Bigg Boss 7 Telugu Priyanka Jain Her Boyfriend Shivakumar Land In Hyderabad; Video Viral | Sakshi
Sakshi News home page

Priyanka Jain: ఇల్లు వద్దనుకుని ల్యాండ్ తీసుకున్నారు.. ఎందుకంటే?

Published Mon, Apr 29 2024 7:40 AM | Last Updated on Mon, Apr 29 2024 9:06 AM

Bigg Boss 7 Telugu Priyanka Jain Boyfriend Buys Land In Hyderabad

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్‌తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతకు ముందు పలు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం షోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీగా ఉంది. తన బాయ్ ఫ్రెండ్‌తో హైదరాబాద్‌లోనే కలిసి ఉంటున్న ప్రియాంక ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. తాము ఇక్కడ భూమి కొనుగోలు చేసినట్లు శుభవార్త చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటా.. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్)

ప్రస్తుతం హైదరాబాద్‌లోని అద్దె ఫ్లాట్‌లో ఉంటున్న ప్రియాంక-శివ్.. తొలుత కొత్త ఫ్లాట్ తీసుకోవాలని అనుకున్నారు. టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఫ్లాట్ తీసుకోవడం తనకు ఇష్టం లేదని, ల్యాండ్ కొని ఇల్లు కట్టుకుంటే వచ్చే మజా వేరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివ్ అసలు విషయం చెప్పాడు. జనవరి నుంచి ల్యాండ్ కోసం తిరుగుతుండగా ఎప్పుడో ఓ సమస్య వచ్చేదని ప్రియాంక చెప్పుకొచ్చింది.

ల్యాండ్ బాగుంటే రేటు నచ్చడం లేదని, అన్ని బాగుంటే పేపర్స్ సరిగా ఉండట్లేదని ప్రియాంక-శివ్ చెప్పారు. ఏప్రిల్ 10న ల్యాండ్ ఓకే చేసి, 23వ తేదీని రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. ఆ విజువల్స్ కూడా చూపించారు. అయితే హైదరాబాద్‌లో ల్యాండ్ కొనడం అంత ఈజీ కాదని చెప్పాడు. మొత్తానికి తన కల నెరవేరిందని శివ్ చెప్పగా.. ప్రియాంక ఫుల్ హ్యాపీగా కనిపించింది. ప్రస్తుతానితి ముహుర్తాలు లేవని, త్వరలో ఇంటి అప్డేట్స్ చెబుతామని ప్రియాంక-శివ్ చెప్పారు.

(ఇదీ చదవండి:కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్ )

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement