గత కొన్నిరోజుల నుంచి జరుగుతున్న 'టికెట్ టూ ఫినాలే' రేసు పూర్తయింది. ఎవరూ ఊహించని విధంగా అర్జున్.. చివరి వరకు పోరాడి తొలి ఫైనలిస్ట్ అయ్యాడు. మరోవైపు రైతుబిడ్డ ప్రశాంత్.. ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని తన ప్రేమకథని బయటపెట్టాడు. అయితే ఇది బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 89 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
గౌతమ్ రేసు నుంచి ఔట్
నాలుగు స్థానాల్లో వరసగా అమర్, అర్జున్, ప్రశాంత్, గౌతమ్ ఉన్నారు. అలా గురువారం ఎపిసోడ్ ముగిసింది. తక్కువ పాయింట్స్ ఉన్న కారణంగా గౌతమ్.. రేసు నుంచి తప్పుకొన్నాడని బిగ్‌బాస్ చెప్పడంతో శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. తన దగ్గరున్న వాటిలో 20 శాతం అంటే 140 పాయింట్లు.. రేసులో ఉన్న ముగ్గురిలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పగా.. అమర్ పేరు చెప్పాడు. అయితే ఇవి ప్రియాంక పాయింట్స్ అని, ఆమెని మరోమాట అనొద్దని గౌతమ్, అమర్‌తో చెప్పాడు.
(ఇదీ చదవండి: Salaar Part 1: Ceasefire Trailer: రిలీజైన 'సలార్' ట్రైలర్.. స్టోరీ హింట్ ఇచ్చేశారుగా!)
బెడ్రూంలో శోభా డిస్కషన్
అయితే పాయింట్స్ ఇస్తూ.. ప్రియాంకని ఏమొనద్దని అమర్‌కి చెప్పడం ఏం బాగోలేదని శోభా అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని రాత్రి నిద్రపోయే టైంలో తన ఫ్రెండ్స్ అయిన ప్రియాంక-అమర్‌తో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. అలానే ఇవ్వాలనుకుంటే నువ్వే(ప్రియాంక) నేరుగా ఇవ్వొచ్చు కదా, గౌతమ్‌ని బతిమలాడి అడగడం ఎందుకు? అని శోభా.. తన ఫ్రెండ్ ప్రియాంకతో చెప్పుకొచ్చింది.
శోభాకి పనిష్మెంట్
10వ గేమ్‌గా 'కలర్ బాల్స్' అన్ని ఒకే వరసలో సెట్ చేయాలని టాస్క్ ఇచ్చారు. ఇందులో అర్జున్ విజయం సాధించాడు. ఆ తర్వాత ప్రశాంత్, అమర్ నిలిచారు. అయితే ఈ పోటీ పూర్తయిన తర్వాత శోభా.. బంతుల్ని టచ్ చేసిందని చెబుతూ ఆమెకి పనిష్మెంట్ ఇస్తున్నట్లు బిగ్‌బాస్ కాస్త భయపెట్టాడు. కానీ పనిష్మెంట్‌గా అందరూ గంట నిద్రపోవాలని అన్నాడు. అందరూ పడుకుని లేచేసరికి బయట గార్డెన్ ఏరియాలో టీ-స్నాక్స్ సదుపాయం ఏర్పాటు చేశాడు. ఇవి తింటూ అందరూ తమతమ లవ్ స్టోరీలు చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించాడు.
(ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అందులోనే)
ప్రశాంత్ భగ్న ప్రేమకథ
ఈ టాస్కులో భాగంగా శివాజీ, శోభా.. తమ ప్రేమకథల్ని చెప్పుకొచ్చారు. గౌతమ్ మాత్రం తన సినిమా పిచ్చి వల్ల.. దాదాపు పెళ్లి వరకు ఓ వచ్చిన స్టోరీ బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇక ప్రశాంత్‌ని ప్రేమకథ చెప్పాలని బిగ్‌బాస్ చెప్పమన్నాడు. దీంతో మనోడు అప్పట్లో జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. ఓ రోజు పొలంకి వెళ్తుంటే.. దారిలో ఓ అమ్మాయి హాయ్ చెప్పింది. కొన్నాళ్లుకు మెసేజ్ చేసింది. అలా కాస్త పరిచయమైన తర్వాత ఆమెకి ఫ్రెండ్ అని ఒకడు వచ్చాడు. దీంతో నాకు మెసేజులు చేయడం తగ్గించేసింది. వాడు ఒక్క మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇచ్చేసేది. చాలా రోజుల తర్వాత ఓ రోజు ఫోన్ చేసి.. పొలం పని వదిలేస్తేనే నీ వెంట వస్తా అని సీరియస్‌గా చెప్పింది. నాకు తెలిసింది పొలం పనే, దీన్ని విడిచిపెట్టి రానని చెప్పేశా, అలా ప్రేమకథ బ్రేకప్ అయిపోయిందని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.
అర్జున్ మైండ్ గేమ్.. తొలి ఫైనలిస్ట్
'టికెట్ టూ ఫినాలే' పోటీలో భాగంగా 'పట్టు వదలకురా డింభకా' అని పెట్టిన 11వ గేమ్ పెట్టారు. ఇందులో లోపలి నుంచి ఎవరికి వాళ్లు తాడుని డిఫెండ్ చేస్తూనే, కింద పడున్న జెండాలని తీసి, బుట్టలో వేయాలని చెప్పగా అర్జున్.. వేగంగా పదివరకు జెండాలని తన బుట్టలో వేశాడు. తర్వాత అమర్-ప్రశాంత్.. కనీసం అక్కడి నుంచి కదలకుండా చేశాడు. అలా చాలాసేపు ఉంచేశాడు. దీంతో బజర్ మోగింది. ఇక ముగ్గురిలో చివరి స్థానంలో నిలిచిన ప్రశాంత్ ఎలిమినేట్ అయిపోయాడు. కాసేపు బాధపడ్డాడు. 'పాముతో చెలగాటం' అని ఫైనల్ పోటీ పెట్టగా.. ఇందులో అర్జున్ విజయం సాధించాడు. ఏడో సీజన్ తొలి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: Dhootha Web Series Review: నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment