బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంతోమంది ఫేమస్ అవుతున్నారు. వారిలో చాలామంది సెలబ్రిటీలయ్యారు కూడా. అలానే ఈ ఏడాది సీజన్-7లో కొందరు సినీ ఇండస్ట్రీతో సంబంధంలేనివారు కూడా ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టగానే వారికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. అలాంటి వారిలో ఫేమస్ అయిన యూట్యూబర్, ఫుడ్ వ్లాగర్ టేస్టీ తేజ. హౌస్‌లో అందరినీ అలరించిన టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.
అతనితో పాటు బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్న శుభశ్రీ రాయగురు, కొరియోగ్రాఫర్ ఆట సందీప్ కూడా హోస్ నుంచి బయటకొచ్చేశారు. వీరంతా కలిసి బిగ్ బాస్ ఫేమ్ మానస్ పెళ్లికి హాజరయ్యారు. అయితే వీరు ముగ్గురు కలిసి పెళ్లిలో సందడి చేశారు. డ్యాన్సులు చేస్తూ చిల్ అవుతూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే పెళ్లి వేడుకలో ఆటసందీప్, శుభశ్రీ కలిసి ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇది చూస్తూ పక్కనే ఉన్నా టేస్టీ తేజ వాళ్లద్దరి కెమిస్ట్రీని చూసి తట్టుకోలేకపోయారు. దీంతో వాళ్లిద్దరూ డ్యాన్స్ చేయడాన్ని చూస్తూ పక్కనే ఉన్న చెట్టుకు తల బాదుకుంటూ కనిపించారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఇది చాలా అన్యాయం సార్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇదంతా టేస్టీ తేజ సరదా కోసమే చేసినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సైతం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment