బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఇప్పటికే రెండు టాస్కులు జరగ్గా వాటిలో ప్రియాంక, ప్రశాంత్ గెలిచి కంటెండర్లుగా నిలిచారు. అమర్, రతిక ఆటలో నుంచి అవుట్ అయి రేసులోనే లేకుండా పోయారు. ఇక మిగిలిన కంటెస్టెంట్ల కోసం నేడు బిగ్‌బాస్ మరిన్ని టాస్కులు పెట్టనున్నాడు. ఈమేరకు ప్రోమోలు రిలీజయ్యాయి. షవర్ కింద స్పాంజ్ ఉన్న హెల్మెట్ పెట్టుకుని నిలబడాలి. తర్వాత ఆ స్పాంజ్‌లోని నీళ్లను తమ కంటెయినర్లలో నింపాలి.
అర్జున్ ఆటతీరుపై అసహనం
ఈ టాస్కులో అర్జున్, భోలె షావళి, అశ్విని, సందీప్ ఆడారు. స్పాంజ్‌ను పూర్తిగా తడుకుపుకునేందుకు పోటీపడి మరీ ఆడారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకున్నారు. అర్జున్ అయితే అశ్వినిని కింద పడేశాడు. ఈ గేమ్ ముగిసిన తర్వాత సందీప్.. అర్జున్ ఆటతీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఫిజికల్ చేయాలంటే రెండు నిమిషాలు పట్టదు. నా పీక పట్టుకుని తోశాడు. ఆ పిల్లను ఒక్క తోపు తోస్తే కింద పడింది అంటూ అర్జున్ మీద మండిపడ్డాడు. ఈ ఆటలో సందీప్ గెలిచినట్లు తెలుస్తోంది.
గెలిచిందెవరంటే?
ఇక మరో ఆటలో వీలైనన్ని ఎక్కువ దుస్తులు వేసుకోవాలని ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో తేజ, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ ఆడారు. ఇక తేజ తనవే కాకుండా అందరి బట్టలు సైతం వేసుకోవడంతో హౌస్‌మేట్స్ పడీపడీ నవ్వారు. ఈ టాస్కులో శోభ గెలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు లైవ్‌లో జరిగిన గేమ్స్ ప్రకారం ప్రియాంక, శోభా, గౌతమ్, పల్లవి ప్రశాంత్, సందీప్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. మరి ఈ వారం ఎవరు కెప్టెన్‌గా అవతరిస్తారో చూడాలి!
చదవండి: భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన.. 39 ఏళ్ల తర్వాత వెబ్ సిరీస్‌గా.. ఏ ఓటీటీలో అంటే?
Comments
Please login to add a commentAdd a comment