మా నాన్న కూడా ఊరోడే.. ఇప్పుడేంటి ప్రశాంత్‌?: నాగ్‌ ఫైర్‌ | Bigg Boss 7 Telugu: Nagarjuna Questions Pallavi Prashanth | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: అందరూ ఊరి నుంచి వచ్చినవాళ్లే.. రైతుబిడ్డకు ఇచ్చిపడేసిన నాగ్‌.. ఏడ్చేసిన ప్రశాంత్‌

Published Sat, Oct 21 2023 11:11 AM | Last Updated on Sat, Oct 21 2023 11:26 AM

Bigg Boss 7 Telugu: Nagarjuna Questions Pallavi Prashanth - Sakshi

ఈ వారం నామినేషన్స్‌ భలే రసవత్తరంగా సాగాయి. భోలె బూతులు మాట్లాడటం.. అది వినలేక ప్రియాంక, శోభ చిందులు తొక్కడం.. ప్రశాంత్‌ తనను ఊరోడన్నారని బాధపడటం.. నేను అనలేదు మహాప్రభో అని సందీప్‌ మాస్టర్‌ తన కళ మీద ఒట్టేయడం.. ఇలా చాలానే జరిగాయి. వీటన్నింటి గురించి మాట్లాడేందుకు వచ్చేశాడు నాగార్జున. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.

కుండ బద్ధలు కొట్టిన నాగ్‌
బిగ్‌బాస్‌ హౌస్‌లో కుండ బద్ధలు కొట్టి చెప్పాల్సిన నిజాలున్నాయంటూ నాగ్‌ మొదలుపెట్టాడు. మొదట అశ్విని కుండ బద్ధలు కొట్టిన నాగ్‌.. రేయ్‌, పోరా అని మాట్లాడుతున్నావ్‌ అని చెప్పగానే ఆమె బిక్కముఖం వేసింది. ఇక భోలె కుండ బద్ధలు కొట్టిన నాగ్‌.. ఎర్రగడ్డ అనే పదం ఎందుకు వచ్చింది? అని నిలదీశాడు. దీనికి భోలె.. శోభ సెన్స్‌ లేదు అనేసరికి అలా అనాల్సి వచ్చిందని చెప్పాడు. సెన్స్‌లెస్‌కు మెంటల్‌కు చాలా తేడా ఉందని గరమయ్యాడు కింగ్‌.

అమర్‌ కేక్‌ తినడం అవసరమా?
అమర్‌ కేక్‌ తిన్నప్పుడు బిగ్‌బాస్‌కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు.. గ్రూపిజమా? అని శోభను ప్రశ్నించాడు నాగ్‌. తర్వాత అమర్‌తో మాట్లాడుతూ.. అంత ఆత్రంగా కేక్‌ తినడం అవసరమా? నువ్వు చేసిన పని వల్ల ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నావో తెలుసా? అని అడగడంతో నీళ్లు నమిలాడు అమర్‌. తేజ అందరినీ రెచ్చగొడుతున్నాడన్నాడు నాగ్‌. ఇక నామినేషన్స్‌లో సందీప్‌ మాస్టర్‌ తనను ఊరోడు అని చులకన చేశాడని నానా రభస చేసిన సంగతి తెలిసిందే! తాను అనలేదని సందీప్‌ ప్రమాణం వేసి మరీ చెప్పాడు. ఆ విషయాన్ని గుర్తు చేసిన నాగ్‌.. సందీప్‌ ఒట్టేసినప్పుడు నువ్వెందుకు వేయలేదని ప్రశ్నించాడు.

ఏడుపందుకున్న ప్రశాంత్‌
'ఒకరి మీద నింద వేసేటప్పుడు నిజమై ఉండాలి. ఇవన్నీ కాదు.. అసలు ఊరోడు అనడం తప్పా?' అని సూటిగా ప్రశ్నించాడు. 'అందరూ ఊరి నుంచే వచ్చారు. అందరికీ తిండి పెట్టేది ఊరే.. నేను గర్వంగా చెప్తున్నాను మా నాన్న ఊరోడు. సగర్వంగా చెప్తున్నా.. అందులో తప్పే లేదు' అని కౌంటరిచ్చాడు. దీంతో ప్రశాంత్‌ ఎప్పటిలాగే ఏడుపు అందుకున్నాడు.

చదవండి: సింగర్‌ గీతా మాధురితో విడాకులు.. క్లారిటీ ఇచ్చిన నందు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement