మీరు స్లమ్ అనుకున్నా సరే.. ఇదే నా ఇల్లు: బిగ్ బాస్ ప్రియాంక | Bigg Boss Contestant Priyanka Jain Mumbai Home Tour Goes Viral | Sakshi
Sakshi News home page

Bigg Boss: నా చిన్నప్పటి ఇల్లు ఇదే.. పైనా, కింద పడుకునేవాళ్లం: ప్రియాంక జైన్

Published Wed, Dec 13 2023 4:04 PM | Last Updated on Thu, Dec 14 2023 4:51 PM

Bigg Boss Contestant Priyanka Jain Mumbai Home Tour Goes Viral - Sakshi

ప్రియాంక జైన్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ అచ్చం తెలుగమ్మాయిలా టాలీవుడ్ ప్రేక్షకులను బుల్లితెరపై అలరిస్తోంది. ఇప్పుడు బిగ్‌ బాస్‌ సీజన్‌-7లో ఏకంగా గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుంది. ప్రస్తుతం టాప్‌-5 ప్లేస్ కోసం పోటీపడుతోంది. తెరపై మనకు కనిపిస్తున్న ప్రియాంక రియల్ లైఫ్‌ గురించి వింటే ఎవరికైనా కన్నీళ్లు రావాల్సిందే. ఇంతకు ప్రియాంక ప్రయాణం ఎలా మొదలైంది. ముంబైలో ఉండాల్సిన ప్రియాంక.. హైదరాబాద్‌ ప్రియాంకగా ఎలా మారింది? అనే వివరాలు తెలుసుకుందాం. 

ప్రియాంక జైన్‌ బుల్లితెరపై 'జానకి కలగనలేదు' సీరియల్‌తోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత మౌనరాగం సీరియల్‌లో కనిపించింది. అదే సమయంలో బుల్లితెర నటుడు శివ కుమార్‌తో ఆమె ప్రేమలో పడింది. చాలా ఏళ్లుగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. అమ్ములుగా ప్రియాంక జైన్.. అంకిత్‌గా శివ కుమార్‌ ప్రేక్షకులను అలరించారు. 

అయితే ముంబైకి చెందిన ప్రియాంక తన చిన్నప్పుడు ఒక చిన్న ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఉండేది. ముంబైలోని ఓ స్లమ్ ఏరియాలో ఉండేవారు. రోడ్డు పక్కనే ఉన్న చాలా చిన్న ఇంట్లో తన బాల్యంలో ఉన్న ఇంటికి సంబంధించిన ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది.  ఆ ఇంట్లోనే తిరుగుతూ తాను పెరిగిన వాతావరణం, ఇంటిని అభిమానులకు పరిచయం చేసింది. అంతే కాకుండా తాను పడ్డ ఇబ్బందులన్నింటినీ వివరిస్తూ ఎమోషనలైంది. తన చిన్నప్పుడే తాతయ్య, అమ్మమ్మ చనిపోయారంటూ తలుచుకుని కంటతడి పెట్టుకుంది. మా అమ్మా, నాన్నది లవ్ మ్యారేజ్ అని.. లేచిపోయి పెళ్లి చేసుకున్నారని ప్రియాంక తెలిపింది. 

ప్రస్తుతం దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చాడంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. ఆ స్థాయి నుంచి తాను ఇక్కడ ఉన్నానంటే.. అమ్మా, నాన్న వల్లేనంటూ ఎమోషనలైంది. జీవితంలో ఎవరూ అధైర్య పడవద్దని సూచించింది.  బాగా చదువుకుని జీవితంలో పైకి రావాలని తెలిపింది. నా తల్లిదండ్రుల సహకారం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొంది. అయితే ప్రియాంక ఇంటిని చూసిన శివకుమార్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఇలాంటి ఇంటి నుంచి ప్రియాంక వచ్చిందంటే ఏం చెప్పాలో అర్థం కావటం లేదన్నారు. ఆమెతో పోల్చుకుంటే ఆ దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చాడని అన్నాడు. ఈ వీడియోలో ప్రియాంక ఇంటిని చూసిన ఫ్యాన్స్ తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement