అమర్‌ను ఛాలెంజ్‌ చేసిన గౌతమ్‌.. అర్జున్‌కు అన్యాయం! | Bigg Boss Telugu 7: Yawar Give His Points to Pallavi Prashant | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: ఫినాలే అస్త్ర రేసు నుంచి రైతుబిడ్డ అవుట్‌.. ఆ ఇద్దరి మధ్యే అసలైన పోటీ!

Published Fri, Dec 1 2023 9:48 AM | Last Updated on Fri, Dec 1 2023 10:38 AM

Bigg Boss Telugu 7: Yawar Give His Points to Pallavi Prashant - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో టికెట్‌ టు ఫినాలే కోసం పోటీ జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఆటలో వెనకబడి రేసులో నుంచి పక్కకు తప్పుకోగా ఐదుగురు ఫినాలే అస్త్ర కోసం పోటీపడుతున్నారు. మరి వీరిలో ఎవరు ఆ అస్త్రాన్ని గెలుచుకోవడానికి దగ్గర్లో ఉన్నారు? ఎవరు రేసులో వెనకబడ్డారు? అనేది తాజా ఎపిసోడ్‌ (నవంబర్‌ 30) హైలైట్స్‌లో చదివేద్దాం...

క్రికెట్‌ టాస్క్‌.. సిక్సులు బాదిన అమర్‌
తక్కువ పాయింట్లు ఉన్న ప్రియాంక, శివాజీ, శోభ ఫినాలే అస్త్ర రేసు నుంచి తప్పుకున్నారు. అయితే ప్రియాంక తన పాయింట్లను గౌతమ్‌కు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయాడు అమర్‌దీప్‌. కనీసం ఫ్రెండ్‌ అని కూడా చూడలేదు, ఎందుకు తప్పు నిర్ణయం తీసుకున్నావంటూ బాధపడ్డాడు. ఇంతలో మిగతా ఐదుగురు ఇంటిసభ్యులకు వెరైటీ క్రికెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో అమర్‌ గెలిచాడు. తప్పించుకో రాజా టాస్క్‌లో రైతుబిడ్డ గెలిచాడు.

తప్పు చేసిన యావర్‌.. నోరు విప్పని శివాజీ
అయితే ఈ టాస్కులో ఎవరి కాలికి ఉన్న తాళాలకు వారు కీ వెతికి విడిపించుకోవాలి. యావర్‌ ఒక కీ తీసుకుని అది రాకపోవడంతో కింద పడేశాడు. దీంతో అర్జున్‌కు బాక్స్‌లో ఎంత వెతికినా సరైన కీ దొరకలేదు. కీ కింద పడేయకూడదు కదా.. సంచాలకులు చెప్పాలి కదా అని గరమయ్యాడు. యావరే కీ కింద పడేశాడని తెలిసినా శివాజీ పెదవి విప్పలేదు.  ఇక పాయింట్ల పట్టికలో యావర్‌ దిగువన ఉండటంతో రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన పాయింట్లను పల్లవి ప్రశాంత్‌కు ఇచ్చాడు. 

అమర్‌ విజయంపై డౌట్‌
తర్వాత పట్టుకో తెలుసుకో టాస్క్‌ జరగ్గా ఇందులో అమర్‌దీప్‌ గెలిచాడు. కానీ కళ్లు కనిపించకుండా ఇచ్చిన మాస్క్‌లు సరిగా పనిచేస్తున్నాయో, లేదోనని యావర్‌ చెక్‌ చేయడంతో అమర్‌ అసహనానికి లోనయ్యాడు. నేను గెలిచినప్పుడే అందరికీ అనుమానాలు వస్తాయని ఆవేశపడ్డాడు. తర్వాత బ్యాలెన్స్‌ ది బాల్‌ టాస్కు జరిగింది. బ్యాలెన్స్‌ టాస్కులకు పెట్టింది పేరైన ప్రశాంత్‌ ఈ గేమ్‌లో గెలిచాడు. ఇక ఈ టాస్కు ప్రారంభంలో నిన్ను ఓడిస్తా చూడు అని అమర్‌కు ఛాలెంజ్‌ చేశాడు గౌతమ్‌. అన్నట్లుగానే అమర్‌ ఓడిపోయిన తర్వాత గౌతమ్‌ ఆటలో నుంచి పక్కకు వెళ్లిపోయాడు. గౌతమ్‌ తనతో ఛాలెంజ్‌ చేసిన విషయాన్ని శోభాతో చెప్పాడు అమర్‌. దీంతో శోభ.. అతడు ఈ టికెట్‌ టు ఫినాలే రేసులో ఒక్క టాస్క్‌ కూడా గెలవలేదంటూ డాక్టర్‌ బాబును హేళన చేసి మాట్లాడింది.

ఒక్క టాస్క్‌ కూడా గెలవని గౌతమ్‌
మొత్తానికి పాయింట్ల పట్టికను చూస్తుంటే అమర్‌- పల్లవి ప్రశాంత్‌ మధ్య గట్టి పోటీ ఉండేట్లు కనిపిస్తోంది. పాపం.. అర్జున్‌ గట్టిగా ప్రయత్నిస్తున్నా తనకెవరూ పాయింట్లు దానం చేయకపోవడంతో స్కోర్‌ బోర్డులో వెనుకబడ్డాడు. ఇక ప్రియాంక.. గౌతమ్‌ను తన పాయింట్లు అమర్‌కే ఇవ్వాలని మాట తీసుకుంది. దీంతో అతడు అమర్‌కు దానం చేయడం గ్యారెంటీ! సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రైతుబిడ్డ రేసు నుంచి తప్పుకోగా అమర్‌ వర్సెస్‌ అర్జున్‌ మాత్రమే టికెట్‌ టు ఫినాలే కోసం పోటీపడనున్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి!

చదవండి: దిల్‌ రాజు ఇంట పెళ్లి సందడి.. 'రౌడీ బాయ్స్‌' హీరో ఎంగేజ్‌మెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement