బిగ్‌బాస్ హౌస్‌లో అందరూ ఇష్టపడేది ఇమ్యూనిటీ అయితే అందరూ భయపడేది ఎలిమినేషన్‌కు! ఇమ్యూనిటీ వస్తే నామినేషన్‌లోకే రారు, అప్పుడు ఎలిమినేషన్ అన్న ఆలోచన కూడా వారి మనసులోకి రాదు. ఇమ్యూనిటీ సులభంగా లభించేది కెప్టెన్‌కు.. అందుకే కెప్టెన్సీ కోసం ప్రతి ఒక్కరూ తెగ కష్టపడుతుంటారు.
ఈ సీజన్‌లో రైతుబిడ్డ తొలి కెప్టెన్‌గా అవతరించాడు. నువ్వెంత అన్నవాళ్లనే ఓడిస్తూ కెప్టెన్‌గా గెలిచి అందరిచేత చప్పట్లు కొట్టించుకున్నాడు. కానీ తర్వాతే సైలెంట్ అయిపోయాడు. కెప్టెన్‌గా ఎవరికీ పనులను అప్పజెప్పడమో, ఇల్లును చూసుకోవడమే, నాయకుడిగా వ్యవహరించడమో చేయడం లేదు. ఎవరు తప్పు చేసినా చూసీచూడనట్లు పోతున్నాడు. తన పనేదో తను చేసుకుపోతున్నాడు.
అయితే ఇదంతా గమనిస్తూ ఉన్న బిగ్‌బాస్ ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించాడు. అసలు కెప్టెన్సీకి అర్థమేంటో తెలుసా? అని హౌస్‌లో కొందరితో సమాధానాలు చెప్పించాడు. అనంతరం ప్రశాంత్ బ్యాడ్ కెప్టెన్ అనుకుంటున్నవాళ్లు చేతులెత్తమనగానే హౌస్‌లో దాదాపు అందరూ చేయెత్తారు. దీంతో బిగ్‌బాస్ ప్రశాంత్ కెప్టెన్సీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. కష్టపడి సాధించిన కెప్టెన్సీ ఇలా మూన్నాళ్ల ముచ్చటగానే మారడంతో కంటతడి పెట్టుకున్నాడు రైతుబిడ్డ.
చదవండి: బాల్యంలోనే రెండుసార్లు అత్యాచారం.. బిగ్‌బాస్ చరిత్రలోనే రికార్డ్ రెమ్యునరేషన్!
Comments
Please login to add a commentAdd a comment