బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ముందు గేటు నుంచి రావద్దని పోలీసులు చెప్పినా కూడా ప్రశాంత్ రావడం వల్ల అక్కడ పరిస్థితి కంట్రోల్ చేయడం తమ వల్ల కాలేదేని ఆ సమయంలో పోలీసులు తెలిపారు. ఆ సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజాగా ఈ కేసు విషయంపై హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్‌కుమార్ సాక్షి మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్‌పై కక్షసాధింపు చర్యలు తగవని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని ఆయన చెబుతూ ప్రశాంత్ బెయిల్ గురించి ఇలా మాట్లాడారు. 'ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు.. కానీ ఇప్పటి వరకు కనీసం నిందితుడికి FIR కాపీ ఇవ్వడం లేదు. ఈ కేసుల వల్ల భయపడిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దీంతో Fir కాపీ కోసం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్‌ను నేను సంప్రదించాను.
కానీ ఆయన మాత్రం FIR కాపీ కొసం కుటుంబ సభ్యులు రావాలని తెలుపుతున్నారు. కేసు ఏదైనా సరే FIR కాపీని మాత్రం పబ్లిక్ డొమైన్‌లో పెట్టాల్సిన బాధ్యత పొలిసులకు ఉంది. FIR కాపీ ఉంటేనే ప్రశాంత్‌కు బెయిల్ దరఖాస్తు చేసుకునేందకు అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆ కాపీ ఇవ్వకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో FIR కాపీ చూస్తేనే తెలుస్తుంది.' అని హైకోర్టు న్యాయవాది కే రాజేశ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment