
పేదింట పుట్టిన ప్రియాంక జైన్ స్వయంకృషితో పైకి ఎదిగిన అమ్మాయి. బెంగళూరులో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈ బ్యూటీ మొదట సినిమాలు చేసింది. 2015లో తమిళంలో రంగి తరంగ చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ మరుసటి ఏడాది గోలిసోడా మూవీతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది. 2018లో చల్తే చల్తే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కానీ సినిమాలు తనకు పెద్దగా వర్కవుట్ కాలేదు.
దీంతో బుల్లితెరపై తన లక్ పరీక్షించుకుంది. తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ సీరియల్ స్టార్‌గా వెలుగు వెలుగుతోంది. మౌనరాగంలో తనతో పాటు నటించిన శివకుమార్‌తో ప్రేమలో ఉందీ బ్యూటీ. ఇటీవలే ఆమె నటించిన 'జానకి కలగనలేదు' సీరియల్‌కు శుభం కార్డు పడటంతో బిగ్‌బాస్ 7లో అడుగుపెట్టింది. ఎప్పుడూ చలాకీగా కనిపించే ప్రియాంక ఇక్కడ కూడా తన చరిష్మా చూపిస్తుందా? లేదంటే వెనకబడిపోతుందా? అనేది చూడాలి..