తింటూ కూడా ఫేమస్ అవొచ్చని నిరూపించాడు టేస్టీ తేజ. హోటల్ ప్రమోషన్స్‌తో మొదలైన ఇతడి ప్రయాణం సినిమా ప్రమోషన్స్ వరకూ చేరుకుంది. తేజ అసలు పేరు తేజ్‌దీప్. తెనాలో పుట్టిపెరిగిన ఇతడు 2017లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం హైదరాబాద్‌లో సెటిలయ్యాడు. చిన్నప్పటినుంచి నటన, సినిమాలంటే ఆసక్తి ఉన్న తేజకు కరోనా సెలవులు కలిసొచ్చాయి. 2020లో వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్నప్పుడు తెనాలిలో స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేశాడు.
ఆ వీడియో యూట్యూబ్‌లో పెట్టగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదేదో బాగుందనిపించి హైదరాబాద్ వచ్చాక అదే కొనసాగించాడు. యూట్యూబర్‌గా బిజీ అయిన తేజ సినిమాల్లోనూ కనిపించాడు. తర్వాత బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో పాల్గొన్నాడు. తొమ్మిదివారాలపాటు హౌస్‌లో ఉన్నాక షోకి టాటా బైబై చెప్పాడు. ఇప్పుడు ఎనిమిదో సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తల్లిని ఎలాగైనా హౌస్‌లోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో వచ్చాడు. ఆ కల నెరవేర్చుకుని పదమూడోవారంలో ఎలిమినేట్ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment