బిగ్‌బాస్7: టాప్ లేపిన రతిక.. 'పవర్ అస్త్ర' గెలిచిన ఆ ఒక్కరు | Bigg Boss 7 Telugu Day 6 Highlights Host Nagarjuna | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 6 Highlights: స్మూత్‌గా ఇచ్చిపడేసిన నాగార్జున.. అనుకున్నదంతా రివర్స్!

Published Sat, Sep 9 2023 11:12 PM | Last Updated on Fri, Sep 15 2023 8:40 PM

Bigg Boss 7 Telugu Day 6 Highlights Host Nagarjuna - Sakshi

'బిగ్‌బాస్'లో మిగతా రోజులు ఎలా ఉన్నాసరే వీకెండ్ వచ్చేసరికి మాత్రం అంతా కలర్‌ఫుల్‌ అయిపోతుంది. ఎందుకంటే హోస్ట్ నాగార్జున వచ్చేశాడు. కంటెస్టెంట్స్.. వారం రోజుల పాటు చేసిన సంగతుల‍్ని స్టేజీపై మరోసారి డిస్కస్ చేస్తాడు. ఇందులో భాగంగా మెచ్చుకుంటాడు. అవసరమైతే అక్కడే కడిగి పారేస్తాడు. అలా ఈ శనివారం.. ఏం జరిగింది? ఆరో రోజు హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' బ్యూటీకి యాక్సిడెంట్.. జరిగింది ఇదే!)

రతికకి ప్రపోజ్ 
ఇకపోతే 'జవాన్' పాటతో ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. వచ్చీ రాగానే శుక్రవారం ఏం జరిగిందనేది స్క్రీన్‌పై చూపించారు. అలా లాన్ లో కూర్చుని మాట్లాడుతున్న క్రమంలో.. సందీప్, అమర్‌దీప్ కచ్చితంగా టాప్-5లో ఉంటారని షకీలా జోస్యం చెప్పింది. మరోవైపు ప్రశాంత్.. రతికతో తెగ పులిహోర కలిపేశాడు. బ్రేకప్ హార్ట్ ని చేతిలో పట్టుకుని, మోకాలిపై కూర్చుని రతికకు ప్రపోజ్ చేస్తున్న పోజు పెట్టాడు. మరోవైపు రతిక భోజనం చేస్తుంటే.. ఆమెకు దగ్గరకెళ్లి తినిపించమని మారం చేశాడు. ఇదంతా ఫన్నీగా సాగింది.

శోభాకి పనిష్మెంట్
ఇకపోతే శుక్రవారం ఎపిసోడ్‌లోనే ప్రిన్స్.. శుభశ్రీతో మాట్లాడుతూ యూజ్‌లెస్ అనే పదం ఉపయోగించాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. శనివారం ఎపిసోడ్‌లో నాగ్ ఈ గొడవ గురించి మాట్లాడుతూ.. ప్రిన్స్‌కి క్లాస్ పీకాడు. మరోవైపు అప్పుడప్పుడు ఏడుస్తున్న శోభాకి చిన్న వార్నింగ్ ఇచ్చాడు.ప్రేక్షకులకు ఇదంతా నచ్చదని, టాప్-5లో ఉంచరని అన్నాడు. అలానే.. హౌసులోకి వెళ్లేటప్పుడు ఇచ్చిన టాస్కులో (టేస్టీ తేజ ఈమెని హాట్ అన్నాడు) ఫెయిలైనందుకు వారం రోజులు వాష్‌రూమ్ క్లీన్ చేయాలని.. నాగ్ పనిష్మెంట్ ఇచ్చాడు. 

(ఇదీ చదవండి: ఆగిపోయిన తెలుగు 'బిగ్‌బాస్ 7'.. కారణం అదే?)

టాప్‌లో రతిక
ఇకపోతే వీకెండ్ లో వచ్చిన నాగార్జున పై విషయాల్ని ముచ్చటిస్తూ.. 'ఫ్యాన్స్ పల్స్' అనేది ఉందని, దీని ద్వారా బయట ఉండే అభిమానులు తమ గురించి ఏమనుకుంటున్నారు? ఎన్ని మార్కులు వేశారు అనేది చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మొదటి స్థానంలో 80 మార్కులతో రతిక నిలిచింది. ఆమెకు అత్యధికంగా 80 మార్కులు వచ్చాయి. యాక్టివిటీ రూంలో రతిక ఉన్నప్పుడు.. దాదాపు రెండున్నర గంటలపాటు‍్టఉడత ఉడత ఊచ్' అనే పాట లూప్ లో ప్లే చేశారని, మొత్తం ఉడత అనే పదం ఎన్నిసార్లు ఉందని అడగ్గా.. 1056 సార్లు అని చెప్పిన రతిక గ్రేట్ అని నాగ్ మెచ్చుకున్నాడు. 

ఫ్యాన్స్ పల్స్ (కంటెస్టెంట్స్ వేసుకున్న మార్కులు)

  • ప్రియాంక - 71 (100 మార్కులు)
  • శివాజీ - 74  (90 మార్కులు)
  • దామిని - 62 (95 మార్కులు)
  • ప్రిన్స్ -   69 (94 మార్కులు)
  • షకీలా - 69 (85 మార్కులు)
  • సందీప్ - 72 (90 మార్కులు)
  • శోభాశెట్టి -  76 (93 మార్కులు)
  • టేస్టీ తేజ - 77  (100 మార్కులు)
  • రతిక - 80 (90 మార్కులు)
  • గౌతమ్ - 60 (100 మార్కులు)
  • కిరణ్ రాథోడ్ - 50 (100 మార్కులు)
  • ప్రశాంత్ -  74 (78 మార్కులు)
  • శుభశ్రీ - 65 (98 మార్కులు)
  • అమర్‌దీప్ - 60 (97 మార్కులు)

'పవర్ అస్త్ర' గెలిచిన సందీప్
షో ప్రారంభమైన రోజే చెప్పినట్లు 'పవర్ అస్త్ర' సాధిస్తేనే హౌస్‌మేట్‌గా కన్ఫర్మ్ అవుతారని నాగ్ చెప్పాడు. అలానే పలు టాస్కులు పెట్టగా వాటిలో గెలిచిన ప్రియాంక జైన, ఆట సందీప్.. ఫైనల్ గేమ్ వరకు వచ్చారు. వీళ్లిద్దరి మధ్య అటు ఇటు ఊగే బెంచిపై పరుగెత్తుతూ బుట్టలో బాల్ వేయాలనే గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా సందీప్ మాస్టర్ 53 బంతుల్ని బుట్టలో వేయగా, ప్రియాంక 34 బంతులు వేసింది. తద్వారా ఫస్ట్ విన్నర్‌గా నిలిచిన సందీప్.. పవర్ అస్త్ర గెలుచుకుని 'బిగ్‌బాస్ 7' తొలి హౌస్‌మేట్ అయిపోయాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. ఆదివారం.. ఎలిమినేషన్ అనేది ఉంటుందా లేదా అనేది తెలిసిపోతుంది.

(ఇదీ చదవండి: శోభా కన్నీళ్లు.. టాప్-5లో ఉండవని నాగ్ కౌంటర్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement