'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్! | Bigg Boss 7 Telugu Double Elimination Priyanka Jena And Subhashree | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Elimination: మొదటిసారి డబుల్ ఎలిమినేషన్.. హింట్ ఇచ్చిన నాగార్జున!

Published Sat, Oct 7 2023 7:04 PM | Last Updated on Sat, Oct 7 2023 10:45 PM

Bigg Boss 7 Telugu Double Elimination Priyanka Jena And Subhashree - Sakshi

'బిగ్‪‌బాస్ 7' షో ఐదోవారం వీకెండ్‌కి వచ్చేసింది. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరా అనేది సస్పెన్స్‌గా మారిపోయింది. అదే టైంలో ఆరుగురు కొత్తవాళ్లు కూడా హౌసులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. సరిగ్గా ఇలాంటి టైంలో బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ అనుకున్నట్లు కాకుండా డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. విచిత్రం ఏంటంటే ఆ ఇద్దరు అమ్మాయిలేనట. ఇంతకీ ఏంటి విషయం?

ఏంటి విషయం?
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రస్తుతం టెలికాస్ట్ అవుతుంది. గత నాలుగు వారాల్లో వరసగా కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికని ఎలిమినేట్ చేసి పంపేశారు. ఐదోవారం మాత్రం పవరస్త్ర గెలుచుకున్న శోభా, సందీప్, ప్రశాంత్ తప్పితే అందరూ నామినేట్ అయ్యారు. వాళ్లకు వచ్చిన ఓటింగ్‌లో శుక్రవారం వరకు చూసుకుంటే శివాజీ టాప్‌లో ఉన్నాడు. ప్రియాంక చివర‍్లో ఉంది. దీంతో ఈసారి ప్రియాంక ఎలిమినేట్ అని అందరూ అనుకున్నారు.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్)

డబుల్ ధమాకా
అయితే ఈ ఆదివారం సర్ ప్రైజ్ ఉందని హౌసులో ఉన్నవాళ్లందరికీ నాగ్ చెప్పాడు. ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ అని బయట అందరికీ తెలిసిపోయింది. అలానే వాళ్ల పేర్లు కూడా లీక అయ్యాయి. అర్జున్ అంబటి, కెవ్వు కార్తీక్, పూజామూర్తి, నయని పావని, అశ్విని శ్రీ, భోళే షావలే.. వీళ్లని తెలుస్తోంది. ఇలా కొత్తగా ఆరుగురు వస్తున్నారని.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లే హౌసులో ఉండే అర్హత లేని ముగ్గురు పేర్లు చెప్పమని నాగ్ చెప్పడం మీరు ప్రోమోలో చూడొచ్చు. 

ఆ ఇద్దరు పక్కానా?
నాగ్ ఇచ్చిన టాస్కులో భాగంగా కంటెస్టెంట్ అందరూ తమకు అనిపించిన తలో ముగ్గురి పేర్లు చెప్పారు. ఇందులో భాగంగా తేజ, ప్రియాంక, శుభశ్రీ ఫైనల్ అయ్యారని.. వీళ్లలో తేజ సేవ్ కాగా శుభశ్రీ-ప్రియాంక ఒకేసారి ఎలిమినేట్ అయ్యారని అంటున్నారు. అలానే ప్రియాంకని పూర్తిగా బయటకు పంపేయకుండా సీక్రెట్ రూంలో ఉంచారని సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే శనివారం ఎపిసోడ్ పూర్తి కావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement