Bigg Boss 7: ఆమె ఎలిమినేట్.. ఈసారి కూడా లేడీ విన్నర్ లేనట్లే! | Bigg Boss 7 Telugu Finale Priyanka Jain Eliminated | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: ఫినాలేకి వచ్చిన వన్ అండ్ ఓన్లీ లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్!

Dec 16 2023 6:10 PM | Updated on Dec 16 2023 6:22 PM

Bigg Boss 7 Telugu Finale Priyanka Jain Eliminated - Sakshi

ఇప్పటివరకు బిగ్‌బాస్ ఆరు సీజన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తోంది. మొత్తంగా అన్నింట్లోనూ అబ్బాయిలే విజేతలుగా నిలిచారు. ఓటీటీ షోలో బిందుమాధవి గెలిచినా సరే అది రెగ్యులర్ సీజన్ కేటగిరీలోకి రాదు. అయితే ఈసారైనా లేడీ కంటెస్టెంట్‌కి నిరాశే ఎదురైంది. ఫినాలే వరకు వచ్చి, టాప్-6లో నిలిచిన వన్ అండ్ ఓన్లీ అమ్మాయి కూడా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఏంటి సంగతి?

(ఇదీ చదవండి: ఉచితంగా 'సలార్' టికెట్స్.. తెలుగు యంగ్ హీరో బంపరాఫర్)

ప్రియాంక ఎలిమినేట్!
సీరియల్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్.. తొలి కంటెస్టెంట్‌గా ఈ సీజన్‌లో అడుగుపెట్టింది. హైట్ తక్కువగా ఉన్నాసరే తొలివారం నుంచి అబ్బాయిలకు టఫ్ ఫైట్ ఇచ్చింది. చాపకింద నీరులా ఒక్కో గేమ్ గెలుస్తూ చివరివరకు వచ్చేసింది. ఈసారి ఫినాలే వీక్‌లో అడుగుపెట్టిన ఏకైక లేడీ కంటెస్టెంట్‌గా నిలిచింది. అయితే చివరి ఆరుగురిలో ఓట్లు తక్కువ వచ్చిన కారణంగా తొలుత అర్జున్ బయటకెళ్లిపోగా, తాజాగా ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. 

పొట్టిపిల్ల కాదు గట్టిపిల్ల
సీజన్ మొదలైనప్పటి నుంచి ప్రియాంక మీద ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అయితేనేం ఒక్కో వారం మిగిలిన కంటెస్టెంట్స్‌ని దాటుకుంటూ ఫైనల్ వరకు వచ్చేసింది. టాప్-6లో ఈమె కంటే ఓటింగ్ పరంగా బలమైన కంటెస్టెంట్స్ ప్రశాంత్, అమర్, శివాజీ ఉండటం ఈమెకు కలిసిరాలేదని చెప్పొచ్చు. ఏదేమైనా ఫినాలే వరకు వచ్చినప్పుడే ప్రియాంక గెలిచేసింది. కాకపోతే ట్రోఫీ కూడా గెలుచుకుని ఉంటే వేరే లెవల్ ఉండేది. అయితే ప్రియాంక ఎలిమినేషన్ పై ఆదివారం ఎపిసోడ్‌లో పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌: ప్రశాంత్‌కు బంపరాఫర్‌ ఇచ్చిన శ్రీముఖి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement