టచ్ చేస్తూ ప్రశాంత్ గొడవ.. రతిక మాస్ వార్నింగ్! | Bigg Boss 7 Telugu Day 16 Promo: Rathika Rose Strong Warning To Pallavi Prashanth - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: మళ్లీ పులిహోర షురూ.. కాసేపటికే ప్రశాంత్-రతిక గొడవ!

Published Tue, Sep 19 2023 4:47 PM | Last Updated on Tue, Sep 19 2023 5:00 PM

Bigg Boss 7 Telugu Promo Latest Day 16 - Sakshi

'బిగ్‌బాస్ 7' మూడో వారంలోకి అడుగుపెట్టేసింది. తొలి రెండు వారాల్లో కిరణ్, షకీలా ఎలిమినేట్ అయిపోయారు. ఇక తాజా నామినేషన్స్‌లో ఏకంగా ఏడుగురు నిలిచారు. అయితే ఈసారి సోమవారం ఎపిసోడ్ కాస్త ప్లెయిన్ గానే జరిగినప్పటికీ ఆ తర్వాత గొడవలు, స్కెచ్‌లు, టాస్కులతో హౌస్ అంతా హీటెక్కిపోయింది. ఇంతకీ బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమోలో ఏముంది?

మళ్లీ పులిహోర మొదలు
తొలివారం రతికతో ప్రశాంత్ గట్టిగా పులిహోర కలిపేశాడు. రెండో వారం వచ్చేసరికి అది బ్యాక్ ఫైర్ అయిపోయింది. దీంతో ఇద్దరూ మాట్లాడుకోవడమే మానేశారు. మూడోవారం వచ్చేసరికి మళ్లీ మొదటికొచ్చారు. తన మైండ్ బ్లాంక్ అయిపోయిందని రతిక ఏడుస్తుంటే.. ఆమెని కూల్ చేసేందుకు ప్రశాంత్ ఫర్టింగ్ చేశాడు. కంట్లో నుంచి నీళ్లు రాకుండా పాలలెక్క వస్తున్నాయి ఏందని అన్నాడు. దీంతో ఆమె సిగ్గు పడిపోతూ నవ్వేసింది.

(ఇదీ చదవండి: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం..!)

చేతులేయడంతో గొడవ
రెండో ప్రోమోలో భాగంగా మూడు వారాల ఇమ్యూనిటీ టాస్క్ కోసం అమరదీప్, శోభాశెట్టి, యవర్‌ని బిగ్‌బాస్ సెలెక్ట్ చేశాడు. అయితే వీళ్లలో ఎవరు పోటీకి అనర్హులో చెప్పమని మిగిలిన వాళ్లని అడిగాడు. దీని తర్వాత ఏ విషయం గురించో తెలీదు గానీ ప్రశాంత్-రతిక గొడవపడ్డారు. 'హే పో' అని ప్రశాంత్.. రతికని టచ్ చేస్తూ అరిచాడు. దీంతో సీరియస్ అయిన రతిక.. మర్యాదగా ఉండదు చెబుతున్నా అని వార్నింగ్ ఇచ్చింది. అయితే అసలు ఎందుకు గొడవపడ్డారు? ఏం జరిగిందనేది తెలియాలంటే మంగళవారం ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

నామినేషన్స్ సంగతేంటి?
ఈ వారం నామినేషన్స్‌లో శుభశ్రీ, గౌతమ్, అమరదీప్, ప్రియాంక, దామిని, రతిక, యవర్ ఉన్నారు. వీళ్లలో ప్రస్తుతానికి అయితే ఓటింగ్ విషయంలో అమర్ టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దామిని చివరి స్థానంలో ఉన్నట్లు సమాచారం. మూడో ఎలిమినేషన్‌కి ఇంకా నాలుగైదు రోజుల టైముంది కాబట్టి అంతలో ఏదైనా జరగొచ్చు. ఓటింగ్ తారుమారు కావొచ్చనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ప్రభాస్‌, మహేశ్‌ తర్వాత బన్నీనే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement