'నా లైఫ్‌లో ఎవ్వరూ ఇలా చేయలే'.. రైతు బిడ్డ ఎమోషనల్! | Bigg Boss Latest Promo Released Today Episode: Ulta-Palta Twist, Eviction Free Pass Task For Contestants - Sakshi
Sakshi News home page

Bigg Boss: 'సీజన్-7.. ఫస్ట్ కెప్టెన్.. రైతు బిడ్డ'.. గుండెలు బాదుకున్న ప్రశాంత్!

Published Wed, Nov 15 2023 4:30 PM | Last Updated on Wed, Nov 15 2023 6:05 PM

Bigg Boss Latest Promo Released Today Episode On Eviction Pass - Sakshi

బిగ్‌ బాస్ సీజన్-7 పదకొండో వారానికి చేరుకుంది. ఇప్పటికే మొదటి రెండు రోజులు నామినేషన్ల ప్రక్రియతో హౌస్‌లో ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ వారం ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. రైతు బిడ్డ ప్రశాంత్ మాత్రమే నామినేట్ కాలేదు. ఇక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బిగ్‌ బాస్ మరో కొత్త టాస్క్ ఇచ్చారు. కంటెస్టెంట్స్‌ మధ్య ర్యాంకుల పోటీ తీసుకొచ్చారు. మీలో మీరు కొట్టుకుని చావండి.. నన్ను మాత్రం ఎంటర్‌టైన్‌ చేయండి అన్నరీతిలో ర్యాంకింగ్ గొడవ తెచ్చారు. తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఆ ర్యాంకింగ్ పోటీ ఏ రేంజ్‌లో సాగిందో అర్థమవుతోంది.

(ఇది చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. వీడియో వైరల్!)

ప్రోమోలో పల్లవి ప్రశాంత్‌కు నంబర్‌వన్ ప్లేస్ ఇస్తానని శివాజీ చెప్పారు. దీంతో పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. నా లైఫ్‌లో ఎవ్వరు చేయలే.. అన్న చేసిండు.. పల్లవి ప్రశాంత్ సీజన్-7 ఫస్ట్ కెప్టెన్.. అంటూ గుండెలపై బాదుకున్నాడు. ఆ తర్వాత రతికా మాట్లాడుతూ.. ఫస్ట్ నాలుగు వారాలు నీ గేమ్ ఏమీ లేదు. నీకు ఒకరు హెల్ప్ చేస్తున్నది కనిపియట్లే. నీకు సొంతంగా ఆడుతున్నవో.. గ్రూపుగా ఆడుతున్నావో కనిపియట్లేదు అని అనడంతో.. అక్కా.. నువ్వు మా అమ్మ, బాపును తిట్టినవ్..గడ్డం గీకెస్తా అ‍న్నావ్ అంటూ ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. ఇదేనా ఒక అమ్మాయికి ఇచ్చే మర్యాద అంటూ యావర్‌పై అశ్విని మండిపడింది. దీంతో వెంటనే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు.. డోంట్‌ టీచ్‌ మీ దట్.. అని యావర్‌ అన్నాడు. 

ఆ తర్వాత మొదటి పది ర్యాంకుల్లో నిలిచిన వారికి బిగ్ బాస్ ఊహించని విధంగా షాకిచ్చాడు. ఈ సీజన్ ఉల్టా- పుల్టా అని మనకు తెలిసిందే. దీంతో ఆటలో వీకెస్ట్ అనిపించిన వారికే అంటే.. చివరి ఐదు స్థానాల్లో నిలిచిన వారికే ఎవిక్షన్‌ పాస్ పొందే అవకాశముందని ప్రకటించాడు. దీంతో ఎవిక్షన్ పాస్ కోసం ఐదుగురు కంటెస్టెంట్స్‌కు ఓ టాస్క్ ఇచ్చాడు. చివరి ఐదు స్థానాల్లో ఉన్న అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక పోటీపడ్డారు. మరీ ఈ గేమ్‌లో ఎవరు గెలిచారు? ఎవరినీ ఎవిక్షన్ పాస్ వరించిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. 

(ఇది చదవండి: ఈ చిన్నారులిద్దరూ ఇప్పుడు హీరోహీరోయిన్స్‌.. గుర్తుపట్టారా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement