రెండో పవరస్త్ర కోసం జరిగిన పోటీతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక శనివారం ఎపిసోడ్‌లో ఎప్పటిలానే హోస్ట్ నాగార్జున వచ్చేశాడు. అందరినీ నవ్విస్తూనే.. ఓవైపు చేసిన పనులకు మెచ్చుకుంటూ మరోవైపు ఎవరికి ఇవ్వాల్సిన డోస్ వాళ్లకు ఇచ్చేశాడు. ఇక చివర్లో నామినేషన్స్ గురించి కూడా చెప్పి భయపెట్టాడు. ఇంతకీ 'బిగ్‌బాస్'లో 13వ రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: పెళ్లి పనులు మొదలుపెట్టిన మెగాకపుల్)
యవర్ అది మర్చిపోలేదు
మాయస్త్ర ఇచ్చే విషయమై రతిక తనని సపోర్ట్ చేయడంపై యవర్ మాట్లాడాడు. ఆమెపై గౌరవం పెరిగిందని అన్నాడు. ఇక తనకు అన్యాయం జరగడంపై.. మార్నింగ్ ఎక్సరసైజ్ చేస్తూ శుభశ్రీతో మాట్లాడాడు. 'ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు.. డర్టీ పాలిటిక్స్ జరుగుతున్నాయి' అని కెమెరాని చూస్తూ అన్నాడు. కాసేపటికి బెడ్ రూంలో అందరూ ఉన్న టైంలో ప్రిన్స్-గౌతమ్ మధ్య షకీలా కాంప్రమైజ్ చేసింది. అలానే రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర.. రూంలో నిద్రపోవడం గురించి సందీప్ చెప్పిన ప్రిన్స్ వినలేదు. అతడితో గొడవపడ్డాడు.
ఈసారి కింగ్స్ మీటర్
శుక్రవారం జరిగింది అంతా చూసిన నాగార్జున.. శనివారం కంటెస్టెంట్స్‌తో మాట్లాడేందుకు వచ్చేశాడు. గతవారం ఆడియెన్స్ చెప్పారు, ఈసారి మాత్రం కింగ్స్ మీటర్‌తో తానే చెబుతానని అన్నాడు. అలా ఒక్కో కంటెస్టెంట్స్ ఈ వారం ఎక్కడ రైట్ ఎక్కడ రాంగ్ చేశారనేది చెప్పుకొచ్చాడు. అలానే రెండో పవరస్త్ర గెలుచుకున్నది శివాజీ అని అనౌన్స్ చేశారు. 'బిగ్‌బాస్' అరిచే గేమ్‌లో శివాజీకి అత్యధికంగా 11 పాయింట్లు వచ్చాయి.
(ఇదీ చదవండి: రెచ్చిపోతున్న తెలుగమ్మాయి.. 'జవాన్' బ్యూటీ గ్లామర్ ట్రీట్)
శివాజీకి పడ్డాయి
గేమ్, టీమ్ ని లీడ్ చేసే విషయంలో శివాజీని సూపర్ అని మెచ్చుకున్న నాగ్.. 'తలుపు తీయరా సామీ బయటకెళ్లిపోతా' అని బిగ్‌బాస్‌తో పదేపదే అనడంపై నాగ్ ఓ రేంజులో కౌంటర్స్ వేశాడు. అది కరెక్ట్ కాదన్నాడు. అమర్‌దీప్ కూడా బాగానే ఆడాడని చెప్పిన నాగ్.. ప్రశాంత్ నామినేషన్ టైంలో చెప్పిన పాయింట్ మాత్రం కరెక్ట్ కాదని హితబోధ చేశాడు. షకీలా గురించి మాట్లాడుతూ.. వయసుతో శరీరానికి సంబంధం లేదు. వయసుకు తగ్గట్లు కాదు వయసుకు మించి ఆడాలని నాగ్ ఆమెతో చెప్పాడు.
రైతుబిడ్డ తుస్
సందీప్‌ని బాగా ఆడుతావని మెచ్చుకున్న నాగార్జున.. శుభశ్రీ, ప్రియాంక ఇంకా బాగా ఆడాలని వాళ్లతోనే అన్నాడు. అయితే రైతుబిడ్డ ప్రశాంత్‌కి మాత్రం గట్టిగా కౌంటర్స్ పడ్డాయి. ఒక మొక్కని చూసుకోలేనివాడు రైతుబిడ్డా? అని నాగ్ అనేసరికి ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు. బిగ్‌బాస్‌ని అడిగి మరో మొక్క పంపిస్తా. ఈసారి గానీ మొక్క మాడిపోతే.. నామినేషన్స్‌లో అందరూ చెప్పింది నిజమని తాను నమ్ముతా అని నాగ్ ప్రశాంత్ గాలి మొత్తం తీసేశాడు.
(ఇదీ చదవండి: ఓటీటీ హీరోయిన్‌గా మారిపోతున్న బ్యూటీ.. మరో కొత్త మూవీ)
యవర్‌కి గీతోపదేశం
ప్రిన్స్ యవర్‌తో మాట్లాడిన నాగ్.. నీ అరుపులతో మేం డిసప్పాయింట్ అయ్యాం. బాగా ఆడావ్. ఎక్సప్రెస్ చేయ్ కానీ అరవాల్సిన అవసరం లేదు, అన్యాయానికి అరిస్తే న్యాయం జరగదు. నీకు రివార్డ్ దొరకదని చెప్పాడు. గౌతమ్ స్టెరాయిడ్స్ అని సైగ చేయడంపై మాట్లాడిన నాగ్.. అక్కడే గౌతమ్‌తో యవర్‌కి సారీ చెప్పించాడు. గౌతమ్‌తో మాట్లాడిన నాగ్.. ఏ గేమ్ లోనూ గెలవలేదు, వ్యక్తిగతంగానూ గెలుచుకోలేకపోయావ్. ఇంప్రూవ్ యువర్ గేమ్ అని నాగార్జున చిన్న వార్నింగ్ ఇచ్చాడు.
వాళ్లు ఇంకా డేంజర్‌లోనే
మిగతావాళ్లలో శుభశ్రీ, దామిని, శోభాశెట్టి, తేజ సరిగా ఆడటం లేదని హెచ్చరించిన నాగార్జున.. రతికకి మాత్రం గట్టిగానే ఇచ్చాడు. టీమ్ గేమ్ అంటే టీమ్ గేమ్ ఆడాలి, ఒక్కటే పాయింట్ పట్టుకుని మొండితనం కరెక్ట్ కాదు, బఫూన్ అంటే ఏంటో తెలుసా? అని అన్నాడు. ఆట ఆడు.. మనుషులతో ఆడుకోవద్దని చెప్పి కూల్ చేశాడు. ఇకపోతే రెండో పవర్ అస్త్ర గెలుచుకున్న శివాజీ.. నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయాడు. అమర్‌దీప్ కూడా సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించారు. దీంతో ఏడుగురు అంటే ప్రశాంత్, షకీలా, గౌతమ్, యావర్, తేజ, శోభాశెట్టి, రతిక.. ఇంకా డేంజర్ లో ఉన్నారని చెప్పాడు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. మరి రెండో వారం హౌస్ నుంచి వెళ్లిపోయేది ఎవరో ఆదివారం తేలనుంది. ఆ కంటెస్టెంట్స్ ఎవరని మీరనుకుంటున్నారు?
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్!)
Comments
Please login to add a commentAdd a comment