బిగ్‌బాస్ 7వ సీజన్‌లో షాకింగ్ ఎలిమినేషన్. ఒక్కో దశని దాటుకుంటూ ఫినాలే వరకు వచ్చిన ప్రియాంక.. చిట్టచివరిది అయిన ఆదివారం ఎపిసోడ్‌లో ఫస్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌గా నిలిచింది. కప్ కొట్టలేకపోవచ్చు, ఓట్లు విషయంలో మిగతా వారికంటే వెనకబడిపోయి ఉండొచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలామంది మనసులు గెలిచింది. దీనికి తోడు మంచి రెమ్యునరేషన్‌తో బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చింది.
ఎలిమినేషన్‌కి రీజన్
బిగ్‌బాస్ 7 హౌసులోకి తొలి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంకపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఎందుకంటే సీరియల్ నటిగా అందరికీ తెలిసిన ఈమె.. కప్ కొట్టడం, ఫినాలే వీక్ రావడం సంగతి అటుంచితే కొన్ని వారాలు ఉంటే గ్రేట్ అనుకున్నారు. అలాంటిది తొలి పవరస్త్ర కోసమే చివరివరకు వచ్చి ఓడిపోయింది. అక్కడి నుంచి మొదలుపెడితే దాదాపు చాలా గేమ్స్‌లో చివరివరకు వచ్చి బోల్తా కొట్టింది. ఒకటి రెండుసార్లు మినహా దాదాపు సీజన్ అంతా కూడా చాలా డిగ్నిఫైడ్‌గా ఆడింది. అమ్మాయి కావడం, పెద్దగా ఫేమ్ లేకపోవడంతో ఈమె ఓట్లు పడలేదు.
(ఇదీ చదవండి: Bigg Boss 7: అర్జున్ అంత సంపాదించాడా? 10 వారాల్లోనే..)
ఈ క్రమంలోనే ఫినాలే టాప్-6లో అడుగుపెట్టిన వన్ అండ్ ఓన్లీ లేడీ కంటెస్టెంట్‌గా ప్రియాంక నిలిచింది. కానీ ఓటింగ్ విషయంలో బలమైన కంటెస్టెంట్స్ ఈమె కంటే ముందు ఉండటం ఈమెకు పెద్ద మైనస్ అయిందని చెప్పొచ్చు. ఈ సీజన్‌లో పాల్గొన్న అమ్మాయిలందరితో పోలిస్తే ప్రియాంక ది బెస్ట్ ఫెర్ఫార్మర్ అని చెప్పొచ్చు. చాలామంది ఒప్పుకొన్న ఒప్పుకోకపోయినా శివాజీ కంటే ప్రియాంక చాలా బెటర్!
రెమ్యునరేషన్ ఎన్ని లక్షలు?
సీరియల్ నటిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక.. బిగ్‌బాస్ షోతో మరింత ఫేమ్, క్రేజ్ తెచ్చుకుంది. ఈమెకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇకపోతే సీజన్ అంతా అంటే 15 వారాల పాటు హౌసులో ఉన్న ప్రియాంక.. వారానికి రూ.2.5 లక్షల రెమ్యునరేషన్ మాట్లాడుకుందట. అంటే మొత్తంగా రూ.37.5 లక్షలు ఈమె సంపాదించినట్లు తెలుస్తోంది. ఇంత మొత్తం డబ్బులు అంటే ప్రియాంక ఆర్థికంగానూ కాస్త కుదురుకున్నట్లే!
(ఇదీ చదవండి: Bigg Boss 7 Grand Finale: అది ఫేక్ న్యూస్)
Comments
Please login to add a commentAdd a comment