బిగ్‌బాస్ విన్నర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా కొల్గూరులో పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీ హిల్స్ పీఎస్‌కు స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
రియాలిటీ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ర్యాలీగా రావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్‌తో పాటు అభిమానులపై కూడా పోలీసులు నమోదు చేశారు. స్టూడియో బయట జరిగిన ఘర్షణల్లో కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఈ గొడవలో ప్రశాంత్‌తో సహా మొత్తం ఐదుగురిపై కేసు నమోదైంది.
ఇప్పటికే ఇద్దరు అరెస్ట్
ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చగా.. ఎ-2గా అతడి సోదరుడు మనోహర్‌ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్‌ను చేర్చారు. అయితే, ఈ కేసులో ఎ-4గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్‌లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయికిరణ్ (25)ను, అంకిరావుపల్లి రాజు (23)ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు.
ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వాలన్న ప్రశాంత్ లాయర్
బిగ్‌బాస్ సీజన్–7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కక్షసాధింపు చర్యలు తగవని హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్‌కుమార్ అన్నారు. ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ప్రశాంత్‌పై వివిధ సెక్షన్లతో కేసు నమోదైనట్లు వార్తలొచ్చినా.. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆన్‌లైన్‌లో పెట్టలేదని తెలిపారు. సామాన్య రైతు బిడ్డగా వెళ్లి బిగ్‌బాస్ టైటిల్‌ను గెలుచుకున్న యువకునికి ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment