మీదకొచ్చిన శివాజీ.. చాలా ఇబ్బందిపడ్డ లేడీ కంటెస్టెంట్! | Bigg Boss 7 Telugu Day 24 Episode Highlights: Bank Task For Contestants, Smiley Photo Task For BB Coins - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 24 Highlights: అతిచేసిన శివాజీ.. బిగ్‌బాస్‌తో చెప్పుకొన్న శుభశ్రీ!

Published Wed, Sep 27 2023 10:54 PM | Last Updated on Sat, Sep 30 2023 1:59 PM

Bigg Boss 7 Telugu Day 24 Episode Highlights - Sakshi

బిగ్‌బాస్‌లో నాలుగోవారం నామినేషన్స్ మూడ్ నుంచి కంటెస్టెంట్స్ బయటకొచ్చేశారు. పవరస్త్ర పోటీలో బిజీగా అయ్యారు. దాన్ని దక్కించుకునేందుకు నానా తంటాలు పడ్డారు. బుధవారం ఈ తతంగమంతా నడించింది. ఇంతకీ బిగ్‌బాస్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 24 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: హీరో అవ్వాల్సిన ఆ స్టార్ కొడుకు.. 9 ఏళ్లుగా మంచానికే పరిమితమై!)

అక్క అని ప్రాధేయపడ్డాడు 
నామినేషన్స్‌ అయిపోవడంతో అందరూ నిద్రపోయారు. ఉదయం లేచిన దగ్గర నుంచి బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇకపోతే నామినేషన్స్‌లో భాగంగా గతంలో ప్రశాంత్, రతిక డ్రస్‌పై చేసిన కామెంట్స్ బయటపడ్డాయి. దీంతో రైతుబిడ్డ వరస మార్చాడు. ఇప్పటినుంచి అక్క అని మాత్రమే పిలుస్తానని రతికతో అన్నాడు. బుధవారం ఉదయం ఆమె దగ్గరకొచ్చి క్షమించమని ప్రాధేయపడ్డాడు. కాసేపటికి ఆమె ఒప్పుకోవడంతో హమ్మయ్యా అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

బ్యాంక్ టాస్క్
నాలుగో వారం పవరస్త్ర పోటీలో భాగంగా బిగ్‌బాస్ కొత్త టాస్క్ పెట్టాడు. శివాజీ, సందీప్, శోభాశెట్టి బ్యాంకర్స్ అని చెబుతూ.. వీళ్లలో ఒక్కొక్కరి దగ్గర చెరో 10 వేల విలువైన బీబీ కాయిన్స్ ఉంటాయని, వాటిని మిగతా కంటెస్టెంట్స్‌కి ఇవ్వాల్సి ఉంటుందని అన్నాడు. ప్రతి కాయిన్ విలువ 100గా ఉంటుందని ప్రస్తావించాడు. ఇచ్చిన కాయిన్స్ అన్నింటినీ సేఫ్ డిపాజిట్ లో ఉంచాల్సి ఉంటుంది. ఆట పూర్తయ్యేసరికి ఏ కంటెస్టెంట్ దగ్గరైతే ఎక్కువ కాయిన్స్ ఉంటాయో వాళ్ల నాలుగో పవరస్త్ర పోటీలో ఉంటారని క్లారిటీ ఇచ్చాడు. దీంతో నానా తిప్పలు పడి కంటెస్టెంట్స్ అందరూ కాయిన్స్ సంపాదించారు.

(ఇదీ చదవండి: టాలీవుడ్‌లో గందరగోళం.. ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్!)

కంటెస్టెంట్స్ - కాయిన్స్

  • తేజ - 51
  • గౌతమ్ - 24
  • ప్రియాంక - 41
  • అమరదీప్ - 41
  • రతిక - 35
  • యవర్ - 43
  • ప్రశాంత్ - 33 
  • శుభశ్రీ - 31

అతి చేసిన శివాజీ
అయితే కంటెస్టెంట్స్ గెలుచుకున్న కాయిన్స్ అన్నింటినీ సేఫ్ డిపాజిట్‌లో పెట్టారు. వాటికి కాపలాగా బ్యాంకర్స్ ఉన్నారు. అయితే కాయిన్స్ కొట్టేద్దామనే ప్లానులో భాగంగా శుభశ్రీ.. సేఫ్ దగ్గరకొచ్చింది. ఈ క్రమంలోనే శివాజీ ఆమె పైపైకి వెళ్లాడు. దీంతో ఆమె కాస్త ఇబ్బంది పడింది. కాసేపటికి భోజనం చేస్తూ శివాజీ బిహేవియర్‌ని బిగ్‌బాస్‌తో చెప్పుకొచ్చింది. 'బిడ్డ అని అంటూనే పైపైకి రావడం కరెక్టా? అమ్మాయి దగ్గరకొచ్చి ఎటాక్ చేయడం కరెక్టా? అది గేమ్ కాదు ఓవరాక్షన్' అని శివాజీ తీరుపై శుభశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది.

(ఇదీ చదవండి: హీరోయిన్ కంగనకు పెళ్లి? టైమ్ కూడా ఫిక్స్!)

గేమ్ స్టార్ట్
కాయిన్స్ అన్ని సేఫ్‌లో పెట్టేశాక బిగ్‌బాస్ మరో గేమ్ పెట్టాడు. ఇందులో భాగంగా ఏటీఎమ్ బజర్‌ని ఎవరైతే మొదట ప్రెస్ చేస్తారో.. వాళ్లు తమ సహచరుడిని సెలెక్ట్ చేసుకోవడంతో పాటు ప్రత్యర్థి జట్టుని కూడా ఎంచుకునే ఆప్షన్ ఉంటుందని అన్నాడు. ఈ గేమ్ ఆడే క్రమంలోనే పల్లవి ప్రశాంత్ చిన్నగా గాయపడ్డాడు. అతడికి ఫస్ట్ ఎయిడ్ చేయడంతో నార్మల్ అయ్యాడు. ఇకపోతే అమరదీప్.. తొలుత బజర్ ప్రెస్ చేయడంతో అతడి గౌతమ్‌ని పార్ట్‌నర్‌గా ఎంచుకున్నాడు. తేజ-రతికని ప్రత్యర్థి అని చెప్పాడు. 

'స్మైల్ ప్లీజ్' పేరుతో జరిగిన ఈ ఆటలో భాగంగా ఓ టీమ్.. ఎల్లో బాక్సులో నిలబడాల్సి ఉంటుంది. తొలుత తేజ-రతిక ఆడి కేవలం 7 సార్లు మాత్రమే ఫొటోలకు పోజులిచ్చారు. గౌతమ్-అమరదీప్ జోడీ మాత్రం 14 సార్లు పోజులిచ్చి విజయం సాధించారు. గేమ్ రూల్స్‌లో భాగంగా ఓడిన జట్టు దగ్గరున్న కాయిన్స్ అన్నీ సొంతం చేసుకున్నారు. అలా బుధవారం ఎపిసోడ్ పూర్తయింది.

(ఇదీ చదవండి: ఆస్కార్ బరిలో చిన్న సినిమా.. అవార్డ్ దక్కేనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement