బిగ్‌బాస్ షో నుంచి మరొకరిని బయటకు పంపించేందుకు అవసరమైన నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అయితే ఈసారి దీన్ని వినూత్నంగా ప్లాన్ చేశాడు బిగ్‌బాస్. ఇంట్లోని ఆడవాళ్లను రాజమాతలుగా ప్రకటించాడు. మిగతా ఇంటిసభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పి అందుకు తగ్గ కారణాలు చెప్పాల్సి ఉంటుంది. రాజమాతలకు ఆ కారణం సరైనది అనిపిస్తేనే నామినేషన్ జరుగుతుంది.
అమర్‌ను వెనకేసుకొచ్చిన ప్రియాంక
ముందుగా గౌతమ్ మాట్లాడుతూ.. నా క్యారెక్టర్, డాక్టర్ వృత్తి గురించి శివాజీ అలా మాట్లాడటం నచ్చలేదంటూ సోఫాజీని నామినేట్ చేశాడు. తర్వాత భోలె షావళి.. నీకు నవ్వు వీక్ అయి బయటకు వచ్చావని అన్నావంటూ అమర్‌ను నామినేట్ చేశాడు. ఇంతలో రాజమాత ప్రియాంక మధ్యలో కలగజేసుకుంటూ అమర్.. నిన్ను వీక్ అనలేదని వెనకేసుకొచ్చింది. నువ్వు విషయాన్ని కప్పిపుచ్చుతున్నావ్.. మధ్యలో ఎందుకొస్తున్నావు? ఒర్రొద్దు అని అడిగాడు.
నువ్వు చాలా గ్రేటు.. ఇక్కడ కూర్చున్నవాళ్లందరం వేస్ట్.
వదిలెయ్ ప్రియాంక అంటూ ఆమెను కూల్ చేసేందుకు అశ్విని ప్రయత్నించగా నేను అతడితో మాట్లాడుతున్నాను అంటూ రెచ్చిపోయింది ప్రియాంక. ప్రతిసారి నా నోరెత్తితే చాలు ప్రాబ్లమైపోతుంది ఇక్కడ.. ఇప్పుడేంటి నువ్వు చాలా గ్రేటు.. ఇక్కడ కూర్చున్నవాళ్లందరం వేస్ట్.. కనీసం నా పెదవి కూడా విప్పనివ్వడం లేదు. ఇంకేం చేయాలి? అని ఏడుస్తూ ప్రియాంక, శోభల కాళ్లు మొక్కింది.
నామినేషన్స్‌లో రతిక
ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ ప్రియాంక, శోభ హెచ్చరించినా అశ్విని ఆవేశం, బాధ చల్లారలేదు.. కాగా రాజమాతలుగా లేడీ కంటెస్టెంట్లను పెట్టింది వారిని నామినేషన్స్ నుంచి కాపాడటానికే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ చివర్లో ఏదో ట్విస్ట్ ఉండేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఈవారం నామినేషన్స్ లిస్టులో రతిక పేరు కూడా ఉందట! రతికతో పాటు ప్రిన్స్ యావర్, శివాజీ, గౌతమ్, భోలె షావళి నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం.
చదవండి: అడ్డంగా దొరికిపోయిన తేజ.. ఆన్సర్ చెప్పమంటే నీళ్లు నములుతున్నాడే
Comments
Please login to add a commentAdd a comment