టేస్టీ తేజ కొత్త బిజినెస్‌.. రేపే షురూ | Tasty Teja Ventures into New Business | Sakshi
Sakshi News home page

టేస్టీ తేజ కొత్త బిజినెస్‌.. గెస్టుగా అమర్‌దీప్‌

Published Fri, Apr 5 2024 4:04 PM | Last Updated on Fri, Apr 5 2024 6:36 PM

Tasty Teja Ventures into New Business - Sakshi

టేస్టీ తేజ.. యూట్యూబర్‌. అతడి పేరులోనే తను చేసే పనేంటో అర్థమవుతోంది. సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ మొదలుపెట్టి హోటల్‌ ప్రమోషన్స్‌ చేసేవాడు. జబర్దస్త్‌లోనూ ఛాన్స్‌ సంపాదించుకున్నాడు. తర్వాత తన పాపులారిటీ పెరిగి సినిమా ప్రమోషన్స్‌ సైతం చేశాడు. మొన్నామధ్య బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌కు సైతం వెళ్లివచ్చాడు. నాలుగైదు సినిమాల్లోనూ నటించినట్లు తెలుస్తోంది

తాజాగా తేజ ఓ కొత్త బిజినెస్‌ ప్రారంభించబోతున్నాడు. ఇరానీ నవాబ్స్‌ పేరిట ఛాయ్‌ హోటల్‌ పెడుతున్నట్లు వెల్లడించాడు. 'నేను కొత్తగా ఓ ప్రయాణం మొదలుపెడుతున్నాను. ఈ ప్రయాణంలో నాతోపాటు మీరు.. మనందరం కలిసి ఎదుగుదాం, సాధిద్దాం.. సంపాదిద్దాం..' అంటూ వీడియో రిలీజ్‌ చేశాడు. ఏప్రిల్‌ 6న ఉప్పల్‌లో చాయ్‌ బిజినెస్‌ మొదలుపెడుతున్నట్లు పేర్కొన్నాడు. ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నట్లు తెలిపాడు. ఈ ఔట్‌లెట్‌ ఓపెనింగ్‌కు బిగ్‌బాస్‌ ఫేం అమర్‌దీప్‌ ముఖ్య అతిథిగా హాజరవనున్నాడు.

ఎవరీ తేజ
తేజ అసలు పేరు కల్లం తేజ్‌దీప్‌. తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, ఆదిలక్ష్మి. హైస్కూలు వరకు తెనాలిలో చదివి తర్వాత విజ్ఞాన్‌ యూనివర్శిటీలో ఇంటర్‌, బీటెక్‌, ఎంటెక్‌ చేశాడు. ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగంతో 2017లో హైదరాబాద్‌ వెళ్లాడు. వీకెండ్‌లో ఫుడ్‌ వీడియోలు చేసి పాపులర్‌ అయ్యాడు.

చదవండి: OTT: నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement