బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్‌లో జరిగిన రభస మామూలుగా లేదు. ఒక్కొక్కరు వీర లెవల్లో పోరాడారు. చివర్లో అమర్, ప్రియాంక ఇద్దరూ మిగలగా అంతిమంగా ప్రియాంక కెప్టెన్సీ సాధించింది. అందుకు గౌతమ్ కృష్ణ ఎంతగానో సాయపడ్డాడు. గేమ్‌లో కూడా అందరిముందే ప్రియాంకకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి మరీ ఆడాడు. కానీ అమర్.. తనను అందరూ టార్గెట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఎమోషనల్ అయిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ప్రవర్తన కొంతమందికి చికాకు తెప్పించగా ఎక్కువమందికి బాధ కలిగించింది.
చేసిన సాయం అప్పుడే మర్చిపోయిన రతిక
అయితే అమర్ బాధకు ప్రధాన కారణం గౌతమ్ కాదు రతిక. గతవారం జరిగిన బేబీ టాస్క్‌లో అమర్‌ను తనకోసం ఆగిపోమని వేడుకుంది. ఈ వారం తనకు చాలా అవసరమంటూ, తనను నిరూపించుకునే అవకాశం ఇవ్వమని బతిమాలుకుంది. దీంతో ఆమె కోసం వెనకడుగు వేశాడు. ఆమెను గెలిపించి తాను ఓడిపోయాడు. అందుకు కనీసం కృతజ్ఞత చూపించకుండా రతిక నిన్నటి బ్రిస్క్ టాస్కులో అమర్‌ను టార్గెట్ చేసింది. అతడిని ఓడించేందుకు విశ్వ ప్రయత్నం చేసింది.
ప్రియాంక కోసం ఆడటం తప్పా?
అటు గౌతమ్ కూడా అమర్ అమర్చిన బ్రిస్క్ మీదకు బాల్స్ విసిరాడు. అందుకు కారణం.. అతడి మీద ఏదో పగ, ప్రతీకారాలు ఉన్నాయని కాదు. తన చెల్లిగా భావించిన ప్రియాంక గెలవాలని తాపత్రయపడ్డాడు. ఆమె కెప్టెన్ అవడం కోసం అమర్‌ను ఆటలో నుంచి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అందరి ముందే ప్రియాంకకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి మరీ గేమ్ ఆడాడు! కానీ చాలామంది దీన్ని తప్పుపడుతున్నారు. అమర్ అంత ఏడుస్తుంటే జాలి చూపించట్లేదు అని ఫీలవుతున్నారు. అతడు బాధపడుతున్నాడని అప్పటికప్పుడు ప్రియాంకను ఓడించాలని ఎందుకనుకుంటాడు? తన చెల్లిని గెలిపించాలనుకున్నాడు, అదే చేశాడు.
శోభ కోసం అమర్.. ప్రియాంక కోసం గౌతమ్
నిజానికి గతంలో కెప్టెన్సీ టాస్క్‌లో శోభా కోసం అమర్ వీరోచిత పోరాటం చేసి ఆమెను గెలిపించాడు. అప్పుడు అమర్‌ను ఆకాశానికెత్తేశారు. ఇప్పుడు ప్రియాంక కోసం పోరాడిన గౌతమ్‌ను మాత్రం నిందిస్తున్నారు. ఒకానొక సమయంలో డాక్టర్ బాబు ఎలిమినేట్ అవ్వాలని అతడికి వ్యతిరేకంగా ఓట్ వేశాడు అమర్. అలాంటప్పుడు గౌతమ్.. అమర్‌కు సపోర్ట్ చేయకపోవడంలో తప్పేముంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
చదవండి: అల్లాడిపోతున్నాడంటూ అతడికి స్టేజీపై ముద్దు పెట్టిన స్టార్ హీరో, వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment