బిగ్‌బాస్ 7వ సీజన్‌లో శివాజీ ఉన్నాడంటే ఉన్నాడంతే. ఓ టాస్క్ సరిగా ఆడలేడు, గేమ్‌లో గెలవలేడు. పోనీ సంచాలక్ బాధ్యత అయినా సరిగా చేశాడా? అంటే అది లేదు. తాజాగా శివాజీ పెట్టిన నిర్ణయం.. ప్రియాంక ప్రాణాల మీదకు తెచ్చింది. మరోవైపు 'టికెట్ టూ ఫినాలే' కోసం ఆల్రెడీ పోటీ మొదలైంది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 86 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
శివాజీ సోది ముచ్చట
నామినేషన్స్ పూర్తవడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే అర్జున్, గౌతమ్ తనని నామినేట్ చేయడాన్ని శివాజీ తీసుకోలేకపోయాడు. పొద్దుపొద్దునే ప్రశాంత్‌తో మాట్లాడుతూ.. మొన్నే వెళ్లిపోవాల్సిందిరా, ఎందుకురా ఈ మెంటల్ టార్చర్ అని గౌతమ్‌ని ఉద్దేశించి అన్నాడు. అలానే తన విషయంలో అర్జున్‌ది 100 శాతం పిచ్చి స్ట్రాటజీ అని, నన్ను పంపించేయండ్రా బాబు అని మాట్లాడాడు. ఇది జరిగిన కాసేపటి తర్వాత ప్రియాంకతోనూ మాట్లాడుతూ.. వెళ్లిపోయినా బాగుండేది, పిల్లలు బాగా గుర్తొస్తున్నారని శివాజీ చెప్పుకొచ్చాడు. అయితే ఇవన్నీ కూడా సోది ముచ్చట్లలానే అనిపించాయి.
టికెట్ టూ ఫినాలే షురూ
13వ వారం వచ్చేసింది. అంటే ఫినాలే జరగడానికి రెండు వారాలు కూడా లేదు. దీంతో బిగ్‌బాస్.. తన గేమ్ షురూ చేశాడు. 'టికెట్ టూ ఫినాలే' మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా పలు గేమ్స్ పెడతారని, వీటన్నింటిలో గెలిచి ఎక్కువ పాయింట్స్ సంపాదించిన హౌస్‌మేట్.. ఇకపై కేవలం ఇంటి సభ్యునిగా ఉండకుండా నేరుగా ఫినాలే వారానికి చేరుకుంటారు. మొట్టమొదటి ఫైనలిస్ట్ అవుతారని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చేశాడు.
అర్జున్ దూకుడు.. అమర్ అదృష్టం
'టిక్ టాక్ టిక్' అని తొలి గేమ్‌లో భాగంగా.. బాణం వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఆ బాణం టచ్ అయితే ఔట్ అయినట్లు కాదు, ఫ్లాట్ ఫామ్ పైనుంచి కింద పడితే ఔట్ అయినట్లు అని బిగ్‌బాస్ తొలుత చెప్పాడు. కాసేపటి తర్వాత బాణానికి కాలు తగిలినా సరే ఫౌల్(ఔట్) అని ట్విస్ట్ ఇచ్చాడు. ఇందులో ప్రశాంత్, గౌతమ్, శోభా, శివాజీ, యావర్, అమర్, ప్రియాంక వరసగా ఎలిమినేట్ అయిపోయారు. చివరగా మిగిలిన అర్జున్ విజేతగా నిలిచాడు. పూలని సేకరించే రెండో టాస్క్‌లో తక్కువ పూలు ఉన్న కారణంగా శివాజీ, ప్రియాంక ఎలిమినేట్ అయిపోయారు. ఇలా రెండు గేమ్స్‌తో మొదటి లెవల్ పూర్తయింది. పాయింట్ల ప్రకారం చివర్లో ఉన్న శివాజీ, శోభా ఎలిమినేట్ అయిపోయారు. వాళ్లు పాయింట్స్ వేరొకరికి ఇవ్వాలని చెప్పగా.. అమర్‌కి ఇచ్చేశారు. అలా మనోడికి లక్ కలిసొచ్చింది.
తలతిక్క సంచాలక్స్.. గేమ్ డిస్ట్రబ్
ఇక చివరగా 'గాలం వేయ్ బుట్టలో పడేయ్' అనే టాస్క్ పెట్టారు. దీనికి శివాజీ, శోభా సంచాలక్స్‌గా వ్యవహరించారు. అయితే రింగ్‌తో బంతిని బయటకు లాగిన తర్వాత ఎవరైనా సరే దాన్ని తీసేసుకోవచ్చని ఓ పిచ్చి రూల్ పెట్టారు. ఈ పోటీ అర్జున్.. బంతిని ఫస్ట్ ఫస్ట్ లాగేసి ఎక్కువ పాయింట్స్ సంపాదించాడు. అయితే ప్రియాంక మూడుసార్లు బంతిని బయటకు లాగినప్పటికీ ప్రశాంత్, యావర్, అమర్.. ఈమె దగ్గర నుంచి లాగేసుకున్నారు. చివర్లో అమర్ అయితే ఈమెని ఎలా పడితే అలా లాగేశాడు. బయటకు చెప్పలేదు గానీ ప్రియాంకకు దెబ్బలు గట్టిగానే తగిలినట్లు అనిపించాయి.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. శివాజీకి గ్రూప్ గేమ్స్ అంటే ప్రశాంత్-యావర్ తో ఏదే మేనేజ్ చేసి ఆడేస్తాడు. కానీ ఒంటరిగా ఆడాలనేసరికి దొరికిపోయాడు. తాజాగా రెండు గేమ్స్ లోనూ ఓడిపోయి.. టికెట్ టూ ఫినాలే రేస్ నుంచి తప్పించారు. పోనీ అది కాదని సంచాలక్ బాధ్యతలు ఇస్తే, అందులోనూ ఎక్కడలేని పిచ్చి రూల్స్ అన్ని పెట్టి.. ప్రియాంక విజయావకాశాల్ని దెబ్బతీసేశాడు చేశాడు. 13వ వారంలో శివాజీ తీరు వల్ల అతడొక్కడే కాదు.. మొత్తం గేమ్ తీరే దెబ్బతింటోంది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment