హగ్గులు-కిస్సులతో ఊపిరాడనివ్వలేదు.. ఆ ఇద్దరి గురించి ప్రియాంకకు వార్నింగ్! | Bigg Boss 7 Telugu Day 66 Episode Highlights: Gautham Mother, Priyanka Boyfriend Shiv Kumar Into BB House - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu Nov 8th Highlights: ప్రియాంకకి పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన బాయ్‌ఫ్రెండ్!

Published Wed, Nov 8 2023 11:03 PM | Last Updated on Thu, Nov 9 2023 9:55 AM

Bigg Boss 7 Telugu Day 66 Episode Highlights - Sakshi

బిగ్‌బాస్ షో మిగతా రోజులు ఎలా ఉన్నాగానీ 'ఫ్యామిలీ వీక్' ఉన్నప్పుడు మాత్రం అందరినీ ఒక్కటి చేస్తుంది. ప్రస్తుతం ఏడో సీజన్‌లో అదే నడుస్తోంది. మంగళవారం ఎపిసోడ్‌లో అర్జున్ భార్య, శివాజీ కొడుకు, అశ్విని తల్లి వచ్చి ఎమోషనల్ చేశారు. ఇప్పుడు మరో ముగ్గురి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి నవ్వించారు, ఏడిపించారు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 66 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

అమ్మ ప్రేమలో గౌతమ్
అశ్విని తల్లి వచ్చి వెళ్లడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం నిద్రలేవడంతో బుధవారం ఎపిసోడ్ మొదలైంది. కాసేపటి తర్వాత గౌతమ్ తల్లి.. పంచెని హౌసులోకి పంపింది. కానీ గౌతమ్.. అది తన కోసమే అని గుర్తుపట్టలేకపోయాడు. కొంతసేపటి తర్వాత 'కన్నయ్యా' అనే పిలుపుతో అమ్మ ఎక్కడుందా అని హౌస్ అంతా తిరిగేశాడు. హౌసులోకి రాగానే ఆమెని పట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. అందరినీ పలకరించిన తర్వాత కొడుకుతో చాలా మాట్లాడింది.

(ఇదీ చదవండి: రష్మిక ఫేక్‌ వీడియో.. విజయ్ దేవరకొండ పోస్ట్ వైరల్!)

'సూపర్ ఆడుతున్నావ్.. కరెక్ట్ గానే ఆడుతున్నావ్.. కానీ అక్కడక్కడా ఆలోచిస్తున్నావ్.. మాటలు కొంచెం రాకుండా చూడు.. ఏదైనా పాయింట్ అనుకుంటే దాన్నే స్ట్రాంగ్‌గా పట్టుకో, వివరణ వద్దు.. ఎక్సప్లెనేషన్ వల్ల డీవియేషన్ వస్తుంది. ఏమైద్దో అని భయం వద్దు, అమ్మ ఎప్పుడు అండగా ఉంటుంది' అని గౌతమ్ కి అతడి తల్లి ధైర్యం నింపింది. అమ్మని అందరూ మిస్ అవుతున్నారు కదా అని హౌసులోని ప్రతిఒక్కరికీ గౌతమ్ తల్లి గోరుముద్దలు తినిపించింది. ఈ సీన్ చూడటానికి చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. ఆ తర్వాత.. 'అమ్మ.. అమ్మ..' అనే పాట ప్లే చేయగా.. గౌతమ్, తల్లితో కలిసి డ్యాన్స్ చేశాడు. అయితే ఈ పాట ప్లే అవుతున్నంతసేపు శోభా, యవర్.. తల్లి గుర్తొచ్చి ఎమోషనల్ అయ్యారు. ఈ పాట వల్లో, తల్లి అనే ఎమోషనల్ వల్లనో ఏమో గానీ చూస్తున్న మీరు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం గ్యారంటీ.

హగ్స్‌-ముద్దులతో ప్రియాంక
గౌతమ్ తల్లి వెళ్లిపోయిన తర్వాత కాసేపటికి ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ శివ కుమార్‌ వచ్చాడు. రోజా ఫ్లవర్ తీసుకొచ్చి, మోకాళ్లపై వంగి మరీ ప్రియాంకకు ప్రపోజ్ చేశాడు. హగ్గులు, నుదుటిపై ముద్దులతో రెచ్చిపోయాడు. దీంతో పక్కనే ఉన్న అర్జున్.. ఏమైనా అడ్డుపెట్టాలా? అని చిన్నగా సెటైర్ వేశాడు. కాకపోతే ఈ కామెంట్ ని పట్టించుకునేంత మూడ్‌లో ఈ ప్రేమజంట లేదు. ఇన్నాళ్ల విరహవేదన వల్లో ఏమో గానీ ఒకరికి ఒకరు అతుక్కుపోయారు. కాస్త గ్యాప్ ఇచ్చి హౌస్‌మేట్స్ అందరిని ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ తెగ పొగిడేశాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'టైగర్ నాగేశ్వరరావు'.. అనుకున్న టైమ్ కంటే ముందే?)

హౌసులో గొడవ జరిగితే అప్పుడు దాన్ని తెగే దాకా లాగడం నచ్చట్లేదని, ఆ విషయం కాస్త చూసుకోమని ప్రియాంకకు ఆమె బాయ్‌ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. ఫ్రెండ్స్, బెస్ట్‌ఫ్రెండ్స్ ఎవరు అవసరమే లేదు నీకు అని.. అమరదీప్, శోభా గురించే ఇన్ డైరెక్ట్‌గా చెప్పాడు. కిచెన్ లోనే ఉండిపోతున్నావ్, బయటకు రా అని కూడా చెప్పాడు. 'బయటకొచ్చాక నాతో గొడవ పడతావా?' అని ప్రియాంక గోముగా అడిగేసరికి.. బాయ్‌ఫ్రెండ్ ఐస్ అయిపోయాడు. నువ్వు ఏం చెబుతావో అదే వింటానని అనేశాడు. మరి పెళ్లెప్పుడు అని ప్రియాంక అతడిని అడగ్గా.. బయటకొచ్చాక చేసుకుందాం అన్నాడు. ఇప్పుడే చేసుకుందామని ప్రియాంక.. తన విరహావేదనని అంతా బయటపెట్టేసింది. వెళ్తూ వెళ్తూ కూడా కొంతమందితో మాత్రం చూసుకుని ఉండు అని.. శోభా, అమర్ గురించి ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ చెప్పాడు. ఆ తర్వాత భోలె భార్య కూడా వచ్చింది. కాకపోతే యోగ క్షేమాలు మాట్లాడి హౌస్ నుంచి బయటకెళ్లిపోయింది. 

ఇకపోతే ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ అంటే మాత్రం ప్రియాంక-ఆమె బాయ్‌ఫ్రెండ్‌దే. గౌతమ్ తల్లి ఎమోషన్‌తో అందరితో కన్నీళ్లు పెట్టిస్తే.. ప్రియాంక ప్రియుడు మాత్రం హౌస్ మొత్తాన్ని రొమాంటిక్‌గా మార్చేశాడు. ఇక ప్రియాంక-బాయ్‌ఫ్రెండ్ పెళ్లి డిస్కషన్ చూసిన తర్వాత.. హౌస్ నుంచి బయటకెళ్లగానే ప్రియాంక పెళ్లి చేసుకోవడం గ్యారంటీ అని క్లారిటీ వచ్చేసింది. అలా బుధవారం ఎపిసోడ్ పూర్తయింది. మరి గురువారం ఎపిసోడ్‌లో ఎలాంటి ఎమోషన్స్ బయటకొస్తాయో తెలియాలంటే వెయిట్ అండ్ సీ.

(ఇదీ చదవండి: భూటాన్‌లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement