Bigg Boss 7: శివాజీ బయటపడలేదు.. ప్రియాంక మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయింది! | Bigg Boss 7 Telugu Day 100 Episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 100 Highlights: ప్రియాంకని ఏడిపించేసిన బిగ్‌బాస్.. ఒక్కటైపోయిన అర్జున్-యావర్!

Published Tue, Dec 12 2023 11:17 PM | Last Updated on Wed, Dec 13 2023 8:37 AM

Bigg Boss 7 Telugu Day 100 Episode Highlights - Sakshi

బిగ్‌బాస్ మరోసారి ఏడిపించేశాడు. అవును ప్రియాంక, తనని తాను కంట్రోల్ చేసుకోలేనంతగా ఎమోషనల్ చేశాడు. అయితే శివాజీ మాత్రం పెద్దగా బయటపడలేదు. మరోవైపు ఓ గొడవ వల్ల విడిపోయిన అర్జున్-యావర్ మళ్లీ ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే యావర్ బోరున ఏడ్చేయడం కంటతడి పెట్టించింది. ఇంతకీ మంగళవారం ఏం జరిగిందనేది Day 100 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

శివాజీకి ఓ రేంజు ఎలివేషన్
సోమవారం ఎపిసోడ్‌లో జర్నీ వీడియోలతో అమర్, అర్జున్‌ని ఎమోషనల్ చేసిన బిగ్‌బాస్.. మంగళవారం ఎపిసోడ్‌ని శివాజీతో స్టార్ట్ చేశాడు. ఇతడి బిగ్‌బాస్ జ్ఞాపకాల్ని.. 'బుక్ ఆఫ్ మెమొరీస్'లో పొందుపరిచి శివాజీని సర్‌ప్రైజ్ చేశాడు. అనంతరం దాదాపు 17 నిమిషాల వీడియోని ప్లే చేసి మరీ శివాజీకి ఓ రేంజు ఎలివేషన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ క్రమంలోనే శివాజీ.. 25 ఏళ్ల ఇండస్ట్రీ కెరీర్ ఓ ఎత్తు.. బిగ్‌బాస్ జర్నీ ఓ ఎత్తు.. ఇక్కడి నుంచి ఎంతో కొంత నేర్చుకుని వెళ్తాం. అదైతే సత్యం బిగ్‌బాస్..  కప్పు గెలుస్తామా? లేదా అనేది పక్కనబెడితే.. చివరివారం వరకు వచ్చిన ఆరుగురు మాత్రం ప్రేక్షకుల హృదయాల్ని గెలిచారని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. 

(ఇదీ చదవండి: 'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!)

ప్రియాంక గట్టిపిల్ల
శివాజీ తర్వాత ప్రియాంకని పిలిచిన బిగ్‌బాస్.. ఈమెకి సంబంధించిన ఫొటోలని డిస్‌ప్లే చేశారు. అయితే మిగతా ఫొటోల సంగతేమో గానీ తన బాయ్‌ఫ్రెండ్ శివతో ఉన్న పిక్ చూసిన తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇక ప్రియాంక గురించి ఎలివేషన్స్ ఇచ్చిన బిగ్‌బాస్.. సింపుల్ ప్రియాంకగా ఉండే మీరు.. శివంగి ప్రియాంకగా నామినేషన్స్‌లో మీరు ఎంత బలమైన కంటెస్టెంట్ అనేది మీరు ఎలాంటివారో  తెలిసింది. పొట్టి పిల్ల కాదు గట్టిపిల్ల.. మీరు 100 శాతం ఇస్తూ వచ్చారు. మీ పట్టుదలే మిమ్మల్ని జీవితంలో మొదటి స్థానంలో నిలుపుతుందని కోరుకుంటూ మీ ప్రయాణం చూద్దాం అని దాదాపు 15 నిమిషాల వీడియోని ప్లే చేశాడు. అయితే ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా ప్రియాంక ఎమోషనల్ అవుతూ, ఆనంద బాష్పలతో కనిపించింది. 

మరోవైపు గతంలో ఓసారి నామినేషన్స్ సందర్భంగా ఇక యావర్‌తో మాట్లాడనని చెప్పిన అర్జున్.. తన జర్నీ వీడియోలో ఇద్దరం కలిసున్న సీన్స్ భలే ఉన్నాయని చెప్పాడు. దీంతో యావర్, అర్జున్‌ని హగ్ చేసుకుని గట్టిగా ఏడ్చేశాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. ఈరోజు ఎపిసోడ్ గురించి మీకు రాసి చెబితే ఆ ఫీల్ క్యారీ చేయలేం. కాబట్టి కుదిరితే ఫుల్ వీడియో చూడండి.

(ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement