
టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్‌గా ఈయన చాలామందికి సుపరిచితం. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్‌లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్‌గా స్థిరపడిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా డ్యాన్సరే!
అయితే ఆట సందీప్‌కు తాను చెప్పింది తప్పితే ఎదుటివాళ్లు చెప్పేది వినడానికి ఇష్టపడడు, అసలు వినిపించుకోడు. ఇటీవలే అతడు తన భార్యతో కలిసి 'నీతోనే డ్యాన్స్' కప్ గెలిచాడు. అయితే ఈ షో జరిగినన్ని రోజులు గేమ్ అమర్ దీప్ ఫ్యాన్స్ వర్సెస్ ఆట సందీప్ ఫ్యాన్స్ అన్నట్లుగా నడిచింది. మరి బిగ్‌బాస్‌లోనూ వీరి మధ్య వార్ జరుగుతుందా? ఆట సందీప్ తన కోపాన్ని నిగ్రహించుకుని ఎక్కువ వారాలు కొనసాగుతాడా? అన్నది చూడాలి!