బిగ్‌బాస్‌ విన్నర్‌ ప్రశాంత్‌.. లీక్‌ చేసిన సందీప్‌ భార్య! | Bigg Boss Telugu 7: Aata Sandeep Wife Post about Pallavi Prashanth | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ విన్నర్‌గా రైతుబిడ్డ.. రాత్రి 8.30 గంటలకు స్టూడియోకు వచ్చేయండి..

Published Sun, Dec 17 2023 3:34 PM | Last Updated on Sun, Dec 17 2023 8:36 PM

Bigg Boss Telugu 7: Aata Sandeep Wife Post about Pallavi Prashanth - Sakshi

బిగ్‌బాస్‌ జర్నీ.. జీవితంలో ఒక్కసారైనా ఈ షోకి వెళ్లాలని చాలామంది అనుకుంటారు. కానీ కొందరికే ఆ అవకాశం వరిస్తుంది. అందులో అతికొంతమందే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారు. జీవిత పాఠాలు తెలుసుకుంటారు. అందుకే ఈ రియాలిటీ షో ఏళ్లతరబడి హిట్‌ అవుతూ వస్తోంది. ఇప్పుడు ఏడో సీజన్‌ ముగింపుకు వచ్చింది. నేటితో బిగ్‌బాస్‌ 7 చాప్టర్‌ క్లోజ్‌ కానుంది. మరికాసేపట్లో విజేత ఎవరనేది తేలిపోనుంది. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు ఫినాలేలో అడుగుపెట్టగా అందులో ముగ్గురు.. అర్జున్‌, ప్రియాంక, ప్రిన్స్‌ యావర్‌ ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ నిన్నే అయిపోయింది.

కష్టం ఎప్పటికీ వృథా పోదు..
ఈరోజు మిగతా ముగ్గురిలో విజేత ఎవరనేది నిర్ణయించనున్నారు. అయితే పల్లవి ప్రశాంత్‌ బిగ్‌బాస్‌ 7 విన్నర్‌ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ పెట్టింది ఆట సందీప్‌ భార్య జ్యోతిరాజ్‌. 'పడ్డ కష్టం ఎన్నటికీ వృథా కాదు.. దేవుడు నిన్ను చల్లగా చూడాలిరా తమ్ముడు' అంటూ ఓ వీడియోను షేర్‌ చేసింది. ఇందులో స్పై(శివాజీ, ప్రశాంత్‌, ప్రిన్స్‌ యావర్‌) బ్యాచ్‌ అభిమానులు ఆదివారం రాత్రి 8.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోకి రావాలని ఉంది. అసలే సందీప్‌ మాస్టర్‌ ఫినాలే షూటింగ్‌లో ఉండటంతో ఈ పోస్ట్‌ నిజమయ్యే ఛాన్స్‌ ఉందని అభిమానులు ఖుషీ అవుతున్నారు.

న్యాయం కోసం ఫ్రెండ్‌షిప్‌ను పక్కన పెట్టేశాడు!
ఇక మరో పోస్ట్‌లో సందీప్‌ మాస్టర్‌ న్యాయం కోసం ఫ్రెండ్‌షిప్‌ను పక్కన పెట్టాడని చెప్పుకొచ్చింది. అయితే ఇదే కాస్త అతిగా ఉంది. సందీప్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు అమర్‌కు బెస్ట్‌ ఫ్రెండ్‌గా ఉన్నాడు. ప్రశాంత్‌ పేరెత్తినా కూడా చిరాకుపడేవాడు. కానీ షో నుంచి బయటకు రాగానే ప్రశాంత్‌కు ఏ లెవల్‌లో సపోర్ట్‌ ఉందో బాగా అర్థమైంది సందీప్‌కు. దీంతో అమర్‌ను పక్కన పెట్టేసి ప్రశాంత్‌కు సపోర్ట్‌ చేయడం మొదలుపెట్టాడు. నిజానికి అమర్‌కు ఫౌల్‌ గేమ్స్‌ అనే ట్యాగ్‌ రావడానికి సందీప్‌ కూడా ఓ కారణమే! కానీ బయటకు వచ్చాక మాత్రం ఆ ట్యాగ్‌కు, తనకు ఏ సంబంధం లేదన్నట్లు వ్యవహరించాడు.

చదవండి:  క్రేజీ ఆఫర్‌.. 7 సెకన్ల టైమ్.. అమర్‌దీప్‌ అంత వేగంగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement