బిగ్‌బాస్ హౌస్‌లో సేఫ్ గేమ్ ఆడుతున్నవారిలో టేస్టీ తేజ ముందు వరుసలో ఉంటాడు. బలమైన కారణాలు లేకుండా కంటెస్టెంట్లను ఊరికనే నామినేట్ చేస్తూ ఉంటాడు. అతడి హ్యాండ్ మహిమో, మరేంటో కానీ తను ఎవరినైతే నామినేట్ చేస్తున్నాడో వారు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. దామిని, రతిక, శుభశ్రీ రాయగురు, నయని పావని, పూజా మూర్తి, సందీప్.. ఇలా ఎవరో ఒకరు తేజ చేతిలో బలవుతూ వస్తున్నారు. ఇక సందీప్ స్ట్రాంగ్ ప్లేయర్ అని.. ఒక్కసారైనా నామినేషన్స్‌లోకి వస్తే తనకు ఆత్మస్థైర్యం పెరుగుతుందని.. పాజిటివ్ వైబ్స్‌తో నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. కట్ చేస్తే సందీప్ ఎలిమినేట్ అయ్యాడు.
తేజ ప్రవర్తనకు బాధేసింది
సందీప్ ఎలిమినేషన్‌కు ఒకరకంగా నువ్వే కారణమంటూ తేజను శివాజీ నామినేట్ చేశాడు. అయితే అప్పుడు తేజ ఓ మాటన్నాడు. సందీప్‌ను కావాలని నామినేట్ చేయలేదని, తనే అడిగి మరీ చేయించుకున్నాడని చెప్పాడు. దీనిపై ఆట సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజా ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నామినేషన్స్‌లో తేజ అలా మాట్లాడటం చూసి చాలా బాధపడ్డాను, అదే స్థాయిలో కోపం కూడా వచ్చింది. నేను హౌస్‌లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా నువ్వేం బాధపడకురా.. ఇంటికే వెళ్తున్నాను కదా అని పాజిటివ్‌గా మాట్లాడి హగ్ చేసుకున్నాను.
తేజది ఐరన్ లెగ్!
అలాంటిది నేను లేని సమయం చూసుకుని నామీద అబద్ధం చెప్పాడు. నేనే నామినేట్ చేయమని చెప్పానని అనడం తప్పు. తేజ చెప్పింది 100% ఫేక్. ఈ ఒక్క పాయింట్‌తో తనను బయటకు లాగేయొచ్చు. తేజది ఐరన్ లెగ్.. అందుకే బయటకు వచ్చేశాననుకుందాం. తేజ నామినేట్ చేసిన ఆరుగురు అలాగే వచ్చారు. సరే, జనాలు నన్ను బయటకు పంపించేశారనుకుందాం. కానీ, నేను అక్కడ లేనప్పుడు తను నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి నా గురించి అబద్ధం ఆడటం తప్పు.
నామినేషన్స్‌లోనూ అదే వెటకారం
నన్ను ఎలాగైతే నామినేట్ చేశాడో అర్జున్‌ను కూడా అలాగే వెటకారంగా నామినేట్ చేశాడు. నేను ఎలిమినేట్ అయినప్పుడు తేజ వెక్కివెక్కి ఏడ్చాడు. ఎప్పుడూ ఏడవని తేజ ఆ రోజు సోఫా మీద దొర్లి మరీ ఏడ్చాడు. ఎమోషన్స్ ఉండవన్న తేజ ఆ రోజు ఎంతగానో ఏడ్చాడు ఇప్పుడు నాకు ఎవరేంటనేది అర్థమవుతోంది. తనది సెల్ఫిష్ గేమ్.. ఇలా ఎవరి వెనకాల గోతులు తవ్వకూడదు' అని సందీప్ చెప్పుకొచ్చాడు.
చదవండి: గౌతమ్ మాస్టర్ మైండ్.. రైతుబిడ్డ అవుట్.. ఏడ్చేసిన ప్రశాంత్
Comments
Please login to add a commentAdd a comment