌లో అశ్విని అవుట్ కాగా ఆమె తన నీటిని సందీప్ మాస్టర్‌కు ఇచ్చేసింది. మూడో రౌండ్‌లో అర్జున్ ఎంత కష్టపడ్డా సందీపే గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. తర్వాత అమర్‌తో సందీప్ ముచ్చట్లు పెట్టాడు. అర్జున్ సీరియస్‌గా ఆడుతున్నాడని, తను తోసేశాడని ఆరోపించాడు. ఎక్కడ కొడితే ఎక్కడ నొప్పి వస్తుందో నాకూ తెలుసు. నా మోచేయి చాలు తన హైట్‌కు.. అంటూ ఏదేదో మాట్లాడాడు. ఇక అర్జున్ తను గేమ్ ఆడేటప్పుడు ఎవరూ తనకు సపోర్ట్ చేయలేని తెగ ఫీలైపోయాడు. ఇంతకుముందు నో మాస్టర్ అనేవాళ్లు, ఇప్పుడు మాస్టర్ మాస్టర్ అంటున్నారనగానే శివాజీ.. అవన్నీ గచ్చిబౌలి స్ట్రాటజీస్ అంటూ చులకనగా మాట్లాడాడు.
అక్కా అనొద్దంటూ వెంటపడ్డ రతిక
హౌస్‌లో రీఎంట్రీ ఇచ్చిన రతిక వచ్చినప్పటినుంచి ఇంకా ఏ అలజడి సృష్టించకుండా ఉందేంటా? అనుకునేలోపు మళ్లీ మొదలెట్టేసింది. యావర్‌తో నిన్ను, శివనన్నని తప్ప హౌస్‌లో ఎవరినీ నమ్మను.. మనం ఇద్దరం ఒకే ప్లేట్‌లో తింటుంటే ప్రియాంక.. మనల్ని లవ్‌బర్డ్స్ అందట. నీ మనసులో, నా మనసులో ఏం లేదు. ఫ్రెండ్లీగా ఉన్నాం.. లవ్ కనెక్షన్ ఎట్లా వస్తుంది అని మాట్లాడింది. మరోవైపు ప్రశాంత్‌తో తనను అక్కా అనొద్దంటూ సతాయించింది. అతడికేమో ఆమె పెట్టిన టార్చర్ గుర్తొచ్చి ఏడుస్తూ అక్కా అనే పిలుస్తా అన్నాడు. ఆమె మాత్రం అందుకొప్పుకోలేదు. చివర్లో శివాజీ కలగజేసుకుని అక్కా అని పిలవనవసరం లేదు అంటూ తీర్పునిచ్చాడు.
కంటెండర్‌గా గౌతమ్
కాసేపటికి ఎంప్టీ ద కంటైనర్ టాస్క్ ఇచ్చాడు. దీంతో శోభా.. నేను ఆడతా.. నన్ను ఆడనివ్వకపోతే ఎవరినీ ఆడనివ్వను.. నేను ఆడాల్సిందే అంటూ ఓరకంగా వార్నింగే ఇచ్చింది. దీంతో అర్జున్.. ఆమెతో పోరు పడలేక శివాజీ, అశ్విని, గౌతమ్‌లతో పాటు శోభాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో గౌతమ్ గెలిచాడు. ఓటమిని తీసుకోలేని శోభ ఏడుపు మొదలెట్టేసింది. తర్వాత తేజ-శోభలను బిగ్‌బాస్ ఆటపట్టించాడు. తేజను తిననివ్వకుండా ఎందుకంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావ్.. స్వయంగా మీరే రెండు చపాతీలు చేసి తేజకు తినిపించాలంటూ శోభకు పనిష్మెంట్ ఇచ్చాడు. దీంతో లవ్ సింబల్ షేప్‌లో చపాతీ చేసి తేజ వద్దంటున్నా అతడి వెనకాలే వెళ్తూ ముద్దలు తినిపించింది.
ఎట్టకేలకు కంటెండర్‌గా శోభా
ఇక చివరగా వేర్ ఇట్ అండ్ విన్ ఇట్ గేమ్ పెట్టాడు. మళ్లీ శోభా.. నేను ఆడతా.. అంటూ మళ్లీ మొదలుపెట్టింది. అర్జున్ ఏదో ఆలోచిస్తుంటే అలిగి వెళ్లిపోయింది. దీంతో అశ్విని, అర్జున్ త్యాగం చేసి తేజ, యావర్, శోభాలకు అవకాశం ఇచ్చారు. ఇందులో తేజకు అమర్, శోభాకు ప్రియాంక, యావర్‌కు ప్రశాంత్ సపోర్ట్ చేశాడు. ఈ గేమ్‌లో శోభా అత్యధికంగా 72 దుస్తులేసుకుని విన్నర్‌గా నిలిచింది. ఈ వారం బీబీ మారథాన్‌లో ప్రియాంక, ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు.
చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment