బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆల్‌రెడీ లీకవడంతో ఎపిసోడ్‌లో పెద్ద పస లేకుండా పోయింది. అయితే అటు తేజ కన్నా రతిక తానెక్కడ ఎలిమినేట్ అవుతుందోనని తెగ భయపడిపోయింది. ప్లీజ్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అని నాగ్‌ను అర్థించింది. ఇంతలో తేజ ఎలిమినేట్ అనడంతో ఊపిరి పీల్చుకుంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి(నవంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన..
నాగార్జున కొన్ని సామెతలను ఇచ్చి అది ఎవరికి బాగా సూటవుతుందో చెప్పాలన్నాడు. భోలె షావళి.. అమర్‌ది కుక్క తోక వంకర అన్నాడు. అమర్.. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అనే బోర్డును అశ్విని మెడకు తగిలించాడు. ప్రశాంత్ ఏకులా వచ్చి మేకులా తగిలాడన్నాడు అర్జున్. ఇక తేజ ఏమీ లేని ఆకులా ఎగిరెగిరిపడతాడని చెప్పాడు ప్రశాంత్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత అశ్వినికి బాగా సూటవుతుందని అభిప్రాయపడింది ప్రియాంక.
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం?
భోలె షావళి.. ఓడ ఎక్కేవరకు ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడ మల్లన్న అని పేర్కొంది రతిక. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అనేది రతిక విషయంలో నిజమైందన్నాడు గౌతమ్. పొరుగింటి పుల్లకూర రుచి అనే బోర్డు భోలెకు వేశాడు తేజ. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమనే బోర్డు శివాజీకి వేశాడు ప్రిన్స్ యావర్. వేలు ఇస్తే చేయి గుంజినట్లు అనే బోర్డును ప్రియాంక మెడలో వేసింది అశ్విని. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు? అనే సామెత తేజకు పర్ఫెక్ట్‌గా సూటవుతుందన్నాడు శివాజీ. ఇటు రా అంటే ఇల్లంత నాదే అన్నట్లుగా తేజ ప్రవర్తిస్తాడంది శోభ.
ఎలిమినేషన్ భయంతో ఏడ్చేసిన రతిక
తర్వాత జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్ర యూనిట్ రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య స్టేజీపైకి వచ్చి సందడి చేశారు. వీరు హౌస్‌మేట్స్‌తో హుక్ స్టెప్ గేమ్ ఆడించి వెళ్లిపోయారు. తర్వాత తెలుగమ్మాయి ఈషా రెబ్బ హౌస్‌లోకి వెళ్లి పీరియడ్స్ సమస్యల గురించి మాట్లాడి అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అనంతరం నాగ్ అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరగా రతిక, తేజ మాత్రమే మిగిలారు. ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానోనని రతిక తెగ ఏడ్చేసింది. చివరకు తేజ ఎలిమినేట్ అనగానే రతికకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. ఇక తేజ ఏడవకూడదనుకుంటూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు.
శోభకు ఎక్కువ మార్కులిచ్చిన తేజ
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. తేజ కంటే శోభ ఎక్కువ ఏడ్చింది. అందరికీ వీడ్కోలు పలికేముందు హౌస్‌మేట్స్‌కు మార్కులు ఇచ్చాడు తేజ. శోభకు పదికి 20 మార్కులిచ్చాడు. గౌతమ్‌కు 8, అర్జున్‌కు 8 మార్కులిచ్చాడు. ప్రిన్స్ యావర్‌కు 10, భోలె షావళికి 7మార్చులిచ్చాడు. ఆటపరంగా ఓకే కానీ మాటతీరు మార్చుకోవాలంటూ అశ్వినికి 8 ఇచ్చాడు. ఓటమిని తీసుకోలేడంటూ ప్రశాంత్‌కు 9, వంటలక్క ప్రియాంకకు 10, అమర్‌దీప్‌కు 9, శివాజీకి 8, రతికకు 5 మార్కులిచ్చాడు.
అంటూ ఏడుపందుకున్న శోభ
సెలవు తీసుకోవడమే ఆలస్యం అనుకునే సమయానికి శోభ మళ్లీ ఏడుపు మొదలుపెట్టింది. ఇక్కడ నువ్వు లేకుండా ఎలా ఉండాలో తెలియట్లేదు, భయమేస్తోంది తేజ అంటూ శోకమందుకుంది. నీతో ఒక్కరోజు మాట్లాడకుండా ఉన్నందుకే ఏదోలా ఉంది.. అలాంటిది నువ్వు లేకుండా హౌస్‌లో చాలా రోజులు ఉండాలంటే భయమేస్తోంది అని కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్‌లో ఉన్నప్పుడు నువ్వెవరు? అంటూ గడ్డిపోచ కన్నా హీనంగా చూసిన శోభ తనకోసం ఏడుస్తున్నందుకు సంతోషపడాలా? బాధపడాలా? తెలియని అయోమయంలో ఉన్న శోభ ఎప్పటిలాగే చిరునవ్వుతో వీడ్కోలు తీసుకున్నాడు.
చదవండి: తొమ్మిది వారాల్లో తేజ అంత సంపాదించాడా? ఎలిమినేషన్‌కు కారణమిదే!
Comments
Please login to add a commentAdd a comment