రతిక జ్ఞాపకాలతో రాత్రంతా నిద్రపోని ప్రశాంత్‌.. రైతుబిడ్డపై రతిక పోస్ట్‌ | Rathika Rose Emotional Reaction On Pallavi Prashanth And Shivaji Conversation In Bigg Boss House, Goes Viral - Sakshi
Sakshi News home page

Rathika Rose On Pallavi Prashanth: రతిక బర్రె పిల్ల.. రాత్రంతా నిద్రపట్టలేదన్న ప్రశాంత్‌.. బ్యూటీ రియాక్షన్‌ చూశారా?

Published Thu, Oct 5 2023 3:50 PM | Last Updated on Thu, Oct 5 2023 4:31 PM

Rathika Rose Emotional Reaction On Pallavi Prashanth And Shivaji Conversation In Bigg Boss House, Goes Viral - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో అత్యంత దారుణమైన వ్యతిరేకతను మూటగట్టుకున్న కంటెస్టెంట్‌ ఎవరైనా ఉన్నారా? అంటే అది రతికానే! మొదట్లో బాగానే క్లిక్‌ అయిన ఈ బ్యూటీ కంటెంట్‌ కోసం అతి చేస్తూ నెమ్మదిగా ట్రాక్‌ తప్పింది. రైతు బిడ్డగా జనాల్లో సింపథీ ఉన్న పల్లవి ప్రశాంత్‌తో లవ్‌ ట్రాక్‌ నడిపి.. ఇది వర్కవుట్‌ అయ్యేలా లేదని అర్థం అయిన మరుక్షణం ప్లేటు ఫిరాయించింది. అప్పటినుంచి హౌస్‌ లోపల, బయట రతిక పతనం మొదలైంది.

డిప్రెషన్‌లో రతికరోజ్‌?
ప్రశాంత్‌ను టార్గెట్‌ చేయడం, తప్పు రెండు వైపులా ఉన్నా అవతలివారిదే తప్పని వాదించడం, కావాలని గొడవలు సాగదీయడం.. ఇలా చాలానే చేసింది. దీంతో జనాలు మాకొద్దీ కంటెస్టెంట్‌.. అని ఆమెను బయటకు పంపించేశారు. హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన రతిక రోజ్‌.. తనపై వచ్చిన నెగెటివిటీ చూసి డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎవరినీ కలవడానికి, ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా సుముఖంగా లేదు. తను చేసిన తప్పొప్పులను ఇప్పుడిప్పుడే బేరీజు వేసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో చేసిన పోస్ట్‌ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రశాంత్‌: అన్నా, నీకు రతిక గుర్తుకు వస్తుందా? నాకు రాత్రి తెగ గుర్తుకు వచ్చిందన్నా.. నిద్ర పట్టలేదు.
శివాజీ: నాకు గుర్తుకు వచ్చింది. కానీ ఏం చేస్తాంరా.. చిన్నపిల్ల.
ప్రశాంత్‌: అది చిన్న పిల్ల ఏందన్నా బర్రె పిల్ల.. మస్త్‌ కోపం వస్తుందన్నా..
శివాజీ: బయటకు వెళ్లాక కలుద్దాంలేరా, నువ్వు బాధపడకు, నాకు అర్థమైంది నీ బాధ.
ప్రశాంత్‌: రెండు మేకపోతులు తినిపించి చంపేస్తా అన్న దాన్ని.. నా మీద ఎందుకన్నా అంత కోపం? నేనేం చేశా? నామినేషన్‌ చేసినా కూడా మన అమ్మాయే కదా అని మాట్లాడిన.. కానీ, తను నన్ను నమ్మలేదు.
శివాజీ: చిన్న పిల్లరా ఒదిలేయ్‌..
ప్రశాంత్‌: బయటకు పోయాక నన్ను కలవదన్నా.. 

ఇలా ప్రశాంత్‌... రతికను తలుచుకుంటూ బాధపడ్డాడట! దీనిపై ఈ బ్యూటీ స్పందిస్తూ.. 'సో స్వీట్‌.. నేను కూడా వాళ్లను మిస్‌ అవుతున్నాను' అని రాసుకొచ్చింది. ఇది చూసిన జనాలు.. హౌస్‌లో ప్రశాంత్‌ను ఫుట్‌బాల్‌ ఆడావు, ఇప్పుడు జనాల రియాక్షన్‌ చూశాక మిస్‌ అవుతున్నానని నాటకాలు ఆడుతున్నావా? అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ఒకేసారి గుడ్‌ న్యూస్‌, బ్యాడ్‌ న్యూస్‌ చెప్పిన బిగ్‌బాస్‌.. కంటెస్టెంట్లకు విషమ పరీక్ష!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement