బిగ్‌ బాస్ హౌస్‌లో లవ్ బర్డ్స్‌.. ఇక్కడే పెళ్లి చేసుకుందామన్న ప్రియాంక! | Bigg Boss Surprise To Priyanka Jain With Her Lover Shiva Kumar | Sakshi
Sakshi News home page

Bigg Boss: 'మిస్‌ యూ టూ'.. హౌస్‌లో ముద్దుల వర్షం..!

Published Wed, Nov 8 2023 3:39 PM | Last Updated on Wed, Nov 8 2023 4:30 PM

Bigg Boss Surprise To Priyanka Jain With Her Lover Shiva Kumar - Sakshi

బిగ్ బాస్ హౌస్‌లో రోజు రోజుకు మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటి వరకు నామినేషన్స్, గేమ్ టాస్కులతో బిజీగా ఉండే కంటెస్టెంట్స్ ఈ వారంలో కంటతడి పెట్టిస్తున్నారు. ఎప్పుడు హాట్‌ హాట్‌గా సాగే బిగ్‌ బాస్ హౌస్‌.. ఇప్పుడు ఫుల్‌ ఎమోషనల్‌గా మారింది. మంగళవారం ఒక్క రోజే ముగ్గురు కంటెస్టెంట్స్‌ కుటుంబ సభ్యులను హౌస్‌కు రప్పించి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. శివాజీ, అంబటి అర్జున్, అశ్వినికి ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు ఇంట్లోకి ప్రవేశించారు. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు రిలీజ్ కాగా.. సేమ్ సీన్ రిపీట్ అయింది. 

(ఇది చదవండి: మరోసారి తెరపైకి స్టార్ కపుల్ విడాకుల రూమర్స్.. అసలేం జరుగుతోంది!)

రెండో రోజు కూడా హౌస్‌ను ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశారు. తాజాగా రిలీజైన ప్రోమోలో ప్రియాంక జైన్‌ ప్రియుడిని హౌస్‌లో తీసుకొచ్చారు బిగ్ బాస్. హౌస్‌లో అడుగుపెట్టిన మౌనరాగం సీరియల్ ఫేమ్ శివకుమార్ తన ప్రియురాలికి గులాబీ పువ్వుతో మరోసారి ప్రపోజ్ చేశారు.  దీంతో చాలా రోజుల తర్వాత ప్రియుడిని చూసిన ప్రియాంక తన ప్రేమతో అతన్ని కౌగిలించుకుంది. ఆ తర్వాత ఎలా ఉన్నావ్ అంటూ.. తన ప్రియుడిని అడిగింది. నేను ఇలా ఉన్నా అనడంతో.. ఒకరినొకరు చాలా మిస్సవుతున్నామంటూ ఎమోషనలయ్యారు.

శివతో మాట్లాడుతూ..'మరీ పెళ్లెప్పుడు అని ప్రియాంక ప్రేమగా అడగడంతో.. నువ్వు బయటకొచ్చిన వెంటనే చేసుకుందాం అన్నాడు. కాదు.. ఇప్పుడే చేసుకుందాం ప్రియాంక అంటూ శివను గట్టిగా మరోసారి కౌగిలించుకుంది.  ఆ తర్వాత ఈ జంట దగ్గరకు వచ్చిన శోభా శెట్టి బిగ్‌ బాస్ ఇచ్చిన సమయం ‍అయిపోయిందని చెబుతుంది. ఇక్కడే ఉండిపోవచ్చా అని బిగ్ బాస్‌ను శోభ అడుగుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి శివకుమార్‌కు గుడ్‌ బై చెప్పడంతో ప్రోమో ముగిసింది. 

కాగా.. జానకి కలగనలేదు సీరియల్ నటి ప్రియాంక జైన్.. బుల్లితెర నటుడు శివ కుమార్‌లు చాలా ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. జానకి కలగనలేదు సీరియల్లో నటించిన ప్రియాంక జైన్.. నటుడు శివ కుమార్‌లు చాలా ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. మౌనరాగం సీరియల్‌లో వీళ్లిద్దరూ కలిసి నటించారు. అమ్ములుగా ప్రియాంక జైన్.. అంకిత్‌గా శివ కుమార్‌లు పాత్రలు పోషించారు. కెమెరా ముందే నటనతో జీవించిన వీళ్లు.. కెమెరా వెనుక కూడా రొమాంటిక్ జోడీగా మారారు.

(ఇది చదవండి: 'ఆయన లేకుండా తొలిసారి ఇలా'.. మంజుల ఎమోషనల్ పోస్ట్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement