బిగ్‌బాస్ హౌసులో రైతుబిడ్డ సత్తా చూపించాడు. చాలామంది ఇతడిని తక్కువ అంచనా వేశారు కానీ హౌస్ కి మొట్టమొదటి కెప్టెన్ అయి చూపించాడు. అయితే ఈ క్రమంలోనే గేమ్ ఆడుతూ ఓ కంటెస్టెంట్ ని గాయపరిచాడు. దీంతో ఆ గొడవ చాలా సీరియస్ అయ్యేసరికి మిగతా కంటెస్టెంట్స్ శాంతింపజేశారు. అలానే ప్రశాంత్ ఓ విషయంలో బతికిపోయాడు. ఇంతకీ ఏంటి సంగతి? అసలు శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day-33 హైలైట్స్‌లో చూద్దాం.
సందీప్ గుక్కపట్టి ఏడుపు
చిట్టి ఆయిరే అనే టాస్కులో మధ్యలో ఉండగానే గురువారం ఎపిసోడ్ పూర్తయింది. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. సందీప్-అమరదీప్ జోడీని పిలవగా.. అమ్మ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందని చెబుతూ సందీప్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు భార్య గురించి విని, ఆమె పేరు చూసి చాలారోజులైందని అమర్ ఏడ్చాడు. ఫైనల్‌గా అమరదీప్ త్యాగం చేయడంతో సందీప్ మాస్టర్ గుక్కపట్టి ఏడుస్తూ లెటర్ చదివాడు. అలానే కెప్టెన్సీ రేసులో నిలిచాడు. ప్రశాంత్ విషయంలో శివాజీ త్యాగం చేశాడు.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!)
ఫైనల్ టాస్క్‌లో గోల
ఇక కెప్టెన్సీ టాస్కులో భాగంగా రెండు రౌండ్స్ దాటుకుని.. చివరగా తేజ, సందీప్, ప్రశాంత్, గౌతమ్ రేసులో నిలిచారు. వీళ్లకు 'రంగు పడుద్ది రాజా' అనే టాస్కుని బిగ్‌బాస్ నిర్వహించాడు. ఈ గేమ్‌లో భాగంగా ఓ సర్కిల్ ఉంటుంది. అందులో అందరూ నిలబడి ఒకరు మరొకరి టీ షర్ట్‌పై చేతులతో రంగు పూయాలి. ఎండ్ బజర్ మోగేలోపు ఎవరి టీ షర్ట్‌పై ఎక్కువ రంగుంటే వాళ్లు ఎలిమినేట్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు.
తొలి రౌండులో భాగంగా సందీప్ మాస్టర్ టీ షర్ట్‌ని లాగేశాడు. అయితే లాగడంతోపాటు ముఖంపై కొట్టాడని సందీప్, ప్రశాంత్‌పై ఆరోపణలు చేశాడు. ఈ గొడవ చాలాసేపు నడిచింది. సంచాలక్ ప్రియాంక దీన్ని సరిదిద్దింది. అయితే తొలి రౌండ్‌లో సర్కిల్ దాటాడని తేజని ఎలిమినేట్ చేశారు. రెండో రౌండ్‌లో సందీప్ ఒక్కడిని.. గౌతమ్-ప్రశాంత్ కలిసి టార్గెట్ చేసి కలర్ ఎక్కువ పూశారు. దీంతో అతడు ఎలిమినేట్ అయిపోయాడు. ఫైనల్ రౌండ్‌లో గౌతమ్-ప్రశాంత్ ఒకరిపై ఒకరు పోటీపడి మరి కలర్స్ పూసుకున్నారు. రౌండ్ పూర్తయిన తర్వాత వీళ్లిద్దరినీ చాలాసేపు పరీక్షించిన ప్రియాంక.. ప్రశాంత్‌ని విజేతగా ప్రకటించింది. అతడికి కెప్టెన్ అని రాసున్న బ్యాడ్జి పంపారు. అలా శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది.
(ఇదీ చదవండి: 'మ్యాడ్' సినిమాలో కామెడీతో ఇచ్చిపడేశాడు.. ఈ కుర్రాడెవరో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment