ఎలిమినేషన్‌కు పునాదులు పడేది నామినేషన్‌లోనే! కేవలం నామినేట్ అయితేనే ఎలిమినేట్ అయిపోరు.. ఇక్కడ ఎవరు ఏ కారణాలు చెప్తున్నారు? ఎవరి తప్పొప్పులు బయటపడుతున్నాయి? ఇలా అన్నింటినీ గమనిస్తారు ప్రేక్షకులు. ఎవరైతే కరెక్ట్ అనిపిస్తారో వారికి సపోర్ట్‌గా ఉంటారు. ఫలానా వాళ్లు తప్పనిపిస్తే వారికి ఓట్లేయడం మానేసి బయటకు పంపించేస్తారు. మరి ఈ పదమూడోవారం నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో చూసేద్దాం...
అబద్ధాలు ఆడుతున్నానా?
ఈ వారం నామినేషన్ ప్రక్రియ రైతుబిడ్డతో మొదలైంది. సీక్రెట్ టాస్క్‌లో కూడా నీ ఫ్రెండ్ శోభాను కాపాడాలనుకున్నావ్, అది నచ్చలేదంటూ ప్రియాంకను, వీఐపీ రూమ్‌లోని దుప్పటి దాచుకుని వాడుతున్నావంటూ శోభాను నామినేట్ చేశాడు ప్రశాంత్. గౌతమ్.. ప్రియాంక, శివాజీకి రంగు పూశాడు. తర్వాత ప్రియాంక మాట్లాడుతూ.. నాగార్జున సార్ ముందు నేను అబద్ధాలే ఆడతానని నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు... అది నేను తీసుకోలేకపోతున్నాను అంటూ శివాజీకి రంగు పూసింది. తర్వాత ప్రశాంత్‌ను నామినేట్ చేసింది.
పెద్ద తప్పు చేసిన అర్జున్
ఒక్కోసారి చిన్న తప్పులే మన మెడకు చుట్టుకుంటాయి. అలా గతవారం సెల్ఫ్ నామినేట్ చేసుకుని ఏకంగా ఎలిమినేట్ అయిపోయింది అశ్విని. ఇక ఎప్పుడూ తెలివిగా నామినేషన్స్ వేసిన అర్జున్ అంబటి ఈవారం సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. కెప్టెన్సీ కోసం తనకు మద్దతుగా నిలబడ్డ శివాజీని నామినేట్ చేశాడు. నిజానికి శివాజీ.. అర్జున్‌ను అడ్డుపెట్టుకుని అమర్ మీద కసి తీర్చుకున్నాడు. అతడిని కెప్టెన్ కానీయకుండా చేశాడు. ఈ విషయాన్ని హౌస్‌లో గౌతమ్ తప్ప ఎవరూ పసిగట్టలేకపోయారు. అర్జున్ అప్పుడే ఓ మెట్టు దిగి అమర్‌ను కెప్టెన్ చేయండి అని చెప్పుంటే హీరో అయ్యేవాడు.
అర్జున్‌కు దెబ్బ పడింది
అప్పుడు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు శివాజీని నామినేట్ చేయడం వల్ల అందరి దృష్టిలో విలన్ అయిపోయాడు. ఫినాలే దగ్గరకు వస్తున్నా సొంతంగా ఆడకపోవడం కరెక్ట్ కాదంటూ ప్రియాంకను నామినేట్ చేశాడు. తర్వాత శివాజీ వంతురాగా.. అర్జున్ ఇచ్చిన ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ తీసేశాడు. నువ్వు గేమ్ ఆడుతున్నావని తెలిసాక కూడా ఇది ఉంచుకోవడం కరెక్ట్ కాదన్నాడు. నీకు కెప్టెన్ కావాలని ఇంట్రస్ట్ లేకపోతే మొదట్లోనే చెప్పేస్తే సరిపోయేది.. ఇప్పుడు నేను పిచ్చోడిని అయిపోయాను అంటూ అర్జున్‌ను నామినేట్ చేశాడు. తర్వాత తనను నామినేట్ చేసిన గౌతమ్‌కు రివేంజ్ నామినేషన్ వేశాడు.
తప్పు చేసిన అమర్, ఏడ్చేసిన ప్రశాంత్
అనంతరం అమర్‌దీప్ చౌదరి కూడా ఓ పెద్ద తప్పు చేశాడు. కెప్టెన్సీ టాస్కులో తనకు సపోర్ట్ చేసిన ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు. బీబీ మ్యాన్షన్ గేమ్‌లో నువ్వు అంత త్వరగా చనిపోవడం నచ్చలేదు. నీతో గేమ్ ఆడటం మిస్ అయ్యానంటూ సిల్లీ రీజన్ చెప్పాడు. ఇది విని షాకైన ప్రశాంత్.. నిన్ను నమ్మినందుకు బాధపడుతున్నా అని ఏడ్చేశాడు. నమ్మకద్రోహం అని మాట్లాడకు.. నీకు వేయను పో అని అమర్ అన్నప్పటికీ ప్రశాంత్ అక్కడినుంచి కదలకపోవడంతో రైతుబిడ్డకు రంగు పూశాడు అమర్. అలాగే తనకు కెప్టెన్సీ కోసం సాయపడలేదని గౌతమ్‌ను నామినేట్ చేశాడు. తర్వాత యావర్.. గౌతమ్, ప్రియాంకను నామినేట్ చేశాడు. చివరిగా శోభా.. ప్రశాంత్, యావర్‌లను నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారం అమర్‌దీప్ మినహా మిగతా అందరూ నామినేట్ అయ్యారు.
చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు చిత్రం.. నిర్మాతకు కాస్ట్‌లీ కారు గిఫ్ట్
Comments
Please login to add a commentAdd a comment