
ఉల్టా- పుల్టా అంటూ మొదలైన బిగ్‌బాస్ సీజన్-7కు ఆదివారం ఎండ్‌కార్డ్ పడింది. అందరూ అనుకున్నట్లుగానే సింపతీ వర్కవుటై రైతుబిడ్డ విన్నర్‌గా నిలిచాడు. ఈ సీజన్ రియాలిటీ షో రన్నరప్‌గా అమర్‌దీప్ స్థానం దక్కించుకున్నాడు. అయితే దాదాపు వంద రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ షో గ్రాండ్‌గా ముగిసింది. ఈ షో అనంతరం బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూ ఇవ్వడం కామన్. అందరిలాగే రన్నరప్ అమర్‌దీప్ సైతం ఇంటర్వ్యూకు హాజరైన ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో ఇంటిసభ్యుల గురించి అమర్‌దీప్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అమర్‌దీప్ మాట్లాడుతూ.. 'మొదటి 5 వారాలకే నా ఫర్మామెన్స్‌కు ఎలిమినేట్ అయిపోతానని డిసైడ్ అయిపోయా. రన్నరప్ అయినప్పటికీ నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. నేను ఎవరినైతే దేవుడిగా భావించానో ఆయనే కోట్ల ప్రజల ముందు ఒక అభిమానిగా నన్ను గుర్తించాడు. నా దృష్టిలో నేను గెలిచాను. శోభాశెట్టి, ప్రియాంక విషయాకొనిస్తే నాకు ఇద్దరు సమానమే. ఒకరు ఎక్కువ కాదు.. ఒకరు తక్కువ కాదు.' అని అన్నారు.
ఆ తర్వాత శివాజీ హౌస్‌లో ఉండగానే ప్రశాంత్‌ను విన్నర్‌ను చేసే పోతానని చెప్పారు కదా.. దీనికి మీ సమాధానమేంటి? అని అమర్‌దీప్‌ను యాంకర్ ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. ' మీరు అలా చెప్పి అనవసరంగా ఆయన్ను పైకి లేపకండి'.. ఆయన గేమ్ ఆడుకుని బయటికి వెళ్లిపోయాడు. ప్రశాంత్ తన గేమ్ తాను ఆడుకున్నాడు. కప్ కొట్టాడు అంతే' అని చెప్పారు. ఆ తర్వాత శివాజీ హౌస్‌లో లేకపోతే యావర్, ప్రశాంత్‌ను మీరంతా ఎప్పుడో తొక్కేసేవాళ్లా? అని మరో ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. 'నీ బలమేంటో తెలుసుకో.. పక్కోన్ని నమ్ముకో.. పక్కన పెట్టుకో.. ముందుకు రా..' అని సమాధానమిచ్చాడు. దీంతో ప్రోమో ముగిసింది. అయితే ఈ షో ముగిసిన తర్వాత అమర్‌దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment