shubha sri
-
జ్యోతిక శ్రీ బృందానికి స్వర్ణం..!
బ్యాంకాక్: ఆసియా రిలే అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో అజ్మల్, దండి జ్యోతిక శ్రీ, అమోజ్ జేకబ్, శుభాలతో కూడిన భారత బృందం మిక్స్డ్ రిలే 4్ఠ400 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం గెలిచింది. భారత బృందం 3 నిమిషాల 14.12 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది.ఈ క్రమంలో గత ఏడాది ఆసియా క్రీడల్లో 3 నిమిషాల 14.34 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డు తెరమరుగైంది. భారత్‌కు బంగారు పతకం దక్కడంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతిక శ్రీ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రదర్శనతో భారత బృందం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 21వ స్థానానికి చేరుకుంది. జూన్ 30వ తేదీలోపు భారత బృందం టాప్–16లోకి చేరితే పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది.ఇవి చదవండి: World Para Championships: శభాష్ దీప్తి.. -
మీదకొచ్చిన శివాజీ.. చాలా ఇబ్బందిపడ్డ లేడీ కంటెస్టెంట్!
బిగ్‌బాస్‌లో నాలుగోవారం నామినేషన్స్ మూడ్ నుంచి కంటెస్టెంట్స్ బయటకొచ్చేశారు. పవరస్త్ర పోటీలో బిజీగా అయ్యారు. దాన్ని దక్కించుకునేందుకు నానా తంటాలు పడ్డారు. బుధవారం ఈ తతంగమంతా నడించింది. ఇంతకీ బిగ్‌బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 24 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: హీరో అవ్వాల్సిన ఆ స్టార్ కొడుకు.. 9 ఏళ్లుగా మంచానికే పరిమితమై!) అక్క అని ప్రాధేయపడ్డాడు నామినేషన్స్ అయిపోవడంతో అందరూ నిద్రపోయారు. ఉదయం లేచిన దగ్గర నుంచి బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇకపోతే నామినేషన్స్‌లో భాగంగా గతంలో ప్రశాంత్, రతిక డ్రస్‌పై చేసిన కామెంట్స్ బయటపడ్డాయి. దీంతో రైతుబిడ్డ వరస మార్చాడు. ఇప్పటినుంచి అక్క అని మాత్రమే పిలుస్తానని రతికతో అన్నాడు. బుధవారం ఉదయం ఆమె దగ్గరకొచ్చి క్షమించమని ప్రాధేయపడ్డాడు. కాసేపటికి ఆమె ఒప్పుకోవడంతో హమ్మయ్యా అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బ్యాంక్ టాస్క్ నాలుగో వారం పవరస్త్ర పోటీలో భాగంగా బిగ్‌బాస్ కొత్త టాస్క్ పెట్టాడు. శివాజీ, సందీప్, శోభాశెట్టి బ్యాంకర్స్ అని చెబుతూ.. వీళ్లలో ఒక్కొక్కరి దగ్గర చెరో 10 వేల విలువైన బీబీ కాయిన్స్ ఉంటాయని, వాటిని మిగతా కంటెస్టెంట్స్‌కి ఇవ్వాల్సి ఉంటుందని అన్నాడు. ప్రతి కాయిన్ విలువ 100గా ఉంటుందని ప్రస్తావించాడు. ఇచ్చిన కాయిన్స్ అన్నింటినీ సేఫ్ డిపాజిట్ లో ఉంచాల్సి ఉంటుంది. ఆట పూర్తయ్యేసరికి ఏ కంటెస్టెంట్ దగ్గరైతే ఎక్కువ కాయిన్స్ ఉంటాయో వాళ్ల నాలుగో పవరస్త్ర పోటీలో ఉంటారని క్లారిటీ ఇచ్చాడు. దీంతో నానా తిప్పలు పడి కంటెస్టెంట్స్ అందరూ కాయిన్స్ సంపాదించారు. (ఇదీ చదవండి: టాలీవుడ్లో గందరగోళం.. ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్!) కంటెస్టెంట్స్ - కాయిన్స్ తేజ - 51 గౌతమ్ - 24 ప్రియాంక - 41 అమరదీప్ - 41 రతిక - 35 యవర్ - 43 ప్రశాంత్ - 33 శుభశ్రీ - 31 అతి చేసిన శివాజీ అయితే కంటెస్టెంట్స్ గెలుచుకున్న కాయిన్స్ అన్నింటినీ సేఫ్ డిపాజిట్లో పెట్టారు. వాటికి కాపలాగా బ్యాంకర్స్ ఉన్నారు. అయితే కాయిన్స్ కొట్టేద్దామనే ప్లానులో భాగంగా శుభశ్రీ.. సేఫ్ దగ్గరకొచ్చింది. ఈ క్రమంలోనే శివాజీ ఆమె పైపైకి వెళ్లాడు. దీంతో ఆమె కాస్త ఇబ్బంది పడింది. కాసేపటికి భోజనం చేస్తూ శివాజీ బిహేవియర్‌ని బిగ్‌బాస్‌తో చెప్పుకొచ్చింది. 'బిడ్డ అని అంటూనే పైపైకి రావడం కరెక్టా? అమ్మాయి దగ్గరకొచ్చి ఎటాక్ చేయడం కరెక్టా? అది గేమ్ కాదు ఓవరాక్షన్' అని శివాజీ తీరుపై శుభశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది. (ఇదీ చదవండి: హీరోయిన్ కంగనకు పెళ్లి? టైమ్ కూడా ఫిక్స్!) గేమ్ స్టార్ట్ కాయిన్స్ అన్ని సేఫ్‌లో పెట్టేశాక బిగ్‌బాస్ మరో గేమ్ పెట్టాడు. ఇందులో భాగంగా ఏటీఎమ్ బజర్‌ని ఎవరైతే మొదట ప్రెస్ చేస్తారో.. వాళ్లు తమ సహచరుడిని సెలెక్ట్ చేసుకోవడంతో పాటు ప్రత్యర్థి జట్టుని కూడా ఎంచుకునే ఆప్షన్ ఉంటుందని అన్నాడు. ఈ గేమ్ ఆడే క్రమంలోనే పల్లవి ప్రశాంత్ చిన్నగా గాయపడ్డాడు. అతడికి ఫస్ట్ ఎయిడ్ చేయడంతో నార్మల్ అయ్యాడు. ఇకపోతే అమరదీప్.. తొలుత బజర్ ప్రెస్ చేయడంతో అతడి గౌతమ్‌ని పార్ట్నర్గా ఎంచుకున్నాడు. తేజ-రతికని ప్రత్యర్థి అని చెప్పాడు. 'స్మైల్ ప్లీజ్' పేరుతో జరిగిన ఈ ఆటలో భాగంగా ఓ టీమ్.. ఎల్లో బాక్సులో నిలబడాల్సి ఉంటుంది. తొలుత తేజ-రతిక ఆడి కేవలం 7 సార్లు మాత్రమే ఫొటోలకు పోజులిచ్చారు. గౌతమ్-అమరదీప్ జోడీ మాత్రం 14 సార్లు పోజులిచ్చి విజయం సాధించారు. గేమ్ రూల్స్‌లో భాగంగా ఓడిన జట్టు దగ్గరున్న కాయిన్స్ అన్నీ సొంతం చేసుకున్నారు. అలా బుధవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: ఆస్కార్ బరిలో చిన్న సినిమా.. అవార్డ్ దక్కేనా?) -
హౌసులో కొత్త గొడవలు.. లవ్‌బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?
'బిగ్‌బాస్ 7' సీజన్ మొదలవడానికి ముందు హోస్ట్ నాగార్జున.. ఈసారి అలా కాదు ఇలా, ఇలా కాదు అని ఏదేదో చెప్పారు. 'ఉల్టా పల్టా' ఉండబోతుందన్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నది చూస్తుంటే.. సేమ్ రొటీన్ స్టఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు లవర్స్ మధ్య సమస్యలు, మరోవైపు కొత్త గొడవలు పుట్టుకొస్తున్నాయి. ఇంతకీ హౌసులో ఏం జరుగుతోంది? లవర్స్- మనస్పర్థలు బిగ్‌బాస్‌లో ఏ సీజన్ తీసుకున్నా సరే.. దాన్ని ప్రేమ అనొచ్చే లేదో తెలీదు గానీ కొందరైతే జంటలు అవుతుంటారు. అలా ఈ సీజన్ లో డాక్టర్-లాయర్ జంట ఒకటి ఉంది. అదే గౌతమ్-శుభశ్రీ జోడీ. వచ్చిన తొలిరోజు నుంచి కలిసి కనిపిస్తూ వచ్చారు. తాజాగా వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయేమో అనిపిస్తుంది. తేజతో శుభశ్రీ డ్యాన్స్ చేస్తుండగా.. గౌతమ్ కాస్త డల్ అయిపోయాడు. ఆ తర్వాత వీళ్ల మధ్య జరిగిన సంభాషణ కూడా స్పర్థలు వచ్చినట్లు హింట్ ఇచ్చేస్తోంది. (ఇదీ చదవండి: హిట్ కొట్టినా... 'ఆదిపురుష్'ని దాటలేకపోయిన 'జవాన్') రతిక వార్నింగ్ ఇమ్యూనిటీ టాస్క్‌లో సందీప్, ప్రియాంక జైన్ గెలిచారు. మరోవైపు బిగ్‌బాస్‌ని ఇంప్రెస్ చేసిన శివాజీ, రతిక కూడా ఫైనల్ పోరుకు అర్హత సాధించారు. ఇక్కడే మరో ట్విస్ట్ వచ్చి పడింది. వీళ్ల నలుగురిలో ఎవరికి అర్హత లేదో చెప్పమని బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. దీంతో పలువురు రతిక పేరు చెప్పారు. ఈ క్రమంలోనే దామిని, రతిక మధ్య గొడవ జరిగింది. నోరు అదుపులో పెట్టుకో అని దామినికి రతిక వార్నింగ్ ఇచ్చింది. టార్గెట్ ఆమెనే అయితే ప్రస్తుతం హౌసులో పరిస్థితి అంతా చూస్తుంటే దాదాపు చాలామంది రతికనే టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది ఓ విధంగా ఆమెకు ప్లస్ కావొచ్చు కూడా. కానీ ఎవరికీ అది అర్థం కావడం లేదేమో అనిపిస్తుంది. మరోవైపు సింక్‌లో ప్లేట్లు కడగకుండా పెట్టేస్తున్నారని ప్రియాంక గట్టిగా అరిచింది. దీనిపై దామిని రియాక్ట్ కాగా.. అప్పుడు ప్రియాంక-దామిని మాటమాట అనుకున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలో రిలీజైన సూపర్‌హిట్ సినిమా.. కానీ?) -
హాస్టల్ భవనంపై నుంచి దూకి..
రాజమహేంద్రవరం: జీఎస్ఎల్ మెడికల్ కళాశాలకు చెందిన ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానగరంలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజి హాస్టల్ లో ఉంటున్న శుభ శ్రీ(21) ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతోంది. కొంతకాలంగా శుభను నలుగురు విద్యార్థులు వేధిస్తున్నట్లు ఆమె ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ర్యాగింగ్ పై కాలేజి కమిటీని కూడా నియమించినట్లు తెలిపారు. వేధింపుల కారణంగా శుభ కొన్నాళ్లుగా మానసికంగా ఇబ్బంది పడుతోందని చెప్పారు. గతంలో కూడా రెండుసార్లు ఆత్మహత్యయత్నాలు చేసినట్లు యాజమాన్యం చెప్పినట్లు తెలిపారు. శుభశ్రీ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెల్లవారేదాకా ఎవరూ గమనించలేదని తెలిపారు. గురువారం వేకువజామున తోటి వారు ఆమె చనిపోయి ఉండటాన్ని గుర్తించినట్లు చెప్పారు. -
ర్యాగింగ్ వల్లే వైద్యవిద్యార్థిని ఆత్మహత్య?
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజి విద్యార్థిని శుభశ్రీ (21) ఆత్మహత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రాజానగరంలోని మెడికల్ కాలేజి హాస్టల్ లో ఉంటున్న శుభ శ్రీ(21) ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఆమె హాస్టల్ భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. వాస్తవానికి నలుగురు విద్యార్థులు తనను ర్యాగింగ్ చేస్తున్నారని రెండు వారాల క్రితం శుభశ్రీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. దానిపై విచారణ కమిటీని నియమించినట్లు కళాశాల యాజమాన్యం చెబుతోంది. అయితే.. శుభశ్రీ కొన్నాళ్లుగా మానసికంగా ఇబ్బంది పడుతోందని, ఇంతకు ముందు కూడా రెండుసార్లు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని తెలిపింది.