
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌లో ఎనిమిది మంది మిగిలారు. వీరిలో ఎవరు టాప్ 5కి చేరతారు? ఎవరు ఫినాలేలో అడుగుపెట్టకుండానే తిరిగి వెళ్లిపోతారు? అనేది ఆసక్తికరంగా మారింది. నిన్న డబుల్ ఎలిమినేషన్‌తో అశ్విని, రతిక ఇద్దరినీ పంపించేశారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడే ఛాన్స్ ఉన్నప్పటికీ రైతుబిడ్డ ఎవరికీ ఇవ్వడానికి మొగ్గుచూపలేదు. దీంతొ ఇద్దరమ్మాయిలు వెళ్లిపోయారు.
తాజాగా మరో ఒకర్ని ఇంటికి పంపించేందుకు నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. నామినేట్ చేయాలనుకునే ఇద్దరి ముఖంపై పెయింట్ వేయాలని చెప్పాడు. ప్రియాంక మాట్లాడుతూ.. మీరు నా గేమ్ చూసి చాలాసార్లు ప్రోత్సహించారు. దానికన్నా ఎక్కువ నాపై నెగెటివిటీ పెట్టుకున్నారు. నన్ను నెగెటివ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు అంటూ శివాజీని నామినేట్ చేసింది. అర్జున్, గౌతమ్ సైతం అతడిని నామినేట్ చేశారు.
ఇక సోఫాజీని నామినేట్ చేసినందుకో ఏమో కానీ ప్రిన్స్ యావర్, ప్రశాంత్.. సీరియల్ బ్యాచ్‌ను నామినేట్ చేశారు. కానీ అమర్‌ను మాత్రం ఎవరూ నామినేట్ చేయకపోవడం విశేషం. దీంతో ఈ వారం అమర్ మినహా మిగతా ఏడుగురూ నామినేషన్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎవర్ని ఏ కారణాలతో నామినేట్ చేశారు? టికెట్ టు ఫినాలే దక్కించుకునేదెవరు? అనేది రానున్న ఎపిసోడ్స్‌లో తెలియనుంది.
చదవండి: తెలుగులో స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్.. కానీ అలా చేశారు
Comments
Please login to add a commentAdd a comment