ముష్టి బ్యాచ్‌.. ముష్టినాయాళ్లు.. వంకరబుద్ధి పోనిచ్చుకోని శివాజీ | Bigg Boss 7 Telugu: Sivaji Worst Comments on SPA Batch | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: అమర్‌ను మళ్లీ టార్గెట్‌ చేసిన శివాజీ.. వెధవ.. ఏం రోగమంటూ..

Published Fri, Dec 15 2023 9:04 AM | Last Updated on Fri, Dec 15 2023 9:38 AM

Bigg Boss 7 Telugu: Sivaji Worst Comments on SPA Batch - Sakshi

బిగ్‌బాస్‌ 7 ఫినాలే దగ్గరపడుతోంది. ఇప్పుడు కూడా హౌస్‌మేట్స్‌.. వారిలో వారే కొట్టుకోకుండా కాస్త కలిసిమెలిసి ఉండేందుకు సరదా టాస్కులిచ్చాడు బిగ్‌బాస్‌. ఒకరి కోసం మరొకరు ఆడాలంటూ వారి మధ్య బంధాన్ని బలపర్చేందుకు ప్రయత్నించాడు. మరి ఎవరు ఎవరికోసం ఆడారు? ఏలియన్స్‌ ఇంట్లో ఎందుకు దూరాయి? ఈ విషయాలన్నీ తాజా ఎపిసోడ్‌ (డిసెంబర్‌ 14) హైలైట్స్‌లో చూసేద్దాం..

మీ ఇంటి వంట..
ఈ వారం నామినేషన్ల గోల లేదు, పెద్దగా టాస్కులు కూడా లేకపోవడంతో హౌస్‌మేట్స్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. బద్ధకస్తులుగా మారిపోయిన కంటెస్టెంట్లను హుషారెత్తించేందుకు బిగ్‌బాస్‌ మరోసారి హాచీ ఏలియన్స్‌ను రంగంలోకి దింపాడు. ఈ హాచీ.. కంటెస్టెంట్ల కోసం ఇంటి నుంచి ఫుడ్‌ వచ్చిందని, తమను సంతోషపరిస్తేనే ఆ ఆహారం ఇస్తామని చెప్పింది. అయితే మీ ఫుడ్‌ కోసం తోటి ఇంటిసభ్యులు ఆ ఆహారాన్ని సంపాదించాల్సి ఉంటుందని మెలిక పెట్టింది. 

శివాజీ కోసం ఆడి గెలిచిన ప్రియాంక
మొదటగా అర్జున్‌ ఇంటి నుంచి రాగిముద్ద-మటన్‌ కూర వచ్చింది. ఈ ఫుడ్‌ కోసం యావర్‌ షేక్‌ బాల్‌ షేక్‌ గేమ్‌ ఆడి గెలిచాడు. తనకోసం ఆడి గెలిచిన యావర్‌కు తన చేతితో ఇంటి ఫుడ్‌ను తినిపించాడు అర్జున్‌. శివాజీ కోసం ఇంటి నుంచి చికెన్‌ కర్రీ వచ్చింది. దీనికోసం ప్రియాంక బ్యాలెన్స్‌ ది బాల్స్‌ గేమ్‌ ఆడి గెలిచి చికెన్‌ కూర శివాజీకి దక్కేలా చేసింది. ఆ తర్వాత అమర్‌దీప్‌కు రొయ్యల బిర్యానీ వచ్చింది. దీని కోసం శివాజీ బెలూన్ల టాస్క్‌ ఆడి గెలవడంతో అమర్‌ రొయ్యల బిర్యానీని ఇతరులతో షేర్‌ చేసుకుంటూ కడుపునిండా ఆరగించాడు.

గంట ఎపిసోడ్‌లో ఎవరెంత కనిపిస్తారు?
తర్వాత కొందరు గ్రహాంతరవాసుల్లాగా మాస్కులు పెట్టుకుని ఇంట్లోకి వచ్చి అందరినీ ఓ ఆటాడుకుని వెళ్లిపోయారు. అనంతరం బిగ్‌బాస్‌.. మీ 14 వారాల జర్నీలో మీ ఓవరాల్‌ పర్ఫామెన్స్‌ ఆధారంగా 60 నిమిషాల ఎపిసోడ్‌లో మీరు ఎంతసేపు కనిపించడానికి అర్హులో చెప్పాలంటూ కొన్ని బోర్డులు ఇచ్చాడు. ముందుగా అర్జున్‌.. 10 నిమిషాల బోర్డు తన మెడలో వేసుకున్నాడు. ఫౌల్స్‌ ఆడుతూ, దొంగతనాలు చేస్తూ, తిట్లు తింటూ అమర్‌ 20 నిమిషాలు కనబడతాడని అనుకుంటున్నట్లు చెప్పాడు. శివాజీకి 15, ప్రియాంకకు 7, ప్రిన్స్‌ యావర్‌కు 5, ప్రశాంత్‌కు 3 నిమిషాల బోర్డులు ఇచ్చాడు. 

అమర్‌ను చులకనగా చూస్తున్న శివాజీ
శివాజీ.. ఎవరికీ తక్కువ నిమిషాల బోర్డు ఇవ్వబుద్ధి కావట్లేదంటూనే అమర్‌ మెడలో 3 నిమిషాల బోర్డు వేసి క్లాస్‌ పీకాడు. నువ్వు ఈ 2 వారాలే ఆడావు.. అంతకుముందు ఏమీ ఆడలేదంటూ మరోసారి తనను టార్గెట్‌ చేశాడు. కొన్నిసార్లు నువ్వు నెగెటివ్‌ కంటెంట్‌ కోసం ప్రయత్నించావు, అసలు గేమ్‌ ఆడలేదు అని అన్నాడు. 3 నిమిషాలు యాక్సెప్ట్‌ చేయలేకపోతున్నా, నేను గేమ్‌ ఆడానన్నా.. అని అమర్‌ డిఫెండ్‌ చేసుకుంటుంటే.. నేను 5 వేసుకున్నప్పుడు నీకు 3 నిమిషాలు వేస్తే రోగమా? అని తిట్టాడు శివాజీ. అంతేకాదు.. అర్జున్‌కు 7 ఇచ్చి అమర్‌ కంటే నువ్వు అ‍ద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వగలవన్నాడు.

ముష్టి బ్యాచ్‌
ప్రియాంకకు 10 ఇచ్చి మిగిలిన 15, 20 నిమిషాల బోర్డులు ప్రిన్స్‌, ప్రశాంత్‌ చేతిలో పెట్టి ఇద్దరూ తమకు నచ్చినవి వేసుకోమని ఆఫర్‌ ఇచ్చాడు. తర్వాత అందరూ ఈ బోర్డుల ప్రక్రియను ఒకరి తర్వాత ఒకరు పూర్తి చేశారు. కాగా ఫినాలే దగ్గరపడుతున్నప్పటికీ టైం దొరికినప్పుడల్లా అమర్‌ మీద విషం కక్కుతూనే ఉన్నాడు శివాజీ. వేస్ట్‌ ఫెలో, దొంగ, వెధవ, పనికిమాలినోడు, పిచ్చి పోహా.. ఇలా ఎన్నో మాటలన్నాడు. తాజా ఎపిసోడ్‌లోనూ స్పా(శోభ, ప్రియాంక, అమర్‌) బ్యాచ్‌ను ఉద్దేశిస్తూ ముష్టి బ్యాచ్‌.. ముష్టినాయాళ్లు.. అంటూ తన స్పై బ్యాచ్‌ దగ్గర చులకనగా మాట్లాడాడు. వాళ్ల ముందేమో పద్ధతిగా, పెద్దాయనలా ప్రవర్తిస్తూ పక్కకు రాగానే ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ మరోసారి తన వంకరబుద్ధి బయటపెట్టుకున్నాడు శివాజీ.

చదవండి: నటుడు కన్నుమూత.. గురువు మరణం కలిచివేసిందంటూ భారతీరాజా పోస్ట్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement