![Pallavi Prashanth Father Entered In Bigg Boss Telugu 7 House - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/10/2_2.jpg.webp?itok=mzWgghb0)
ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న విషయం తెలిసిందే .. ఇప్పటికే హౌస్‌లోని కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఒక్కోక్కరిగా వస్తూ అందరితో కలిసి సంతోషంగా గడుపుతున్నారు. అలా ఈ వారం మొత్తం బిగ్ బాస్‌లో సందడి వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే దాదాపు అందరి కుటుంబ సభ్యులు వచ్చేశారు. పల్లవి ప్రశాంత్, రతిక కుటుంబ సభ్యులు మాత్రం ఈరోజు వచ్చే ఎపిసోడ్‌లో కనిపించనున్నారు. తాజాగా ప్రశాంత్ నాన్నగారు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది.
(ఇదీ చదవండి: సల్మాన్ 'టైగర్-3'ని ఢీ కొడుతున్న తెలుగు డైరెక్టర్)
ప్రశాంత్ నాన్నగారు బంతిపూలు తీసుకుని బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టారు. అతన్ని ముందుగా చూసిన శివాజీ ప్రశాంత్‌కు చెబుతాడు.. అప్పుడు ఒక్కసారిగా తన తండ్రి కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆపై వారిద్దరూ కౌగిలించుకుని ఎమోషనల్ అవుతాడు. ఆ సమయంలో వారి వద్దకు శివాజీ రాగానే పల్లవి ప్రశాంత్ తండ్రి ఇలా అంటాడు.. నా బిడ్డను ఒక తండ్రి లెక్క చూసుకున్నావ్ అంటూ శివాజీతో అంటాడు. అలా అందరితో ఆయన పలకరిస్తూ వారిలో సంతోషాన్ని నింపుతాడు.
ఈ సీజన్లో అందరికంటే చాలా డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాడు పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్ కోటాలో మొదటిసారిగా రైతుబిడ్డగా ప్రశాంత్ అడుగుపెట్టాడు. అయితే అతను బిగ్‌బాస్‌లోకి రాకముందే అన్న మల్లొచ్చినా అంటూ సోషల్ మీడియాలో వీడియోలతో తెగ పాపులర్ అయ్యాడు. అలా రైతుల బాధలను సాధరణ ప్రజలకు తెలుపుతూ నెట్టింట భారీగా క్రేజ్ సంపాందించాడు. పంటపొలంలో వ్యవసాయం చేస్తూ ఆయన తండ్రితో కూడా పలు వీడియోలు షేర్ చేశాడు. పట్టుబట్టి మరీ బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టాలని కోరికతో సీజన్ 7లోకి అడుగుపెట్టాడు ప్రశాంత్.
Comments
Please login to add a commentAdd a comment